MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Toxic Release Date: ఆడియెన్స్ కి టాక్సిక్‌ టీమ్‌ కండీషన్స్.. వీళ్లు సినిమా చూడకూడదు, వీడియో మైండ్ బ్లోయింగ్‌

Toxic Release Date: ఆడియెన్స్ కి టాక్సిక్‌ టీమ్‌ కండీషన్స్.. వీళ్లు సినిమా చూడకూడదు, వీడియో మైండ్ బ్లోయింగ్‌

Toxic Release Date: యశ్‌ హీరోగా నటించిన `టాక్సిక్‌` మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చింది. ఎట్టకేలకు మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ఆడియెన్స్ కి కండీషన్స్ పెట్టారు. ఎవరు చూడకూడదో వెల్లడించారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 01 2026, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రిలీజ్‌కి రెడీ అయిన టాక్సిక్‌
Image Credit : Asianet News

రిలీజ్‌కి రెడీ అయిన టాక్సిక్‌

కేజీఎఫ్‌ 2 వచ్చిన దాదాపు నాలుగేళ్ల తర్వాత `టాక్సిక్‌`తో రాబోతున్నాడు హీరో యశ్‌. ఈ మూవీ కూడా చాలా సార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఎట్టకేలకు మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఆగస్ట్ లో రిలీజ్‌ చేయబోతున్నారు. లేడీ డైరెక్టర్‌ గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్‌, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి వారు హీరోయిన్లుగా నటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆగస్ట్ 26న టాక్సిక్‌ రిలీజ్‌ డేట్‌
Image Credit : Asianet News

ఆగస్ట్ 26న టాక్సిక్‌ రిలీజ్‌ డేట్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీని కేవీఎన్‌ ప్రొడక్షన్‌, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ ఆగస్ట్ 26న విడుదల చేయనున్నట్టు టీమ్‌ వెల్లడించింది. తాజాగా మేకర్స్ 'లేడీస్ & లేడీస్' పేరుతో ఓ పవర్‌ఫుల్ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. ఈ వీడియోలో టాక్సిక్ ప్రపంచాన్ని శాసించే మహిళా పాత్రలను పరిచయం చేస్తూ, కథలో వారి  ప్రయారిటీని చూపించారు.

35
టాక్సిక్‌ వీడియోలో ఏం చూపించారంటే
Image Credit : Asianet News

టాక్సిక్‌ వీడియోలో ఏం చూపించారంటే

నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ ఒక్కో ఫ్రేమ్‌లో తమ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. నయనతార పవర్ ఫుల్ పాత్రలో కనిపించగా, కియారా అద్వానీ మిస్టీరియస్, ఎమోషనల్ షేడ్స్‌తో మెస్మరైజ్ చేసింది. తారా సుతారియా తన స్టైలిష్ అటిట్యూడ్‌తో మెప్పించగా, రుక్మిణి వసంత్ ఇంటెన్స్ తో కూడిన పాత్రలో కనిపించింది. హుమా ఖురేషీ కూడా తన డాషింగ్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళ కోణంలో సాగే పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ వీడియోకు మరింత మిస్టరీని జోడించింది.

45
పిల్లలకు టాక్సిక్‌ కండీషన్స్
Image Credit : Asianet News

పిల్లలకు టాక్సిక్‌ కండీషన్స్

వీడియో ప్రారంభంలోనే `పిల్లలు... దూరంగా ఉండండి. తల్లిదండ్రులు... మీ పిల్లలను దూరంగా ఉంచండి. తాతలు, బామ్మలు... మీ మనవళ్లను కూడా దూరంగా ఉంచండి. ముత్తాతలు... మీ సొంత రిస్క్‌పై చూడండి` అనే డిస్క్లైమర్‌తో సినిమాకు ఉన్న బోల్డ్ టోన్‌ను ఆసక్తికరంగా పరిచయం చేశారు. స్టైలిష్ విజువల్స్, పవర్‌ఫుల్ యాక్షన్, మిస్టరీతో 'టాక్సిక్' మరోసారి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. యాక్షన్‌తో పాటు బలమైన మహిళా పాత్రలకు కూడా సమాన ప్రయారిటీ ఉంటుందని ఈ వీడియో స్పష్టం చేసింది. ఇందులో లేడీస్‌తో యష్‌ చేసే యాక్షన్‌ హైలైట్‌గా నిలిచింది.

55
భారీ స్థాయిలో రిలీజ్‌
Image Credit : Asianet News

భారీ స్థాయిలో రిలీజ్‌

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యశ్ హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.  

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి భయపడి రిజెక్ట్ చేస్తే, రజనీకాంత్‌ బ్లాక్‌ బస్టర్‌తో ట్రెండ్‌ సెట్‌ చేశాడు.. ఆ సినిమా ఏంటంటే?
Recommended image2
Yash Next Movie: టాక్సిక్‌ని పక్కన పెట్టిన యశ్‌.. నెక్ట్స్ మూవీ ఇదే, స్టోరీ లీక్.. సెన్సేషనల్‌ హీరోయిన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved