- Home
- Entertainment
- ఓటీటీలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. దుమ్ములేపుతున్న `థగ్ లైఫ్`, `ఉప్పుకప్పురంబు`
ఓటీటీలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. దుమ్ములేపుతున్న `థగ్ లైఫ్`, `ఉప్పుకప్పురంబు`
జూలై 7 నుండి 13 వరకు ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇందులో తెలుసుకుందాం.

ఓటీటీలో అత్యధికంగా చూసిన టాప్ 5 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు
ఓటీటీ ఇప్పుడు బాగా విస్తరించింది. థియేటర్లో కంటే ఓటీటీలోనే సినిమాలు చూసే ఆడియెన్సే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేని సినిమాలు ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి.
తాజాగా ఈ వారంలో ఓటీటీలో `థగ్ లైఫ్` మూవీ టాప్‌లో ఉంది. ఇది థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు ఇటీవల వచ్చిన కీర్తిసురేష్ మూవీ కూడా ట్రెండింగ్‌లో ఉంది.
వీటితోపాటు టాప్ 5లో ఉన్న సినిమాలేంటి? అలాగే ఓటీటీ ఆడియెన్స్ ని కట్టిపడేస్తున్న వెబ్ సిరీస్‌ల లిస్ట్ ని ఓర్మాక్స్ మీడియా ప్రకటించింది. మరి టాప్ 5లో ఉన్న వెబ్ సిరీస్‌లు ఏంటో చూద్దాం.
ఓటీటీలో నెంబర్ వన్‌గా స్ట్రీమింగ్ అవుతున్న `థగ్ లైఫ్`
ఓటీటీలో అత్యధికంగా వ్యూస్ రాబట్టిన సినిమాల జాబితాలో `థగ్ లైఫ్` మొదటి స్థానంలో ఉంది. మణిరత్నం రూపొందించిన కమల్ హాసన్ `థగ్ లైఫ్`కి 33 లక్షల వ్యూస్‌తో టాప్‌లో ఉంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఆ తర్వాత 'రైడ్ 2' రెండవ స్థానంలో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా 31 లక్షల వ్యూస్‌ని సాధించింది. అజయ్ దేవగన్ నటించిన ఈ మూవీ థియేటర్లలో కూడా మంచి ఆదరణే పొందింది.
టాప్ 5లో కీర్తిసురేష్ నటించిన తెలుగు మూవీ `ఉప్పు కప్పురంబు`
టాప్ 3లో మాధవన్ నటించిన హిందీ మూవీ `ఆప్ జైసా కోయి` ఉంది. దీనికి 24 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
నాల్గో స్థానంలో 'హెడ్స్ ఆఫ్ స్టేట్' అనే ఆంగ్ల సినిమా ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా 23 లక్షల వీక్షణలు పొందింది.
కీర్తి సురేష్, సుహాస్ జంటగా నటించిన 'ఉప్పు కప్పురంబు' ఈ వారం 5వ స్థానంలో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా 20 లక్షల వీక్షణలు సాధించింది.
టాప్ 5 వెబ్ సిరీస్‌లు
ఓటీటీ టాప్ 5 వెబ్ సిరీస్‌లో మొదటి స్థానంలో 'పంచాయత్ సీజన్ 4' ఉంది. ఈ హిందీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి 42 లక్షల వీక్షణలు వచ్చాయి. 'స్క్విడ్ గేమ్ సీజన్ 3' 30 లక్షల వీక్షణలతో 2వ స్థానంలో ఉంది. ఇది కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉంది.
'ది గ్రేట్ ఇండియన్ కాఫీ షో సీజన్ 3' 25 లక్షల వీక్షణలతో 3వ స్థానంలో ఉంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. రాజీవ్ గాంధీ హత్య కేసు నేపథ్యంలో వచ్చిన 'ది హంట్' వెబ్ సిరీస్ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ 17 లక్షల వీక్షణలు సాధించింది.
ఐదో స్థానంలో ప్రియమణి నటించిన `గుడ్ వైఫ్`
రేవతి దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ `గుడ్ వైఫ్`లో ప్రియమణి, ఆర్య అర్జున్, సంపత్ రాజ్ వంటి వారు నటించారు. ఇది అమెరికన్ సిరీస్ 'ది గుడ్ వైఫ్'కి రీమేక్. ఈ వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
6 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ తమిళంతో పాటు మలయాళం, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లోనూ విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ గత వారంలో 15 లక్షల వీక్షణలతో 5వ స్థానంలో నిలిచింది.

