- Home
- Entertainment
- Jayasudha: మేకప్ లేకుండా వేశ్యగా జయసుధ, ఏఎన్నార్ భయపడ్డాడు, రంగంలోకి దాసరి.. శ్రీదేవి కూడా తేలిపోయింది
Jayasudha: మేకప్ లేకుండా వేశ్యగా జయసుధ, ఏఎన్నార్ భయపడ్డాడు, రంగంలోకి దాసరి.. శ్రీదేవి కూడా తేలిపోయింది
Jayasudha: జయసుధ తన కెరీర్లో ఒక సినిమాలో వేశ్య పాత్ర పోషించింది. ఇందులో ఆమె పాత్ర కోసం అడిగేందుకు అక్కినేని నాగేశ్వరరావు భయపడ్డాడట. దీంతో దాసరి రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరి శ్రీదేవి రియాక్షన్ ఏంటంటే?

జయసుధ వేశ్య పాత్ర
జయసుధ సహజనటిగా పేరుతెచ్చుకుంది. గ్లామర్ కి ప్రయారిటీ ఇవ్వకుండా కేవలం నటనకు ప్రయారిటీ ఇచ్చి, పాత్రలకు ప్రయారిటీ ఇచ్చి సినిమాల చేసి మెప్పించింది. సహజమైన నటనతో ఆకట్టుకుంది. అందుకే సహజనటిగా పేరుతెచ్చుకుంది. అయితే కొన్ని గ్లామర్ రోల్స్ కూడా చేసింది జయసుధ. ఈ క్రమంలో ఆమె ఓ సినిమాలో వేశ్యగా నటించాల్సి వచ్చింది. శ్రీదేవి హీరోయిన్ చేయగా, తాను ప్రాస్టిట్యూట్గా, డీ గ్లామర్ లుక్లో కనిపించింది. శ్రీదేవి వంటి అందగత్తె ముందు అంటేనే తేలిపోతారు, అలాంటిది మేకప్ లేకుండా నటించడం అంటే సాహసమే కానీ జయసుధ చేసింది వాహ్ అనిపించింది. మరి ఆ సినిమా ఏంటి? ఏఎన్నార్ ఎందుకు భయపడ్డాడు, దాసరి ఏం చేశాడు? దాని వెనుక కథేంటి అనేది చూస్తే.
జయసుధని అడిగేందుకు భయపడ్డా అక్కినేని, రంగంలోకి దాసరి
ఏఎన్నార్ హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో `ప్రేమాభిషేకం` రూపొందింది. ఇందులో శ్రీదేవి మెయిన్ హీరోయిన్గా చేయగా, జయసుధ వేశ్యగా కీలక పాత్రలో నటించింది. అయితే అప్పటి వరకు స్టార్ హీరోయిన్గా రాణించే జయసుధని వేశ్య పాత్రకి అడగాలంటే అందరిలోనూ టెన్షన్. ఈ సలహా ఏఎన్నార్ నుంచే వచ్చింది. కానీ ఆయన జయసుధని ఈ పాత్రకి అడగడానికి భయపడ్డాడట. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని టెన్షన్ పడ్డాడట. అడిగేందుకు ధైర్యం చేయలేకపోయారు.
దీంతో ఇక లాభం లేదని దాసరి నారాయణ రావు రంగంలోకి దిగాడు. ఆయన జయసుధని పిలిపించి మాట్లాడాడట. ఆమెకి తన పాత్రని వివరించడంతో జయసుధ కన్విన్స్ అయ్యింది. అయితే శ్రీదేవి ముందు ఇలాంటి పాత్ర చేయడం సాహసమే అని తాను కూడా భావించిందట. అదే సమయంలో తానేంటో నిరూపించుకునేందుకు ఇదే మంచి ఛాన్స్ గా భావించిందట. ఢీ గ్లామర్ లుక్లో అదరగొట్టొచ్చు అనుకుందట.
శ్రీదేవిని డామినేట్ చేస్తూ అన్ని అవార్డులు జయసుధకే
వేశ్య పాత్ర కాబట్టి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని టెన్షన్ పడ్డారట. కానీ ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని, ఈ సినిమాలో శ్రీదేవి కంటే తనకే ఎక్కువ పేరు, గుర్తింపు వచ్చిందట. ఆ ఏడాది అన్ని అవార్డులు తనకే వచ్చాయని, చాలా మంది అప్రిషియేట్ చేశారని జయసుధ తెలిపారు. శ్రీదేవి అందులో తేలిపోయిందని, ఆమె షాక్ అయ్యిందని వెల్లడించింది. యాంకర్ స్వప్నకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది జయసుధ.
అయితే జయప్రద, శ్రీదేవి వంటి వారితో పోటీ ఉన్నప్పటికీ తాను అవేం పట్టించుకునేదాన్ని కాదని వెల్లడించింది. తనకు అలాంటి ఫీలింగ్లేవి ఉండేవి కావని చెప్పారు. సెట్లోనూ జోవియల్గా ఉంటానని, పక్కన హీరో ఉన్నాడు, అలా ఉండాలి, ఇలా ఉండాలనేది పట్టించుకునేదాన్ని కాదని చెప్పింది జయసుధ.
ప్రేమాభిషేకం సంచలన విజయం
ప్రేమాభిషేకం మూవీ 1981 ఫిబ్రవరి 16న విడుదలైంది. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావు హీరోగా నటించగా, శ్రీదేవి, జయసుధ హీరోయిన్లుగా కనిపించారు. మోహన్ బాబు, మురళీ మోహన్ కీలక పాత్రలు పోషించారు. ఏఎన్నార్ నిర్మించారు. అక్కినేని వెంకట్, నాగార్జున నిర్మాతలు. ఈ చిత్రం అప్పట్లో పెద్ద విజయం సాధించింది. వంద రోజులకుపైగా ఆడింది. ఒక సెంటర్లో ఏకంగా రూ.46లక్షలు వసూలు చేసిందట. అప్పట్లో ఇదొక సంచలనంగా చెప్పొచ్చు.















