- Home
- Entertainment
- 7 కోట్లతో తీస్తే, రూ.90కోట్లు రాబట్టి అక్కడ నెంబర్ వన్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న ఫ్యామిలీ సినిమా ఇదే
7 కోట్లతో తీస్తే, రూ.90కోట్లు రాబట్టి అక్కడ నెంబర్ వన్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న ఫ్యామిలీ సినిమా ఇదే
ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు ఆడియెన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. ఆ విషయాన్ని నిరూపించిన కోలీవుడ్ మూవీ `టూరిస్ట్ ఫ్యామిలీ`. ఈ మూవీ ఫైనల్ కలెక్షన్లు తెలిస్తే మతిపోవాల్సిందే.

కోలీవుడ్ సంచలన విజయం సాధించిన `టూరిస్ట్ ఫ్యామిలీ`
పెద్ద బడ్జెట్ సినిమాల కంటే తక్కువ ఖర్చుతో తీసి చిత్రాలే ఇప్పుడు ఎక్కువగా ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. నిర్మాతలకు ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతున్నాయి.
ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉన్న చిత్రాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు ఉదాహరణే ఈ సంక్రాంతికి వచ్చిన వెంకటేష్-అనిల్ రావిపూడి మూవీ `సంక్రాంతికి వస్తున్నాం`. ఇది ఏకంగా రూ.350కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే.
అలానే తమిళంలో కూడా `టూరిస్ట్ ఫ్యామిలీ` సంచలన విజయం సాధించింది. కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు షాక్ అయ్యేలా కలెక్షన్లని రాబట్టింది.
సిమ్రాన్, శశికుమార్ నటించిన `టూరిస్ట్ ఫ్యామిలీ`
`టూరిస్ట్ ఫ్యామిలీ` ఇప్పుడు సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఈ చిత్రం తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ వసూళ్లని రాబట్టిన మూవీగా నిలిచింది. పెట్టిన బడ్జెట్‌కి 13 రెట్లు ఎక్కువ కలెక్షన్లని రాబట్టడం విశేషం.
లాభాల పర్సంటేజీ ప్రకారం ఈ మూవీ కోలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం మరో విశేషం. ఈ ఏడాది నెంబర్ వన్‌గా నిలిచింది. `టూరిస్ట్ ఫ్యామిలీ`లో శశికుమార్, సిమ్రాన్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. అభిషన్ జీవింత దర్శకత్వం వహించారు.
కామెడీ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్ 29న ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఫస్ట్ ఇది కేవలం తమిళంలోనే విడుదలైంది. ఆ తర్వాత ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు.
ఏడు కోట్లతో రూపొంది రూ.90కోట్లు రాబట్టిన `టూరిస్ట్ ఫ్యామిలీ`
`టూరిస్ట్ ఫ్యామిలీ` మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. నెమ్మదిగా పికప్ అయ్యింది. మౌత్ టాక్‌తో రన్ అయి ఆడియెన్స్ థియేటర్ కి క్యూ కట్టేలా చేసింది.
ఈ మూవీ సుమారు రూ.7కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందని సమాచారం. ఇప్పుడు ఏకంగా రూ.90కోట్లు వసూలు చేయడం విశేషం. అయితే ఇది ఇప్పటికే ఓటీటీలోకి వచ్చింది.
జియో హాట్ స్టార్‌లోకి జూన్ 2 నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. అందులోనూ టాప్ లో చాలా రోజులు ట్రెండ్ అయ్యింది. అదే సమయంలో ఓటీటీలో ఉన్నా కూడా చాలా థియేటర్లలో రన్ కావడం విశేషం.
`టూరిస్ట్ ఫ్యామిలీ` కథ ఇదే
`టూరిస్ట్ ఫ్యామిలీ` సినిమా కథేంటనేది చూస్తే మెరుగైన జీవితం కోసం శ్రీలంక నుంచి ఓ కుటుంబం పారిపోయి ఇండియా వస్తుంది. తమిళనాడుకి వలస వస్తారు. అక్కడ వాళ్లు ఎలా సర్వైవ్ అయ్యారు, అందుకోసం ఏం చేశారు? ఎలాంటి ఇబ్బందులు పడ్డారు?
ఫైనల్‌గా ఎలా నిలబడ్డారు, ఈ క్రమంలో పుట్టే కామెడీ హైలైట్ గా ఈ చిత్రం సాగుతుంది. ఆడియెన్స్ ని కట్టిపడేసింది. ఫ్యామిలీ ఎలిమెంట్లకు పెద్ద పీఠ వేయడంతో కుటుంబ ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పట్టారు.