- Home
- Entertainment
- 2025లో గూగుల్ సెర్చ్ లో టాప్ లో నిలిచిన టాలీవుడ్ హీరోలు వీళ్ళే.. పవన్, ప్రభాస్ కి ఝలక్ ఇచ్చిన అల్లు అర్జున్
2025లో గూగుల్ సెర్చ్ లో టాప్ లో నిలిచిన టాలీవుడ్ హీరోలు వీళ్ళే.. పవన్, ప్రభాస్ కి ఝలక్ ఇచ్చిన అల్లు అర్జున్
Most Searched Tollywood Actors: 2025 సంవత్సరం ముగియడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. అందరూ కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో, 2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన స్టార్స్ జాబితాను గూగుల్ విడుదల చేసింది.

గూగుల్ సెర్చ్ లో టాప్ హీరోలు
2025 ముగింపుతో, ఈ ఏడాది ఏ టాలీవుడ్ స్టార్ ప్రజల మనసు గెలిచాడో గూగుల్ ట్రెండ్స్ వెల్లడించాయి. బ్లాక్‌బస్టర్ సినిమాలు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో టాప్ 5 జాబితా బయటకొచ్చింది.
5. జూనియర్ ఎన్టీఆర్
2025 గూగుల్ సెర్చ్ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ ఐదవ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది విడుదలైన ఎన్టీఆర్ 'వార్ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
4. పవన్ కళ్యాణ్
2025 గూగుల్ సెర్చ్ జాబితాలో పవన్ కళ్యాణ్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది విడుదలైన ఆయన సినిమాలు హరిహర వీరమల్లు ఫ్లాప్ కాగా, ఓజీ సూపర్ హిట్ అయింది.
3. మహేష్ బాబు
2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన సౌత్ స్టార్స్ జాబితాలో మహేష్ బాబు మూడో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఆయన సినిమా ఏదీ విడుదల కాలేదు. ఆయన సినిమా వారణాసి 2027లో విడుదల కానుంది.
2. ప్రభాస్
2025 గూగుల్ సెర్చ్ జాబితాలో ప్రభాస్ రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఆయన సినిమా ఏదీ లేదు. ఆయన రాబోయే సినిమా 'ది రాజా సాబ్' జనవరి 2026లో విడుదల కానుంది.
1. అల్లు అర్జున్
2025 గూగుల్ సెర్చ్ జాబితాలో అల్లు అర్జున్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఆయన సినిమా ఏదీ లేదు. 2026లో కూడా ఆయన సినిమా ఏదీ విడుదల కావడం లేదు. పవన్, ప్రభాస్, మహేష్ లాంటి టాప్ హీరోలకు ఝలక్ ఇచ్చి బన్నీ టాప్ లో నిలిచారు.

