MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Trisha Remuneration: ఒక్క దెబ్బతో డబుల్‌ అయిన త్రిష రెమ్యూనరేషన్‌.. కారణం సీఎం అంటూ రచ్చ

Trisha Remuneration: ఒక్క దెబ్బతో డబుల్‌ అయిన త్రిష రెమ్యూనరేషన్‌.. కారణం సీఎం అంటూ రచ్చ

Trisha Remuneration: త్రిష ఇప్పుడు హీరోయిన్‌గానే కాకుండా రాజకీయ పరంగానూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. అయితే సడెన్‌గా ఈ అమ్ముడు పారితోషికం పెంచిందట. కారణం సీఎం అంటూ ప్రచారం జరుగుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 14 2026, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హాట్‌ టాపిక్‌ గా మారిన త్రిష
Image Credit : Instagram/ Trisha Krishnan

హాట్‌ టాపిక్‌ గా మారిన త్రిష

త్రిష ఇప్పుడు మోస్ట్ పాపులర్‌ హీరోయిన్‌. తన ఇరవై నాలుగు ఏళ్ల కెరీర్‌లో ఈ రేంజ్‌ పాపులారిటీ ఎప్పుడూ రాలేదు. ఇన్నాళ్లు ఆమె పడ్డ కష్టం ఓ ఎత్తైతే, గత రెండు మూడు నెలలుగా ఆమె చుట్టూ జరుగుతున్న ప్రచారం మరో ఎత్తు. దళపతి విజయ్‌ సీఎం కావడంతో త్రిష క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు సంచలన హీరోయిన్‌గా మారిపోయింది. ఈ క్రమంలో త్రిషకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆమె పారితోషికం ఇప్పుడు డబుల్‌ అయ్యిందట. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`వర్షం`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష
Image Credit : Instagram/trishkrish_583

`వర్షం`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష

త్రిష 2002 తమిళ చిత్రం `మౌనం పెసియదే`తో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. రెండేళ్ల తర్వాత `వర్షం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `అతడు` వంటి చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ విజయాలు సాధించి, హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టింది. ఆ తర్వాత `అల్లరి బుల్లోడు`, `పౌర్ణమి`, `స్టాలిన్‌`, `సైనికుడు`, `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే`, `కృష్ణ`, `బుజ్జిగాడు`, `శంఖం`, `నమో వెంకటేశా`, `తీన్‌ మార్‌`, `బాడీ గార్డ్`, `దమ్ము`, `లయన్‌`, `చీకటి రాజ్యం` వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆమె చిరంజీవితో `విశ్వంభర` చిత్రంలో నటించింది. ఇది రిలీజ్‌ కావాల్సింది. మరోవైపు ఆమె తమిళంలో నటించిన `కరుప్పు`(వీరభద్రుడు) చిత్రం ఈ శుక్రవారం(మే 15)న విడుదల కానుంది.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవిని లేపడం కోసం బాలయ్య, నాగ్‌, వెంకీలను తగ్గించిన స్టార్‌ డైరెక్టర్‌.. చివరికి ఆయనతోనే గొడవ
Related image2
Trisha: ఎట్టకేలకు అధికారికంగా హింట్‌ ఇచ్చిన త్రిష.. విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ పోస్ట్.. నెట్టింట రచ్చ
35
రజనీ, కమల్‌ సినిమాలో హీరోయిన్‌గా త్రిష
Image Credit : youtube/@RedGiantMovies

రజనీ, కమల్‌ సినిమాలో హీరోయిన్‌గా త్రిష

నెక్ట్స్ త్రిష చేతిలో క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఆమె కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ చిత్రంలో నటించబోతుందట. వీరిద్దరు హీరోలుగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతుంది. ఆ మధ్య దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇది అదిరిపోయేలా ఉంది. సినిమాపై హైప్‌ని పెంచింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష ఎంపికైందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో ఆమె హీరోయిన్‌గా కాకుండా కీలక పాత్రలో కనిపించబోతుందని టాక్‌. త్రిష చేయబోయే పాత్ర చాలా బలంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా కోసం త్రిష భారీగా డిమాండ్‌ చేస్తుందట. మేకర్స్ కూడా గట్టిగానే ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

45
త్రిష భారీ పారితోషికం
Image Credit : Instagram/trishkrish_583

త్రిష భారీ పారితోషికం

కమల్‌, రజనీకాంత్‌ కలిసి నటించబోతున్న ఈ మూవీకి త్రిష ఏకంగా రూ.12కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. మొన్నటి వరకు త్రిషకి ఒక్క సినిమాకి నాలుగైదు కోట్లు ఇచ్చేవారు. సినిమా డిమాండ్‌ మేరకు ఆరు కోట్ల వరకు ఇచ్చేవారట. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు సూపర్‌ స్టార్స్ కలిసి నటించబోతున్న  చిత్రానికిగానూ సుమారుగా పన్నెండు కోట్లు ఇస్తున్నట్టు టాక్‌. అయితే ఇదంతా ఇప్పుడు ఆమెకి వచ్చిన క్రేజ్‌ వల్లే అంటున్నారు. దానికి సీఎం కారణమంటున్నారు.

55
సీఎం వల్లే త్రిష పారితోషికం డబుల్‌
Image Credit : instagram

సీఎం వల్లే త్రిష పారితోషికం డబుల్‌

దలపతి విజయ్‌ మొన్న తమిళనాడు సీఎం అయ్యాడు. భారీ స్థాయిలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఇందులో త్రిష స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె ఈవెంట్‌ కి రావడంతో అభిమానులు అరుపులతో హోరెత్తించారు. దీంతో ఆ ప్రాంగణమంతా ఊగిపోయింది. అయితే త్రిష.. సీఎం విజయ్‌తో లివింగ్‌లో ఉన్నారనే వార్తలున్నాయి. ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, త్రిష వల్లే.. విజయ్‌ భార్య సంగీత.. ఆయనకు విడాకులు ఇస్తుందని అన్నారు. ఆమె పరోక్షంగా ఇదే  ఆరోపించింది. దీంతో త్వరలో విజయ్‌.. త్రిషని పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే విజయ్‌ సీఎం కావడంతో ఇప్పుడు త్రిషకి క్రేజ్‌ పెరిగింది. ఆ క్రేజ్‌ కారణంగానే పారితోషికం పెంచిందని, కమల్‌, రజనీ సినిమాకి డబుల్‌ డిమాండ్‌ చేస్తుందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
త్రిష
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని లేపడం కోసం బాలయ్య, నాగ్‌, వెంకీలను తగ్గించిన స్టార్‌ డైరెక్టర్‌.. చివరికి ఆయనతోనే గొడవ
Recommended image2
Trisha: ఎట్టకేలకు అధికారికంగా హింట్‌ ఇచ్చిన త్రిష.. విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ పోస్ట్.. నెట్టింట రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved