MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవిని లేపడం కోసం బాలయ్య, నాగ్‌, వెంకీలను తగ్గించిన స్టార్‌ డైరెక్టర్‌.. చివరికి ఆయనతోనే గొడవ

Chiranjeevi: చిరంజీవిని లేపడం కోసం బాలయ్య, నాగ్‌, వెంకీలను తగ్గించిన స్టార్‌ డైరెక్టర్‌.. చివరికి ఆయనతోనే గొడవ

మెగాస్టార్‌ చిరంజీవిని లేపడం కోసం బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌లను తక్కువ చేసి మాట్లాడాడు స్టార్‌ డైరక్టర్‌. కానీ చివరికి ఆయనతోనే విభేదాలు నెలకొన్నాయి.  

3 Min read
Author : Aithagoni Raju
Published : May 12 2026, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇప్పటికీ తిరుగులేని మెగాస్టార్ గా చిరంజీవి
Image Credit : Asianet News

ఇప్పటికీ తిరుగులేని మెగాస్టార్ గా చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శం. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చి ఇప్పుడు మహావృక్షంలా ఎదిగారు. ఎంతో మందిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. కోట్ల మందికి ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. డెబ్బై ఏళ్ల వయసులోనూ ఆయన యంగ్‌ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే `మన శంకర వర ప్రసాద్‌ గారు` చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. అది ఆయన రేంజ్‌కి నిదర్శనంగా నిలుస్తుంది. ఆయన ఇమేజ్‌, మార్కెట్‌ తగ్గలేదనే దానికిది మరో నిదర్శమని చెప్పొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవినే 1 టూ 10
Image Credit : stockPhoto

చిరంజీవినే 1 టూ 10

చిరంజీవి ఒకప్పుడు టాలీవుడ్‌లో తిరుగులేని టాప్‌ హీరో అని చెప్పొచ్చు. అయితే అప్పట్లో ఆయన ఇమేజ్‌ని మరో స్థాయిలో కొలిచేవారు. చాలా మంది ఇండస్ట్రీలో 1-10 గా లెక్క తీస్తే, 1 టూ 10 చిరంజీవినే అని, ఆ తర్వాతనే మిగిలిన హీరోలు అనేవారు. అయితే అభిమానుల్లో ఆ అభిప్రాయం ఉండటం వేరు. అది వారిష్టం. కానీ ఒక స్టార్‌ డైరక్టర్‌ కూడా అదే మాట చెప్పాడు. చిరంజీవిని లేపడం కోసం మిగిలిన హీరోలను తక్కువ చేశారు. నిజానికి అప్పట్లో బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున, రాజశేఖర్‌, మోహన్‌ బాబు వంటి హీరోలు కూడా చిరంజీవికి పోటీ ఇచ్చారు. పోటీగా సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. దీంతో అప్పట్లో చిరు, వెంకీ, నాగ్‌, బాలయ్యలను `ఆ నలుగురు`గా మాట్లాడుకునేవారు.

35
చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసిన దాసరి నారాయణరావు
Image Credit : www.facebook.com/maatv

చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసిన దాసరి నారాయణరావు

అయితే స్టార్‌ డైరెక్టర్‌ మాత్రం బహిరంగంగానే చిరంజీవిని ఆకాశానికి ఎత్తేశాడు. 1 టూ 10 ఆయనే అన్నారు. మిగతా హీరోలను దారుణంగా అవమానించాడు. ఆయనే దాసరి నారాయణరావు. ఒకప్పుడు ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ బాధ వచ్చినా, ఆదుకోవడంలో, ఎవరికీ ఏ సమస్య వచ్చినా తీర్చడంలో దాసరి ముందు ఉండేవారు. దీంతో అంతా ఆయన్ని గురువుగారు అనేవారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అనే యాంగిల్‌లో చిరంజీవి కూడా ఆయన తర్వాతే అని చెప్పొచ్చు. పైగా చిరంజీవికి మాస్‌ ఇమేజ్‌, మెగాస్టార్‌ ఇమేజ్‌ ఉన్నా, పెద్ద దిక్కు అనే యాంగిల్‌లో ఆయన్ని ఇండస్ట్రీ చూడలేదు. ఇప్పటికీ చూడలేకపోతుందనేది నిజం.

