- Home
- Entertainment
- Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
Megastar Chiranjeevi : చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా ఉన్నారు. మెగాస్టార్ గా ఎదిగిన చిరు కానీ కెరీర్ బిగినింగ్ లో చిన్నచిన్న పాత్రలు, విలన్ రోల్స్ కూడా చేశారని మీకు తెలుసా? మెగాస్టార్ రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏది?

ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి ఒక్కొ మెట్టు ఎక్కుతూ.. అంచలంచలుగా ఎదిగారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. పట్టుదలతో హీరోగా అవకాశాలు సాధించాడు. అప్పటి వరకూ ఏ హీరో చూపించలేని కొత్త టాలెంట్ ను ఆయన చూపించారు. డ్యాన్స్ విషయంలో చిరంజీవి చేసిన ప్రయోగాలు ఆయను టాలీవుడ్ లో స్టార్ గా నిలబెట్టాయి. యాక్టింగ్, ఎమోషన్, రొమాన్స్, యాక్షన్ సీన్స్, ఇలా అన్ని విషయాల్లో బెస్ట్ అనిపించుకున్నారు చిరంజీవి, అప్పుడు చిరంజీవికి పోటీగా ఉన్న హీరోలలో మంచి డ్యాన్సర్ ఎవరు లేకపోవడంతో.. ఆ పాయింట్ ను పట్టుకుని.. పట్టుదలతో ప్రాక్టీస్ చేసి.. హీరోగా ఎదిగాడు చిరంజీవి.
కెరీర్ బిగినింగ్ లో విలన్ గా చిరంజీవి..
ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి.. తన సొంత కష్టంతో హీరోగా ఎదిగారు. ఈక్రమంలో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు. విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించారు. 1979 లో కమల్ హాసన్, జయసుధ కాంబినేషన్ లో వచ్చిన ఇది కథ కాదు సినిమాలో, అలాగే 1980 లో శోభన్ బాబు, శ్రీదేవి నటించిన మోసగాడు మూవీలో, 1981 లో వచ్చిన న్యాయం కావాలి సినిమాలో కూడా చిరంజీవి విలన్ గా నటించి మెప్పించారు. వీటితో పాటు 47 డేస్, తిరుగులేని మనిషి సినిమాల్లో కూడా మెగాస్టార్ నెగెటీవ్ రోల్స్ చేశారు. అయితే ఆయన విలన్ గా నటించిన మూవీ మరొకటి ఉంది. అది చాలామందికి తెలియదు.
చిరంజీవి విలన్ గా 2 నిమిషాలు కనిపించిన సినిమా
చిరంజీవి విలన్ గా నటించిన సినిమాలు అంటే అందరికి ఇది కథ కాదు, మోసగాడు , న్యాయం కావాలి లాంటి సినిమాలే కనిపిస్తుంటాయి. కానీ ఆయన విలన్ గా నటించిన మరో సినిమా కూడా ఉంది. అది చాలా తక్కువ మందికి తెలుసు. ఆ సినిమా మరేదో కాదు తాయారమ్మ బంగారయ్య. ఈ సినిమాలో చిరంజీవి క్లైమాక్స్ లో రెండే రెండు నిమిషాలు విలన్ గా కనిపించారు. అయితే కనిపించిన ఆరెండు నిమిషాలు కూడా చిరంజీవి నటన అద్భుతంగా ఉంటుంది. రంగనాథ్, శరత్ బాబు లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, షావుకారు జానకి టైటిల్ రోల్స్ పోషించారు. మెగాస్టార్ చిరంజీవి మాత్రం కైకాల అల్లుడి పాత్రలో.. ఆయన కూతుర్ని హింసించి చంపే, క్రూరమైన విలన్ గా కనిపించారు. ఈ పాత్రతో చిరంజీవికి మంచి పేరు వచ్చింది.
హీరోగా టాలీవుడ్ పై చిరంజీవి ప్రభావం..
చిరంజీవితో పాటు టాలీవుడ్ కు నాలుగు స్థంభాల్లా నిలిచిన బాలయ్య, నాగార్జున, వెంకటేష్ ఈ నలుగురు హీరోలు వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చి.. ట్యాలెంట్ తో ఎదిగారు. కానీ చిరంజీవి మాత్రం స్వతహాగా.. ఎటువంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ రేంజ్ కు ఎదిగి చూపించారు. టాలీవుడ్ లో మెగా సామ్రాజ్యాన్ని నిర్మించారు. చిరంజీవి తరువాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్, తనయుడు రామ్ చరణ్, అల్లుడు అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక.. ఇలా మెగా ఫ్యామిలీలో హీరోలు , హీరోయిన్లు, నిర్మాతలు, కలిపి.. సౌత్ కపూర్స్ ఫ్యామిలీగా మెగా కుటుంబం మారిపోయింది.
చిరంజీవి సినిమాలు..
70 ఏళ్ల వయసులో కూడా తగ్గేది లేదంటున్నారు చిరంజీవి. ఇప్పటికీ అదే గ్రేస్, అదే ఊపు మెయింటేన్ చేస్తున్నారు. ఈ వయసులో కూడా డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తోన్న మన శంకరవర ప్రసాదు గారు రిలీజ్ కు రెడీగా ఉంది. సంక్రాంతికి ఈసినిమా సందడి చేయబోతోంది. ఇక వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సమ్మర్ లో సందడి చేయబోతోంది. దీనితో పాటు బాబీ డైరెక్షన్ లో మరో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు చిరంజీవి. యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు.

