రోజుకు 10 కోట్లు? బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఎవరిదో తెలుసా?
బిగ్ బాస్ షో తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ వంటి పలు భాషల్లో సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారు. ప్రతీ భాషలో స్టార్ హీరోలు ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. మరి ఇందులో రోజకు 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నది ఎవరో తెలుసా?

టీవీ చరిత్రలో అతిపెద్ద రియాలిటీ షో
భారత టీవీ చరిత్రలో బిగ్ బాస్ అతిపెద్ద రియాలిటీ షో. పలు భాషల్లో ప్రసారమయ్యే ఈ షోలో, పోటీదారులు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక ఇంట్లో ఉంటారు. టాస్క్‌లలో గెలిచి, ఎక్కువ ఓట్లు పొందిన వారే విజేత. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ వంటి పలు భాషల్లో బిగ్ బాస్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ హోస్ట్ లుగా స్టార్ హీరోలు
తెలుగు, తమిళ భాషల్లో 9వ సీజన్ నడుస్తుండగా హిందీలో మాత్రం 19వ సీజన్ బిగ్ బాస్ నడుస్తోంది. ఇక సల్మాన్ ఖాన్, నాగార్జున, మోహన్ లాల్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ లాంటి స్టార్స్ ఆయా భాషల్లో హోస్ట్ లు గా సందడి చేస్తున్నారు. ఇక గతంలో ఎన్టీఆర్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ కూడా బిగ్ బాస్ హోస్ట్ లు గా సక్సెస్ అయ్యారు. వీరిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా సల్మాన్ ఖాన్ నిలిచారు.
బిగ్ బాస్ హిస్టరీలో టాప్ రెమ్యునరేషన్
హిందీ బిగ్ బాస్‌కు సల్మాన్ ఖాన్ హోస్ట్. 'హోస్ట్ అంటే ఇలా ఉండాలి' అని అభిమానులు మెచ్చుకునేలా సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ ను నిర్వహిస్తూ వస్తున్నారు. కొన్ని సీజన్లు మినహాయించి.. దాదాపుగా హిందీ బిగ్ బాస్ అంతా సల్మాన్ ఖాన్ ఒక్కరే సక్సెస్ చేశారు. చాలా ఏళ్లుగా ఈషోను ఆసక్తికరంగా నడిపిస్తున్నారు. బిగ్ బాస్ హోస్ట్ గా సల్మాన్ ఖాన్ రోజుకు 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది.
రోజుకు 10 కోట్లు అందుకుంటున్న సల్మాన్ ఖాన్
బిగ్ బాస్ హిందీ సీజన్ 19 కోసం సల్మాన్ 120 నుంచి 150 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. వీకెండ్ ఎపిసోడ్స్ కోసం రోజుకు 8-10 కోట్లు అందుకుంటున్నారు. భారత బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక జీతం తీసుకునే హోస్ట్ గా సల్మాన్ ఖన్ రికార్డు క్రియేట్ చేశారు.
నాగార్జున రెమ్యునరేషన్
బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా కింగ్ నాగార్జున చేస్తున్న విషయం తెలిసిందే. కింగ్ నాగ్ తన హోస్టింగ్ తో ఈ షోకు ఎంతో పాపులరిటీ తీసుకవచ్చారు. మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు ఆయనే షోకి హోస్ట్‌గా ఉన్నారు. ఇక ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం నాగార్జునకు ఏకంగా 50 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందిస్తున్నట్లు సమాచారం. అంతేకాక, అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేసినందున భారీగానే రెంట్ వసూలు చేస్తున్నాడట టాలీవుడ్ కింగ్.
విజయ్ సేతుపతి రెమ్యునరేషన్
సల్మాన్, నార్జునతో పాటు తమిళ బిగ్ బాస్ ను 7 సీజన్లు సక్సెస్ ఫుల్ గా నడిపించిన కమల్ హాసన్ అత్యధిక రెమ్యునరేషన్ భారీగానే వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక తమిళ బిగ్ బాస్ 8వ సీజన్ నుంచి విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్నారు. ఆయనకు 40 కోట్ల వరకూ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.