OTT : 2025లో అత్యధికంగా చూసిన 10 వెబ్ సిరీస్‌లు, IMDb ర్యాంకింగ్స్
Top 10 Most Watched Web Series : 2025 పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్‌ల జాబితా వచ్చేసింది. IMDb రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం 25 కోట్లకు పైగా నెలవారీ వ్యూవర్స్ ఆధారంగా ఎక్కువ రేటింగ్ ఉన్న సిరీస్‌ల గురించి చూద్దాం.

క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్
IMDb రేటింగ్ ప్రకారం 2025లో అత్యధికంగా చూసిన సిరీస్‌ల జాబితాలో 10వ స్థానంలో పంకజ్ త్రిపాఠి వెబ్ సిరీస్ 'క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్' ఉంది. దీన్ని జియో హాట్‌స్టార్‌లో చూడొచ్చు.
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3
మనోజ్ బాజ్‌పేయి సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3' IMDb 2025 జాబితాలో 9వ స్థానంలో ఉంది. దీన్ని ఓటీటీ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
ఖాకీ: ది బెంగాల్ చాప్టర్
IMDb రేటింగ్ ప్రకారం 2025లో అత్యధికంగా చూసిన ఇండియన్ సిరీస్‌ల జాబితాలో 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్' 8వ స్థానంలో ఉంది. దీన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.
స్పెషల్ ఆప్స్ సీజన్ 2
'స్పెషల్ ఆప్స్ సీజన్ 2' వెబ్ సిరీస్‌ను జియో హాట్‌స్టార్‌లో చూడొచ్చు. IMDb 2025 జాబితాలో ఇది 7వ స్థానంలో ఉంది.
ఖౌఫ్
రజత్ కపూర్ నటించిన వెబ్ సిరీస్ 'ఖౌఫ్'ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. IMDb 2025లో అత్యధికంగా చూసిన సిరీస్‌ల జాబితాలో ఇది ఆరో స్థానంలో ఉంది.
మండల మర్డర్స్
వాణీ కపూర్ వెబ్ సిరీస్ 'మండల మర్డర్స్'ను నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ IMDb జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది.
పంచాయత్ సీజన్ 4
IMDb పాపులర్ ఇండియన్ సిరీస్‌ల జాబితాలో నీనా గుప్తా సిరీస్ 'పంచాయత్ సీజన్ 4' నాలుగో స్థానంలో ఉంది. దీన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
పాతాళ్ లోక్ సీజన్ 2
జైదీప్ అహ్లావత్ వెబ్ సిరీస్ 'పాతాళ్ లోక్ సీజన్ 2'ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. IMDb 2025 జాబితాలో ఈ సిరీస్ మూడో స్థానంలో ఉంది.
బ్లాక్ వారెంట్
IMDb 2025 పాపులర్, అత్యధికంగా చూసిన సిరీస్‌ల జాబితాలో 'బ్లాక్ వారెంట్' రెండో స్థానంలో ఉంది. జహాన్ కపూర్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.
ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్
లక్ష్య లల్వానీ వెబ్ సిరీస్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' IMDb 2025 జాబితాలో అగ్రస్థానంలో ఉంది. దీన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.

