- Home
- Entertainment
- Ram Charan: చరణ్ కెరీర్ లో 5 చెత్త సినిమాలు, ఆ రెండింటికీ కోటి దండాలు..రంగస్థలం తర్వాత కూడా రియలైజ్ కాలేదు
Ram Charan: చరణ్ కెరీర్ లో 5 చెత్త సినిమాలు, ఆ రెండింటికీ కోటి దండాలు..రంగస్థలం తర్వాత కూడా రియలైజ్ కాలేదు
రాంచరణ్ తన కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలే చేశారు. చాలా సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. రాంచరణ్ తన కెరీర్ లో చేసిన 5 చెత్త సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Ram Charan
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన తన కెరీర్ బిగినింగ్ నుంచి మాస్ ఆడియన్స్ టార్గెట్ గా సినిమాలు చేస్తూ వచ్చారు. మధ్యలో ఆరెంజ్ లాంటి ఎక్స్ పెరిమెంట్స్ చేసినా వర్కౌట్ కాలేదు. కానీ ఆరెంజ్ మూవీ ఒక మంచి ప్రయత్నంగా నిలిచిపోయింది. అయితే రాంచరణ్ తన కెరీర్ అస్సలు చేయకుండా ఉండాల్సిన 5 చెత్త సినిమాలు ఉన్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

తుఫాన్
రాంచరణ్ కెరీర్ లో తొలి చెత్త సినిమా ఇదే. రాంచరణ్ బాలీవుడ్ డెబ్యూ చేసిన చిత్రం కూడా ఇదే. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శలపాలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్ద డిజాస్టర్.
బ్రూస్ లీ
శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రాంచరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఫక్తు కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం వర్కౌట్ కాలేదు. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.
వినయ విధేయ రామ
రంగస్థలం లాంటి అద్భుతమైన చిత్రం తర్వాత రాంచరణ్ వినయ విధేయ రామ చిత్రంలో నటించారు. రంగస్థలం చిత్రంతో అభిమానులు చరణ్ నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారో అర్థమైంది. అయినా కూడా చరణ్ రియలైజ్ కాలేదేమో. బోయపాటి దర్శకత్వంలో ఏమాత్రం పస లేని రొటీన్ మాస్ చిత్రం చేశారు. వినయ విధేయ రామ చిత్రం తొలి షో నుంచే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది.
ఆచార్య
అసలు ఈ మూవీలో చరణ్ నటించకుండా ఉండాల్సింది. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఆచార్య మూవీ. ఈ మూవీలో చరణ్ హీరో కాదు. తన తండ్రి సినిమా కావడంతో కీలక పాత్రలో నటించారు.
గేమ్ ఛేంజర్
శంకర్ దర్శత్వంలో రాంచరణ్ నటించిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ విషయంలో చాలా తప్పులు జరిగాయి. అసలు ఈ చిత్రానికి 300 కోట్లకి పైగా బడ్జెట్ పెట్టాల్సింది కాదు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇలాంటి కథ ఎంచుకోవాల్సింది కాదు అని అభిమానుల నుంచి కామెంట్స్ వినిపించాయి.
మొత్తంగా తుఫాన్, ఆచార్య సినిమాలు రాంచరణ్ కెరీర్ లో పరమ చెత్త సినిమాలుగా నిలిచిపోతాయి.

