- Home
- Entertainment
- Chiranjeevi: చిరంజీవి అంటే ఏంటో ఇండస్ట్రీకి చూపించిన 5 సినిమాలు..ఇవి లేకుంటే మెగాస్టార్ కెరీర్ ఫినిష్
Chiranjeevi: చిరంజీవి అంటే ఏంటో ఇండస్ట్రీకి చూపించిన 5 సినిమాలు..ఇవి లేకుంటే మెగాస్టార్ కెరీర్ ఫినిష్
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో 40 ఏళ్లకు పైగా అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. చిరంజీవి కెరీర్ లో కొన్ని కీలక దశలు ఉన్నాయి. ఆయా సమయాల్లో చిరంజీవికి దక్కిన విజయాలు, ఆ చిత్రాల ప్రాధాన్యత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

చిరంజీవి కెరీర్ కీలక సమయాల్లో పడ్డ హిట్లు
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, ఇంద్ర, ఠాగూర్ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉండొచ్చు. కానీ ఆయన కెరీర్ లో 5 సినిమాలు మాత్రమే ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయి. ఈ ఐదు సినిమాలు చిరంజీవి కెరీర్ లో అత్యంత కీలకమైన దశలో పడ్డాయి. ఆ చిత్రాలు వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఖైదీ
ఖైదీ ముందు వరకు చిరంజీవి టాలీవుడ్ లో ఒక ప్రామిసింగ్ హీరోగా ఉన్నారు. చిరంజీవి పొటెన్షియల్ కి తగ్గ కథ, కథనాలతో వచ్చిన చిత్రం ఖైదీ. ఈ మూవీలో చిరంజీవి విశ్వరూపం ప్రదర్శించారు. ఈ చిత్రం దెబ్బకు బాక్సాఫీస్ మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. ఈ మూవీతో చిరు స్టార్ లీగ్ లో చేరిపోయారు.
జగదేక వీరుడు అతిలోక సుందరి
ఈ చిత్రం రిలీజ్ అయ్యే సమయానికే చిరంజీవి ఇండస్ట్రీలో సుప్రీం హీరోగా వెలుగొందుతున్నారు. రాఘవేంద్ర రావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన దృశ్య కావ్యం ఈ చిత్రం. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో రిలీజ్ అయింది. ఏపీలో అప్పట్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ అన్ని అడ్డంకులు అధికమిస్తూ ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది.
హిట్లర్
ఇక చిరంజీవి పని అయిపోయింది అని ఈ చిత్రానికి ముందు కామెంట్స్ వినిపించాయి. ఎందుకంటే బిగ్ బాస్, ఎస్పీ పరశురామ్ రామ్ డిజాస్టర్ సినిమాలతో చిరంజీవి ఇబ్బంది పడుతున్న రోజులు అవి. 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుని హిట్లర్ మూవీలో నటించారు. ఈ సినిమా సాధించిన సక్సెస్ రీ సౌండ్ ఇండస్ట్రీ మొత్తం వినిపించింది.
ఖైదీ నెంబర్ 150
దాదాపు 8 ఏళ్ళ పొలిటికల్ గ్యాప్ తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150. చిరంజీవిని ఆడియన్స్ మరచిపోయారు, క్రేజ్ లేదు అంటూ కామెంట్స్ వినిపించాయి. పైగా ఇది రీమేక్ చిత్రం. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం ఇస్తుందో అనే ఉత్కంఠ నడుమ విడుదలయింది. చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా ఎప్పుడూ తగ్గదు అని నిరూపిస్తూ ఏకముగా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం.
మన శంకర వరప్రసాద్ గారు
తాజాగా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని కూడా ఇండస్ట్రీ, అభిమానులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఆచార్య, భోళా శంకర్ లాంటి చిత్రాలతో చిరంజీవిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీనికన్నా ముందు ప్రారంభమైన విశ్వంభర చిత్రం విషయంలో వాయిదాలు కొనసాగుతున్నాయి. వింటేజ్ చిరంజీవిని ఎవరు ప్రజెంట్ చేస్తారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైంలో అనిల్ రావిపూడి మ్యాజిక్ చేశారు. చిరంజీవిని ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అలా తయారు చేసి బాక్సాఫీస్ పైకి వదిలారు. తొలి రోజు నుంచి ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ మొదలైంది.

