MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: కన్నతల్లి ఒడిలో దీప- నోరుజారిన దశరథ- జ్యో, పారు డౌట్- కార్తీక్ షాక్

Karthika Deepam 2 Today Episode: కన్నతల్లి ఒడిలో దీప- నోరుజారిన దశరథ- జ్యో, పారు డౌట్- కార్తీక్ షాక్

Karthika Deepam 2 Today Episode (మే 25వ తేదీ)లో కన్నతల్లి ఒడికి చేరిన దీప. కోపంతో రగిలిపోయిన జ్యో. కాంచన, జ్యోల వాదన. నోరుజారిన దశరథ. డౌట్ పడ్డ పారు, జ్యో. కార్తీక్, దీపలకు గుడికి వెళ్లడానికి జ్యో పర్మిషన్. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : May 25 2026, 08:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో అమ్మ ఒడిలో తల పెట్టుకొని హాయిగా పడుకోవాలని ఉందని సుమిత్రతో చెప్తుంది దీప. రా దీప నన్నే నీ కన్నతల్లి అనుకో. నా ఒడిలో నిద్రపో అని పిలుస్తుంది సుమిత్ర. కన్నతల్లి ఒడిలో పడుకొని ఎమోషనల్ అవుతుంది దీప. అప్పుడే వచ్చిన జ్యోత్స్న అది చూసి షాక్ అవుతుంది. తను దీపతో చేసిన ఛాలెంజ్ గుర్తు చేసుకొని సాధించావు కదే.. అని లోలోపల రగిలిపోతుంది.

ట్యాబ్లెట్స్ వేసుకున్నావా లేదా అని అడగడానికి వచ్చాను మమ్మీ అని చెప్తుంది జ్యోత్స్న. వేసుకున్నాను వెళ్లి పడుకోమని చెప్తుంది సుమిత్ర. దీప మాములుగా పడుకోలేదా అని అడుగుతుంది జ్యోత్స్న. ఇప్పుడు మా అమ్మకు అమ్మమ్మే అమ్మ అని శౌర్య దీప ఒడిలో పడుకుంటుంది. కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్యోత్స్న.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
దశరథ సంతోషం
Image Credit : Jiohotstar

దశరథ సంతోషం

అప్పుడే వచ్చిన కార్తీక్, దశరథ తల్లీకూతుర్లను చూసి మురిసిపోతారు. ఇది చూసి మనకు ఎంత ఆనందంగా ఉందో, జ్యోత్స్నకు అంత కోపంగా ఉంటుంది అంటాడు దశరథ. ఆ తర్వాత ముగ్గురిని కలిపి ఒక ఫోటో తీసుకుంటాడు. నీ కోరిక తీరింది దీప. కానీ ఈ రోజు జ్యోత్స్నకు నిద్ర పట్టదు అని మనసులో అనుకుంటాడు కార్తీక్.

37
జ్యో, కాంచన వాదన
Image Credit : Jiohotstar

జ్యో, కాంచన వాదన

మరోవైపు ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది జ్యోత్న్స. పడుకోమంటే తిరుగుతున్నావేంటే అంటుంది కాంచన. నిద్ర రావట్లేదు అని చెప్తుంది జ్యోత్స్న. దీన్నే పెళ్లేరియా అంటారే. పెళ్లి కానీ అమ్మాయిలకు వచ్చే జబ్బు ఇది అంటుంది కాంచన. నా పెళ్లి బాధ్యత నీ కొడుకే తీసుకున్నాడుగా. త్వరగా చేయమని చెప్పు అంటుంది జ్యోత్స్న. 

నువ్వు తెలివైన దానివే అందుకే.. మీ తండ్రి, తాతను వదిలేసి నా కొడుకు మీద పడ్డావ్ అంటుంది కాంచన. అంతా బాగుంటే నేను నీ కోడలు అయ్యేదాన్ని అంటుంది జ్యో. వామ్మో నీలాంటిదాన్ని ఎవరు భరిస్తారు అంటుంది కాంచన. ఆ దీప ఏమైనా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటోందా అని అడుగుతుంది జ్యోత్స్న. దీప నీకంటే వెయ్యి రెట్లు బెటర్ అంటుంది కాంచన. కాసేపు అలా వాదించుకొని పడుకుంటారు జ్యో, కాంచన.

47
నోరుజారిన దశరథ
Image Credit : Jiohotstar

నోరుజారిన దశరథ

మరుసటి రోజు ఉదయం పూజ గంట గట్టిగా వినిపిస్తే.. చిరాకుగా నిద్ర లేస్తుంది జ్యోత్స్న. ఈ గ్రానీ ఏం పనిలేదు అనుకుంటూ బయటకు వస్తుంది. కిందకు వచ్చి చూస్తే దీప పూజ చేస్తుంటుంది, శౌర్య గంట కొడుతూ ఉంటుంది. ఈ రోజు హాలీడే కదా ప్రశాంతంగా పడుకుందామనుకున్నాను. పొద్దున్నే మాకు ఈ టార్చర్ ఏంటి అంటుంది జ్యోత్స్న. దీప పూజ గురించి శివన్నారాయణ మెచ్చుకుంటాడు. పుట్టింట్లో అడుగు పెట్టిన మొదటి రోజే ఇంటిని దేవాలయంలా మార్చేసింది నా కూతురు అని నోరుజారుతాడు దశరథ.

అంతా షాక్ అవుతారు. అంటే డాడీకి నిజం తెలిసే మౌనంగా ఉన్నాడా అని జ్యో, పారు ముఖం చూస్తుంది. ఇలా మాట్లాడానేంటి అని మనసులో అనుకుంటాడు దశరథ. అవును మా అమ్మ దశరథ తాత కూతురే. సుమిత్ర అమ్మమ్మ మా అమ్మకు అమ్మ అని అంటుంది శౌర్య. మా అమ్మకు అమ్మనాన్న ఉన్నారు. అమ్మమ్మ, తాతయ్యే మా అమ్మకు అమ్మ నాన్న అని చెప్తుంది శౌర్య.

మమ్మీకి నిజం తెలిసిపోయినట్లుంది. అందుకే రాత్రి దీపను ఒడిలో పడుకోబెట్టుకుంది, బావ నిజం చెప్పేసుంటాడు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. దీప కడుపుతో ఉందిగా... ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు తనను సొంత కూతురులా చూసుకుందామని సుమిత్ర చెప్తే.. అలాగే చేశాను అని కవర్ చేస్తాడు దశరథ.

57
కార్తీక్ వెటకారం
Image Credit : Jiohotstar

కార్తీక్ వెటకారం

చూసేవాళ్లకు అలా కనిపించట్లేదు అంటుంది జ్యోత్స్న. మరి ఎలా కనిపిస్తోంది? దీపే సొంత కూతురు అయినట్లు, నువ్వు పరాయిదానివి అయినట్లు కనిపిస్తుందా అని అంటాడు కార్తీక్. షాక్ అవుతుంది జ్యోత్స్న. ఏదో తేడాగా ఉంది అనుకుంటూ లోపలికి వెళ్తుంది. జ్యోత్స్నకు అనుమానం వచ్చినట్లుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు దశరథ. ఈ దశరథ ఏంటి దీపను ప్రతిసారి కూతురు అంటున్నాడు. దీపకు బాగానే ఉంటుంది గానీ జ్యోత్స్న ఫీల్ అవుతుంది కదా అని మనసులో అనుకుంటాడు శివన్నారాయణ.

67
సిగ్గుపడ్డ కాశీ, స్వప్న
Image Credit : Jiohotstar

సిగ్గుపడ్డ కాశీ, స్వప్న

మరోవైపు కాశీ, దాసు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు, కోడలు సంతోషంగా ఉన్నారు, కానీ మా కోరికే ఇంకా నెరవేరలేదు అంటాడు దాసు. పిల్లల గురించి మాట్లాడుతున్నావా నాన్న అని అంటాడు కాశీ. అవును నీకు అన్నీ బాగానే తెలుస్తాయి అంటాడు దాసు. నీ కోడలే ఒక చిన్నపిల్లా తనకు ఇంకో చిన్న పిల్లనా అంటాడు కాశీ. ఆడవాళ్ల గురించి గొప్పగా మాట్లాడి వెళ్లిపోతాడు దాసు. ఆ మాటలు విన్న స్వప్న. పాపం వాళ్లు ఆడుకోడానికి ఒక బుజ్జి పాపాయిని అడుగుతున్నారు.. ఇచ్చేద్దామా అంటుంది స్వప్న. సంతోషిస్తాడు కాశీ. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడతారు. ఆ తర్వాత స్వప్న, కాశీని హగ్ చేసుకుంటుంది.

77
కార్తీక్, దీప షాక్
Image Credit : Jiohotstar

కార్తీక్, దీప షాక్

ఇంకోవైపు గుడికి వెళ్తానని కాంచనతో చెప్తుంది దీప. ఒక్కదానివే ఎలా వెళ్తావు, కార్తీక్ ని తీసుకెళ్లమని అంటుంది కాంచన. ఇప్పుడు నేను వెళ్తాను అంటే పెద్ద మేడం వంద కండీషన్లు పెడుతుంది. దానివల్ల అందరి మధ్య గొడవలు వస్తాయి. ఇదంతా అవసరమా అంటాడు కార్తీక్. ఆ మాటలు విన్న జ్యోత్స్న నువ్వు దీప గుడికి వెళ్లొచ్చు అని షాక్ ఇస్తుంది జ్యోత్స్న. ఒక గంటలో తిరిగి రావాలని కండీషన్ పెడుతుంది. ఈ గంట మీరు పోవడానికి, రావడానికే సరిపోతుంది. ఇంకా ఏం మాట్లాడుకుంటారు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Recommended image2
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image3
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: దీపకు జ్యో వార్నింగ్- జ్యోకు కార్తీక్ కౌంటర్- జ్యోపై సుమిత్ర కోపం
Recommended image2
Karthika Deepam 2 Today Episode:సూపర్ ఎపిసోడ్-జ్యోతో ఓ రేంజ్ లో ఆడుకున్న దీప,కార్తీక్-అమ్మ ఒడికి దీప
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved