- Home
- Entertainment
- Shyamala Devi: కృష్ణంరాజు సతీమణికి ఇష్టం లేని ప్రభాస్ రెండు సినిమాలు.. అస్సలు భరించలేరట
Shyamala Devi: కృష్ణంరాజు సతీమణికి ఇష్టం లేని ప్రభాస్ రెండు సినిమాలు.. అస్సలు భరించలేరట
కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ప్రభాస్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ నటించిన 2 సినిమాలు అంటే తనకి అస్సలు ఇష్టం లేదని కారణాలు చెప్పారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ ఎంట్రీ
రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ గా ఎదిగారు. బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులకు ప్రభాస్ అభిమాన హీరోగా మారిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. అదే విధంగా కల్కి 2, సలార్ 2 సీక్వెల్ చిత్రాలు కూడా చేయాల్సి ఉంది.
46 ఏళ్ళ వయసులో సింగిల్ గా ప్రభాస్
46 ఏళ్ళ వయసొచ్చినప్పటికీ ప్రభాస్ ఇంకా సింగిల్ గానే ఉంటున్నాడు. ఇంతవరకు ప్రభాస్ పెళ్లి ఊసే ఎత్తలేదు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ లైఫ్ కి కూడా ప్రభాస్ ప్రాధాన్యం ఇస్తారు. ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి తరచుగా మీడియా ముందు కనిపిస్తుంటారు. ప్రభాస్ కి సంబంధించిన విశేషాలని ఆమె తెలియజేస్తుంటారు.
శ్యామలాదేవికి ఇష్టంలేని ప్రభాస్ సినిమాలు
ఓ ఇంటర్వ్యూలో శ్యామలాదేవి మాట్లాడుతూ ప్రభాస్ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ నటించిన సినిమాలలో 2 సినిమాలు అంటే తనకి అస్సలు ఇష్టం లేదు అని ఆమె అన్నారు. ఆ సినిమాలలో ఒకటి ఏక్ నిరంజన్. ఈ చిత్రంలో పూరి జగన్నాధ్ ప్రభాస్ ని ఒంటరిగా ఉన్నట్లు చూపించారు.
ఆ సీన్లు చూసి భరించలేకపోయా
ప్రభాస్ ఏదో ఎవరూ లేనట్లుగా ఒంటరిగా ఉన్నట్లు చూపించడం.. అమ్మా లేదు నాన్న లేడు.. ఏక్ నిరంజన్ అంటూ సాగే పాట తనకి నచ్చవు అని శ్యామలాదేవి అన్నారు. మరొక నచ్చని సినిమా చక్రం. ఆ మూవీలో కూడా ప్రభాస్ ని ఒంటరిగా ఉన్నట్లు చూపించారు. అది చాలా మంచి సినిమా. కానీ నాకు నచ్చదు. కానీ ఆ సినిమాలో సన్నివేశాలు చూసి భరించలేక పోయాను అని శ్యామలాదేవి అన్నారు.
ప్రభాస్ ఫ్లాప్ సినిమాలు
ప్రభాస్ ని ఒంటరిగా, విషాదకర సన్నివేశాల్లో చూడడం తనకి ఇష్టం లేదు అని శ్యామలాదేవి అన్నారు. ఏక్ నిరంజన్ మూవీ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం ఆశించిన సక్సెస్ కాలేదు. చక్రం చిత్రాన్ని కృష్ణవంశీ తెరకెక్కించారు. ఈ మూవీ కూడా డిజాస్టర్ అయింది.

