MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాతో హిట్ కొట్టిన త్రిష, ఇంతకీ ఏంటా మూవీ?

అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాతో హిట్ కొట్టిన త్రిష, ఇంతకీ ఏంటా మూవీ?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. హీరోల విషయంలోనే కాదు, హీరోయిన్ల విషయంలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఈక్రమంలో అనుష్క  రిజెక్ట్ చేసిన ఓ సినిమాలో త్రిష నటించి హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 26 2025, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Instagram / Anushka

టాలీవుడ్ ను ఊపేసిన స్టార్ హీరోయన్

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా టాలీవుడ్ ను ఒక దశాబ్ధం పాటు ఊపు ఊపేసింది అనుష్క శెట్టి. కమర్షియల్ పిక్చర్స్ తో పాటు కాన్సెప్ట్ బేస్ మూవీస్, ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో అదరగొట్టింది. అరుంధతి లాంటి సినిమాలతో అద్భుతం చేసింది అనుష్క శెట్టి. గ్లామర్ హీరోయిన్ యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆతరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హీరోలను మించిన ఇమేజ్ ను సాధించింది. టాలీవుడ్ లో నాగార్జున సూపర్ సినిమాతో కెరీర్ స్టార్ చేసిన స్వీటీ.. ఆతరువాత తిరిగి చూసుకోలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Instagram / Anushka

స్టార్ హీరోలకు సమానంగా అనుష్క ఇమేజ్ 

టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అనుష్క గుమ్మం ముందు వచ్చి నిలుచుకున్నాయి. తెలుగులో నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ, గోపీచంద్ లాంటి హీరోలతో సినిమాలు చేసింది. తమిళంలో సూర్య, విక్రమ్, విశాల్ లాంటి స్టార్స్ తో ఆడిపాడింది బ్యూటీ. టాలీవుడ్ లో ప్రభాస్ తో ఎక్కువ సినిమాల్లో నటించింది అనుష్క. బాహుబలి సినిమాతో వీరి బంధం బలపడింది.

 ప్రభాస్, అనుష్క స్నేహంపై రకరకాల రూమర్స్ కూడా వచ్చాయి. వీరు ప్రేమలోఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న వార్తలు వ్యాపించాయి. ఇద్దరు ప్రేమించుకున్నారు కాబట్టే 40 ఏళ్లుదాటిని పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్లుగా ఉండిపోయారని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇవేమి పట్టించుకోకుండా ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు.

Related Articles

Related image1
మెగాస్టార్ కెరీర్ లో షూటింగ్ పూర్తయి, రిలీజ్ ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?
Related image2
జపాన్ లో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా?
35
Image Credit : Instagram / Anushka

బరువు పెరగడంతో ఇబ్బందులు 

అనుష్కకు అరుంధతి సినిమాతో హీరోలను మించిన స్టార్ డమ్ వచ్చింది. ఆతరువాత బాహుబలి సినిమాతో అనుష్క దేవసేన పాత్రలో అదరగొట్టింది. ఈ సినిమా తరువాత అనుష్క కెరీర్ పరుగులు పెడుతుంది అనుకున్నారంతా. కాని బాహుబలి తరువాత ఆమె ఎక్కువగా సినిమాలు చేయలేదు. బాగమతి, సైజ్ జీరో, నిశబ్ధం లాంటి సినిమాలు అనుష్క కెరీర్ లో ముందుకు వెళ్లడానికి పెద్దగా ఉపమోగపడలేదు. ఆతరువాత చిన్నగా స్క్రీన్ నుంచి కనుమరుగు అయ్యింది స్వీటి. మరీ ముఖ్యంగా సైజ్ జీరో సినిమా కోసం అనుష్క బరువు పెరగడం ఆమెకెరీర్ ను గట్టిగా దెబ్బతీసింది.

45
Image Credit : instagram /Anushka trisha

ఆతరువాత ఎంత ప్రయత్నం చేసినా బరువు తగ్గలేకపోయిందట అనుష్క. కొన్నాళ్లు సైలెంట్ అయిన అనుష్క.. రీసెంట్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో కంబ్యాక్ ఇచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం అనుష్క ఘాటీ అనే ఉమెన్ ఒరియోంటెడ్ సినిమాలో నటిస్తోంది.

55
Image Credit : instagram / trisha

అనుష్క రిజెక్ట్ చేస్తే, త్రిష హిట్ కొట్టిన సినిమా 

ఈమధ్యలో అనుష్క కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసిందని సమాచారం. స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చినా ఆమె సున్నితంగా రిజెక్ట్ చేసిందట. ఈమధ్య కాలంలో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాతో త్రిష బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఆ సినిమా మరెదో కాదు.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్). విజయ్ దళపతి నటించిన ఈ సినిమాలో ముందుగా అనుష్కను ఎంపిక చేశారట. 

కానీ వేరే కారణాలతో అనుష్క ఈ సినిమా నుంచి తప్పుకోగా, వెంటనే మూవీ టీమ్ త్రిషను సంప్రదించారట. అప్పుడే పొన్నియన్ సెల్వన్ సినిమాతో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన త్రిష ఈ సినిమాకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోట్ సినిమా తమిళనాటు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది మూవీ.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనుష్క శెట్టి
త్రిష
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image2
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image3
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
మెగాస్టార్ కెరీర్ లో షూటింగ్ పూర్తయి, రిలీజ్ ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
జపాన్ లో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved