నా భార్య కంటే నాకు సమంతే ఎక్కువ.. డైరెక్టర్ క్రేజీ కామెంట్స్..!
సమంత తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం వేళ… డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Samantha
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. ఆమెకు దేశ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. దశాబ్దానికి పైగా ఆమె సినిమాలు చేస్తూ వస్తున్నారు. నాగ చైతన్యతో వివాహం తర్వాత కూడా ఆమె సినిమాలు చేయడం ఆపలేదు. కానీ నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఆమె విడాకులు తీసుకున్నారు. రీసెంట్ గా ఫ్యామిలీ మెన్ డైరెక్టర్ రాజ్ నిడుమోరు ని రెండో వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి ఫోటోలను కూడా సమంత రీసెంట్ గా షేర్ చేసుకోగా... అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.
సమంతపై రాహుల్ కామెంట్స్..
తాజాగా సమంత గురించి ఓ నటుడు, స్టార్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాహుల్... ‘ అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రాహుల్.. తర్వాత డైరెక్టర్ గా కూడా మారాడు. రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా... సమంత తో తన అనుబంధాన్ని వివరించాడు.
సమంత తనకు చాలా ప్రత్యేకమని రాహుల్ చెప్పారు. ఆమెను చూస్తే తనకు తన ఎల్కేజీ క్లాస్ మెట్ లా అనిపిస్తుందని నవ్వుతూ సమాధానం చెప్పారు. అంతేకాదు... తన భార్య చిన్మయి... సమంతను ‘ డార్లింగ్ ’ అని ప్రేమగా పిలుస్తుందని, నిజానికి సామ్.. తన జీవితంలో ఇద్దరికీ కూడా ఎంతో దగ్గరైన వ్యక్తి అని వివరించాడు.
సమంతతో స్నేహం..
‘ఏ మాయ చేశావే’ కంటే ముందే.. సమంత తో తాను ఒక తమిళ సినిమా చేశానని.. అప్పటి నుంచే తమ స్నేహం మొదలైందని చెప్పాడు. నా భార్య కంటే నాకు సమంతే ఎక్కువ అని కూడా చెప్పడం విశేషం. ‘ఎక్కడ ఉన్నా సమంత బాగుండాలని, ఆమె జీవితం సంతోషంగా ఉండాలి అని నేను, చిన్మయి ఇద్దరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం’ అని రాహుల్ చెప్పడం విశేషం. రాహుల్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