45
ఇతర స్టార్‌ హీరోలను హర్ట్ చేసిన దాసరి
Image Credit : Asianet News

ఇతర స్టార్‌ హీరోలను హర్ట్ చేసిన దాసరి

చిరంజీవిని మాత్రం దాసరి నారాయణరావు ఆకాశానికి ఎత్తేశారు. ఆయన ఓ సినిమాకి సంబంధించిన వంద రోజుల వేడుకలో దాసరి పాల్గొన్నారు. మన టాలీవుడ్‌లో, ఇమేజ్‌ పరంగా హీరోలను కొలవాల్సి వస్తే, 1 టూ 10వరకు చిరంజీవినే ఉంటారని చెప్పారు. ఆ తర్వాత మిగతా హీరోలు అని బహిరంగంగానే కామెంట్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. అందరు హీరోలు హర్ట్ అయ్యారు.  ఒక దర్శకుడు అలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వడం చాలా పెద్ద విషయం. పెద్ద ఇష్యూ కూడా. కానీ చిరంజీవిని లేపడం కోసం దాసరి చాలా రిస్క్ తీసుకున్నారు. కానీ ఆయనతోనే చిరంజీవికి విభేదాలుండేవని అంటుంటారు. ఇద్దరికి పడదు అంటుంటారు. ఈగో సమస్యలు అని చెప్పకుంటారు. అదే సమయంలో రాజకీయ పరమైన విభేదాలు కూడా ఉన్నాయి. పెద్దరికం విషయంలోనే ఈగొడవలు అని టాక్‌. అందుకే చిరంజీవి విషయంలో దాసరి చిన్న చూపు అనేలా, తక్కువ చేస్తారనే కామెంట్లు వినిపించేవి.

55
ఆర్కే షోలో దాసరి క్లారిటీ
Image Credit : the indian express

ఆర్కే షోలో దాసరి క్లారిటీ

ఇదే విషయం ఒకసారి ఆర్కే షోలో చర్చకు వచ్చింది. దీనిపై ప్రశ్నించగా, చిరంజీవిని తాను ఎందుకు తక్కువ చేస్తానని అన్నారు. ఆయన సినిమా వంద రోజుల వేడుకలోనే 1-10 చిరంజీవినే అని ఓపెన్‌గా స్టేట్‌మెంట్‌ ఇచ్చాను, దీనికి మిగతా అందరు హీరోలు హర్ట్ అయ్యారు. తనపై ఊగిపోయారు. ఆయన కోసం అంత సాహసం చేశాను. ఆయన్నెందుకు తక్కువ చేస్తాను అని తెలిపారు. నిజానికి చిరంజీవి తమకు బంధువు అవుతాడని కూడా చెప్పారు దాసరి. అంత వరకు బాగానే ఉంది. కానీ ఇతర హీరోలను హర్ట్ చేయడమే ఇక్కడ అసలు సమస్య. ఏదేమైనా చిరంజీవి, బాలయ్య, నాగ్‌, వెంకటేష్‌.. ఇండస్ట్రీకి నాలుగు కళ్లు లాంటివారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే చిరంజీవి, దాసరి మధ్య కూడా ప్రత్యక్షంగా విభేదాలు లేవు. కొందరు సృష్టించినవే తప్పితే, ఏ రోజు వీరిద్దరు గొడవపడలేదనేది నిజం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
అక్కినేని నాగార్జున
దగ్గుబాటి వెంకటేష్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
Trisha: ఎట్టకేలకు అధికారికంగా హింట్‌ ఇచ్చిన త్రిష.. విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ పోస్ట్.. నెట్టింట రచ్చ
Recommended image2
Renu Desai: సినిమాలు చేయకుండానే రేణు దేశాయ్‌ కోట్ల సంపాదన, ఎలానో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved