చేసేది కామెడీ, ఆస్తులేమో వందల కోట్లు.. బ్రహ్మానందం ఆస్తుల విలువ తెలిస్తే షాకే
అత్యధిక సినిమాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కిన బ్రహ్మానందం వద్ద ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us

నవ్వులు రారాజుగా వెలుగుతున్న బ్రహ్మానందం
హాస్యానికి మారుపేరు, నవ్వులకు పర్యాయపదంగా నిలుస్తోన్న బ్రహ్మానందం గత నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై నవ్వులు రారాజుగా వెలుగుతున్న విషయం తెలిసిందే.
హాస్య బ్రహ్మగా పిలుపించుకుంటున్న ఆయనకి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఆస్తుల మ్యాటర్ చర్చనీయాంశం అయ్యింది.
అత్యధిక సినిమాలు చేసిన నటుడిగా బ్రహ్మానందం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
ఆంధ్రప్రదేశ్‌లో 1956 ఫిబ్రవరి 1న జన్మించారు బ్రహ్మానందం. ఆయన వయసు 68 సంవత్సరాలు. 20వ ఏట నుంచే నటించడం ప్రారంభించారు.
1050కు పైగా చిత్రాలలో నటించి, నేటికీ బిజీగా ఉన్న బ్రహ్మానందం అత్యధిక సినిమాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ రికార్డు సాధించారు. 1986లో విడుదలైన `చంటబ్బాయి` అనే చిత్రంతో ఆయన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్ బ్రహ్మానందం
ఒకానొక సమయంలో సంవత్సరానికి 30 సినిమాల్లో నటించారంటే అతిశయోక్తి కాదు. తెలుగులో ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ బస్టర్ చిత్రాల్లోనూ ఆయన నటించి మెప్పించారు. కంటిన్యూగా నవ్వులు పూయిస్తూనే ఉన్నారు.
బ్రహ్మానందం ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటి నుండి 2.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్‌గా రాణిస్తున్న బ్రహ్మానందం.
కమెడియన్లలో అత్యంత కుబేరుడు బ్రహ్మానందం
హీరోగా నటించకపోయినా, 68 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా, బహుభాషా చిత్రాలలో నటిస్తున్న బ్రహ్మానందం ఆస్తులకు సంబంధించిన సమాచారం లీక్ అయ్యింది. నవ్వులతోనే వందల కోట్లు సంపాదించారట.
ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు రు.490 కోట్లుగా అంచనా. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన హాస్యనటుడు బ్రహ్మీ కావడం విశేషం. నటనతో పాటు చిత్రలేఖనంలో కూడా ఆయన ప్రావీణ్యం సంపాదించారు.
బ్రహ్మానందం జోరు తగ్గింది
గత ఐదారేళ్ల వరకు బిజీగా రాణించిన ఆయన ఇటీవల జోరు తగ్గింది. కొత్త కమెడియన్లు రావడంతో బ్రహ్మానందానికి అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో కామెడీ పాత్రలే ఇన్నాళ్లు చేస్తూ వచ్చాను, ఇప్పటికైనా కొత్తగా, డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉందని బ్రహ్మానందం తెలిపారు.
అందుకే రెగ్యూలర్ కామెడీ రోల్స్ చేయడం లేదన్నారు. ఈ క్రమంలో ఆ మధ్య `రంగమార్తాండ` చిత్రంలో ఎమోషనల్ రోల్‌చేశారు బ్రహ్మీ. చివర్లో కన్నీళ్లు పెట్టించారు. ఇప్పుడు అలాంటి విభిన్నమైన పాత్రల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు బ్రహ్మీ. మరి మున్ముందు ఎలాంటి పాత్రలతో అలరిస్తారో చూడాలి.