- Home
- Entertainment
- Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్ మిస్ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్ మిస్ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
ప్రస్తుతం మంత్రిగా రాణిస్తున్న నారా లోకేష్‌కి సంబంధించిన ఒక క్రేజీ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నారా లోకేష్ హీరోగా ఓ మూవీ ప్రారంభమైందట.

మంత్రిగా రాణిస్తోన్న నారా లోకేష్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేస్తున్న నారా లోకేష్.. రాజకీయంగా బిజీగా ఉన్నారు. ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. రాజకీయ నాయకుడిగా ఇప్పుడు బాగా ఆరితేరారు. తనదైన స్పీచ్‌లతో ఆకట్టుకుంటున్నారు. అదే సమయంలో ప్రజల మనసులను దోచుకుంటున్నారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ మొదట రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. ఆయన సినిమాల్లోకి రావాలనుకున్నారట. క్రేజీ స్టోరీ చోటు చేసుకుంది.

విమర్శల నుంచి కాబోయే సీఎంగా లోకేష్
నారా లోకేష్ గత పదేళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ప్రారంభంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. స్పీచ్ రావడం లేదు, సరిగ్గా మాట్లాడలేకపోయారు. తప్పులు మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ నెమ్మదిగా రాజకీయం నేర్చుకున్నాడు. ఏపీలో ప్రముఖ నాయకుడిగా రాణిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో కాబోయే సీఎం అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నారా లోకేష్ హీరోగా ఎంట్రీకి సంబంధించిన వార్త ఆసక్తికరంగా మారింది.
హీరో కావాలనుకున్న నారా లోకేష్
నారా లోకేష్ మొదట్లో రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. ఆయన్ని హీరో చేయాలనుకున్నారట. నందమూరి నట వారసులుగా బాలకృష్ణ తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు సినిమాల్లోకి వచ్చి హీరోలుగా రాణిస్తున్నారు. అదే మాదిరిగా అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న నేపథ్యంలో నారా లోకేష్‌ని సినిమాల్లోకి తీసుకురావాలనుకున్నారట. ఆయన హీరోగా సినిమాకి కూడా ప్లాన్ జరిగిందట. నారా లోకేష్ హీరోగా తేజ దర్శకత్వంలో సినిమాకి ప్లాన్ జరిగింది. అంతేకాదు దీనికి సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి.
తేజ దర్శకత్వంలో నారా లోకేష్ సినిమా
అప్పట్లో సంతోషం మేగజీన్‌లో దీనికి సంబంధించిన వార్త వచ్చింది. నారా లోకేష్ హీరోగా తేజ దర్శకత్వం సినిమాకి ప్లాన్ జరుగుతుందని వార్తలొచ్చాయి. అయితే వార్తలు మాత్రమే కాదు, నారాలోకేష్ హీరోగా సినిమాని కూడా ప్రారంభించారట. కొన్ని సీన్లు కూడా షూట్ చేశారట. కానీ ఏం జరిగిందో ఏమో సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత దీనికి సంబంధించి చర్చ ఎక్కడా జరగలేదు. కొన్నాళ్లు నారా లోకేష్ సైలెంట్ అయ్యారు. ఆయన జాబ్‌పై ఫోకస్ పెట్టారని, విదేశాలకు వెళ్లారనే వార్తలొచ్చాయి. మొత్తంగా ఆ సమయంలో నారా లోకేష్ హీరోగా తేజ దర్శకత్వంలో రావాల్సిన మూవీ ఆగిపోయింది. ఇటీవల దీనికి సంబంధించిన వార్తలు లీక్ అయ్యాయి. వైరల్ అయ్యాయి.
నితిన్‌కి లైఫ్ ఇచ్చిన లోకేష్
అయితే నారా లోకేష్ తో చేయాలనుకున్న సినిమాని ఆ తర్వాత నితిన్ తో చేశాడట దర్శకుడు తేజ. `జయం` సినిమా అదే అని టాక్. ఈ సినిమాతోనే నారా లోకేష్ హీరోగా పరిచయం కావాల్సింది అనే టాక్ వినిపిస్తుంది. మొత్తంగా నారాలోకేష్ కారణంగా నితిన్ కి లైఫ్ దొరికిందని చెప్పొచ్చు. `జయం` చిత్రంతో నితిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరుతెచ్చుకున్నారు. ఈమూవీతో నితిన్ లైఫే మారిపోయింది. ఇందులో సదా హీరోయిన్ గా నటించగా, గోపీచంద్ విలన్‌గా నటించాడు. సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

