ఓటీటీలో దుమ్మురేపుతున్న టాప్ 5 వెబ్ సిరీస్‌లు ? నంబర్ 1 ప్లేస్ ఎవరిదో తెలుసా?
ఓటీటీలో ప్రతి వారం మంచి మంచి వెబ్ షోలు, సిరీస్‌లు రిలీజ్ అవుతాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనసు గెలిచి టాప్ 5లో చోటు సంపాదిస్తాయి. ఈ వారం ఓటీటీలో ఎక్కువమంది చూసిన వెబ్ సిరీస్ లు ఏంటో తెలుసా?

బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్
ఓటీటీలో టాప్ 5 వెబ్ సిరీస్ లలో షారుఖ్ ఖాన్ తనయుడు తెరకెక్కించిన 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' ముందుంది. ఈ వెబ్ సిరీస్ తో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. రిలీజ్ అయ్యాక ఈ సిరీస్ వరుసగా మూడు వారాలు టాప్‌లో ఉంది. దీనికి 3.2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
ది గేమ్
'ది గేమ్' ఒక తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్‌లో నటించింది. ఈ సిరీస్ 2.4 మిలియన్ల వ్యూస్‌తో వ్యూయర్‌షిప్ చార్ట్‌లో రెండో స్థానం సంపాదించింది. ఉత్కంఠ రేపే సన్నివేశాలతో ఇతర భాషాల్లో కూడా ఆడియన్స్ ను అలరించింది ది గేమ్.
ది ట్రయల్ సీజన్ 2
కాజోల్, జిషు సేన్‌గుప్తా, షీబా చద్దా లీడ్ రోల్స్‌లో కనిపించిన ది ట్రయల్ సీజన్ 2 కూడా టాప్ 5 వెబ్ సిరీస్ లలో ప్లేస్ సాధించింది. ఈ సిరీస్ చాలా కాలంగా ట్రెండింగ్‌లో ఉంది. ఈ వారం 2.1 మిలియన్ల వ్యూస్‌తో మూడో స్థానం దక్కించుకుంది ది ట్రయల్ సీజన్ 2.
సిక్సర్ సీజన్ 2
క్రికెట్ నేపథ్యంలో వచ్చిన 'సిక్సర్ సీజన్ 2' ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వారం దీనికి 2.0 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ లిస్ట్‌లో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. శివాంకిత్ సింగ్ పరిహార్, బాద్రి చవాన్, కరిష్మా సింగ్, బృజ్ భూషణ్ శుక్లా, , వైభవ్ శుక్లా వంటి నటులు ఈ సీరిస్ లో సందడి చేశారు.
13th
వెబ్ సిరీస్ '13th' ఈ వారం 1.2 మిలియన్ల వ్యూస్‌తో ఐదో స్థానంలో నిలిచింది. . ఈ సిరీస్‌లో డిలన్ మిన్నెట్ , కేథరీన్ లాంగ్‌ఫోర్డ్ నటించారు ఒక అమ్మాయి మరణానికి సబంధించి 13 కారణాల చుట్టు ఈసినిమా తిరుగుతుంది. ఈసిరీస్ ను సోనీ లివ్ యాప్‌లో చూడొచ్చు.

