MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెన్సార్‌ రివ్యూ.. పవన్‌ సినిమాని ఎవరు చూడొచ్చు, నిడివి ఎంత అంటే?

Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెన్సార్‌ రివ్యూ.. పవన్‌ సినిమాని ఎవరు చూడొచ్చు, నిడివి ఎంత అంటే?

పవన్‌ కళ్యాణ్‌ నటించిన లేటెస్ట్ మూవీ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` రిలీజ్‌కి రెడీ అవుతుంది. తాజాగా ఇది సెన్సార్‌ పూర్తి చేసుకుంది. మరి ఈ చిత్రానికి ఎలాంటి సర్టిఫికేట్‌ వచ్చింది. నిడివి ఎంత అనేది చూస్తే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 10 2026, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉగాదికి విడుదల కాబోతున్న `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Image Credit : Asianet News

ఉగాదికి విడుదల కాబోతున్న `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యణ్‌ ప్రస్తుతం `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రంలో నటించారు. `హరి హర వీరమల్లు`వంటి ఫెయిల్యూర్‌, `ఓజీ` వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీ తర్వాత వస్తోన్న సినిమా ఇది. ఏడాది గ్యాప్‌లోనే ఇప్పుడు మూడో సినిమా రాబోతుంది. ఉగాది పండగని పురస్కరించుకుని మార్చి 19న విడుదల కానుంది. దీంతో చిత్ర ప్రమోషన్స్ షురూ చేసింది టీమ్‌. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. ఇప్పుడు మూడో పాటని రిలీజ్‌ చేయబోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూడో సాంగ్‌ రాబోతుంది.
Image Credit : Asianet News

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూడో సాంగ్‌ రాబోతుంది.

`ఎక్కే, దిగే కిక్కులోన దక్కేదేముందే అరె సచ్చే దాకా కిక్కే ఉండాలే.. ఎక్కీ తొక్కేటోల్లే ఉంటే తగ్గేదేముందే.. నెగ్గే దాకా తిక్కే ఉండాలే` అంటూ సాగే పాట రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇది అభిమానుల్లో జోష్‌ నింపేదిగా ఉండబోతుందని చెప్పొచ్చు. ప్రోమో మాత్రం అదిరిపోయింది. ఇటీవల ఈ మూవీలోని పాటల గురించి అనంతశ్రీరామ్‌ మాట్లాడుతూ, ఒక్కో పాటని మించి మరోపాట ఉంటుందని, అభిమానులను ఊపేసే విధంగా ఉంటుందని తెలిపారు. ఐటెమ్‌ సాంగ్‌ లేదని దర్శకుడు హరీష్‌ శంకర్‌ వెల్లడించారు.

35
`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సెన్సార్‌ రివ్యూ
Image Credit : Asianet News

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సెన్సార్‌ రివ్యూ

ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. సినిమ సెన్సార పూర్తి చేసుకుంది. యూ ఏ సర్టిఫికేట్‌ వచ్చింది. ఎలాంటి కట్స్ లేకుండా ఈ సర్టిఫికేట్‌ ఇవ్వడం విశేషం. ఈ సమ్మర్‌కి ఫ్యామిలీ అంతా కలిసి చూసే మూవీ అవుతుందని, ఫ్యామిలీ ఆడియెన్స్ తో థియేటర్లు నిండిపోతాయని టీమ్‌ వెల్లడించింది. సినిమా రెండు గంటల 29 నిమిషాలు ఉంటుందట. మూవీ పిల్లలు తప్ప అన్ని వర్గాల ఆడియెన్స్ చూడొచ్చు. వల్గారిటీగానీ, రొమాన్స్ గానీ ఎక్కువగా ఉండదు. కాకపోతే యాక్షన్‌ ఉంటుంది. అది కూడా డీసెంట్‌గానే ఉంటుందని సమాచారం.

45
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ నో పొలిటికల్‌ డైలాగ్స్
Image Credit : Asianet News

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ నో పొలిటికల్‌ డైలాగ్స్

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీలో శ్రీలీలా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. పార్థిబన్‌ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. ఈ చిత్రం వచ్చే గురువారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇది తమిళంలో వచ్చిన `థెరి`కి రీమేక్‌ అనే ప్రచారం జరిగిన నేపథ్యంలో అది నిజం కాదని తెలిపారు హరీష్‌ శంకర్‌. అదే సమయంలో సినిమాలో పొలిటికల్‌ డైలాగ్‌లు కూడా ఉండవని, చాలా నీట్‌గా ఉంటుందని వెల్లడించారు.

55
మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Image Credit : Asianet News

మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా హరీష్‌ ఈ మూవీని రూపొందించారు. అభిమానులు కోరుకునేలా మాస్‌ డైలాగ్ లు, యాక్షన్‌ ఉంటుందని సమాచారం. అవి మూవీని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తాయి. మరి థియేటర్లలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Recommended image2
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Recommended image3
Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి
Related Stories
Recommended image1
Top 10 Netflix Movies: ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న తెలుగు కామెడీ సినిమా.. నెంబర్‌ 1లో ఉన్న మూవీ ఏంటంటే?
Recommended image2
MSG Final Collections: మన శంకర వర ప్రసాద్‌ గారు ఫైనల్‌ కలెక్షన్లు.. చిరంజీవి మూవీకి లాభం ఎన్ని కోట్లంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved