MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: సీఈఓగా దీప, జ్యో- కార్తీక్, దీపలను విడదీసిన జ్యో- కాంచన ఆవేశం

Karthika Deepam 2 Today Episode: సీఈఓగా దీప, జ్యో- కార్తీక్, దీపలను విడదీసిన జ్యో- కాంచన ఆవేశం

Karthika Deepam 2 Today Episode (మే 18వ తేదీ)లో సీఈఓ పోస్టు ఓటింగ్ లో దీప, జ్యోలకు సమాన ఓట్లు. ఇద్దరికీ మరో పరీక్ష పెట్టిన శివన్నారాయణ. కార్తీక్, దీపలను విడదీసే కండిషన్ పెట్టిన జ్యో. ఆవేశంతో ఊగిపోయిన కాంచన. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే.. 

2 Min read
Author : Kavitha G
Published : May 18 2026, 08:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో భయపడుతూ చీటీ తీస్తుంది జ్యోత్స్న. ఆ చీటీపై దీప పేరు ఉంటుంది. దీపకు ఇంకొక ఓటు వస్తే గెలుపు ఎవరిదో అందరికీ అర్థమైపోతుంది అంటాడు కార్తీక్. వణికిపోతూ మరో చీటీ తీస్తుంది జ్యోత్స్న. దీంట్లో దీప పేరు వస్తే.. నా పదవి, పరువు రెండూ పోతాయని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కానీ ఆ చీటిలో జ్యోత్స్న పేరు ఉండటంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జ్యో, దీపలకు పరీక్ష
Image Credit : Jiohotstar

జ్యో, దీపలకు పరీక్ష

ఓట్లు ఇద్దరికీ సమానంగా వచ్చాయి, ఇప్పుడెలా? అంటాడు శివన్నారాయణ. అయితే కంపెనీకి ఇద్దరు సీఈఓగా ఉంటారని అంటాడు కార్తీక్. అదేలా కుదురుతుందని అంటుంది జ్యోత్స్న. ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయంటే సీఈఓ అయ్యే సమర్థత ఇద్దరికీ ఉందని అర్థం. ఇద్దరికీ ఒక పరీక్ష పెడతాను. మనకున్న బ్రాంచ్ లలో నష్టాల్లో ఉన్న బ్రాంచ్ లను ఇద్దరికీ ఇస్తాను. ఎవరైతే రెండు వారాల్లో వాటిని లాభాల్లోకి తీసుకొస్తారో వాళ్లే విజేత అని చెప్తాడు శివన్నారాయణ.

36
జ్యో కండీషన్
Image Credit : Jiohotstar

జ్యో కండీషన్

శివన్నారాయణ పెట్టిన పరీక్షకు జ్యోత్స్న, దీప ఒప్పుకుంటారు. బావ సలహాతో దీప ఈజీగా గెలిచే అవకాశం ఉంది కాబట్టి బావ దీపకు సలహాలు ఇవ్వకూడదు అంటుంది జ్యోత్స్న. నా భార్యపై నాకు నమ్మకం ఉంది. నేను ఎలాంటి సలహాలు ఇవ్వను అంటాడు కార్తీక్. పోటీ జరిగే ఈ రెండు వారాలు నువ్వు మా ఇంట్లో, దీప మీ ఇంట్లో ఉండాలి. అప్పుడే పోటీ న్యాయంగా జరుగుతుందని కండీషన్ పెడుతుంది జ్యోత్స్న. దీపను రెచ్చగొట్టి కండీషన్ కి ఒప్పిస్తుంది.

46
అడ్డుపడ్డ శ్రీధర్
Image Credit : Jiohotstar

అడ్డుపడ్డ శ్రీధర్

శ్రీధర్ అడ్డుపడతాడు. దీప ఒప్పుకున్నాక మీకేంటి సమస్య అంటుంది జ్యోత్స్న. వాళ్లిద్దరు భార్యాభర్తలు. పైగా దీప ప్రెగ్నెంట్. ఈ టైంలో దీపకు భర్త అవసరం ఉంటుందని అంటాడు శ్రీధర్. పర్సనల్ లైఫ్ ను ప్రొఫెషనల్ లైఫ్ తో ముడిపెట్టొద్దని అంటుంది జ్యోత్స్న . కావాలంటే మనం మార్గం ఆలోచిద్దాం అని దీపతో అంటాడు శివన్నారాయణ. నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోను అంటుంది దీప. అంతటితో మీటింగ్ అయిపోతుంది.

56
ప్లేట్ నేలకేసి కొట్టిన కాంచన
Image Credit : Jiohotstar

ప్లేట్ నేలకేసి కొట్టిన కాంచన

శ్రీధర్, కాంచన దగ్గరికి వస్తాడు. ఆఫీసులో ఏం జరిగిందని కాంచన అడుగుతుండగానే జ్యోత్స్న వస్తుంది. కార్తీక్, దీప కూడా వెనకాలే వస్తారు. నువ్వు బయటికి వెళ్లు మేనకోడలా నేను కాంచనతో మాట్లాడాలి అంటాడు శ్రీధర్. మేనకోడలు, కాదు త్వరలో కోడలిగానే చూస్తారు అంటుంది జ్యోత్స్న. కోపంతో చేతిలో ప్లేట్ నేలకేసి కొడుతుంది కాంచన. మాటలు జాగ్రత్తగా మాట్లాడమని వార్నింగ్ ఇస్తుంది. అసలు నువ్వు ఎందుకు వచ్చావు వెళ్లు ఇక్కడి నుంచి అంటుంది కాంచన. నేను నీ కొడుకును తీసుకెళ్లడానికి వచ్చాను అని కార్తీక్ చేయి పట్టుకుంటుంది జ్యోత్స్న.

66
కాంచన సీరియస్
Image Credit : Jiohotstar

కాంచన సీరియస్

నా కొడుకు చేయి వదిలిపెట్టు అని సీరియస్ అవుతుంది కాంచన. సీఈఓ పోటీ గురించి చెప్తుంది జ్యోత్స్న. రెండు వారాలు బావ మా ఇంట్లోనే ఉంటాడు. ఈ ఇంటికి రాడు. దీప మా ఇంటికి రాదు అంటుంది. నీకు ఈ ఎలక్షన్, పోటీ అవసరమా అని దీపను అడుగుతుంది కాంచన. తప్పలేదు అంటాడు కార్తీక్. ఫోన్ ఇవ్వు నేను మా అన్నయ్యకు ఫోన్ చేసి ఈ గాడిదను మన ఇంటి మీదకు ఎందుకు వదిలాడో అడుగుతా అని కోప్పడుతుంది కాంచన. 

మీరు మీ సంతోషాలు త్యాగం చేస్తున్నారని అనుకున్నాను కానీ.. జీవితాలనే త్యాగం చేస్తున్నారు ఇదంతా మనకు అవసరమా.. అంటుంది కాంచన. అవసరమే అమ్మా.. కంపెనీ జ్యోత్స్న చేతుల్లో పెడితే ఉద్యోగులంతా అడుక్కు తింటారు అంటాడు కార్తీక్. బావ అని కోపంగా అంటుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image2
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Recommended image3
Allu Aravind: పవన్‌ కళ్యాణ్‌ వెండితెరకు పరిచయమై 30ఏళ్లు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోకు షాక్ ఇచ్చిన దశరథ- కొత్త సీఈఓగా దీప- పారుపై కార్తీక్ డౌట్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యోకు మాటిచ్చిన దీప- తాళి కట్టమంటే కడతావా అని ప్రశ్నించిన శ్రీధర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved