MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Villain Ajay: తన భార్యపై నటుడు అజయ్ సంచలన వ్యాఖ్యలు..ఖుషి అప్పుడే మొదలు, విక్రమార్కుడు ఆమె వల్లే వచ్చింది

Villain Ajay: తన భార్యపై నటుడు అజయ్ సంచలన వ్యాఖ్యలు..ఖుషి అప్పుడే మొదలు, విక్రమార్కుడు ఆమె వల్లే వచ్చింది

విలన్ గా రాణిస్తున్న నటుడు అజయ్ తన భార్య శ్వేత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భార్య వల్లే కెరీర్ టర్న్ అయింది అని అజయ్ పేర్కొన్నారు. ఆ వివరాలు ఈ కథనంలో ఉన్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 26 2026, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Actor Ajay
Image Credit : Asianet News

Actor Ajay

టాలీవుడ్ లో యంగ్ విలన్ గా నటుడు అజయ్ దూసుకుపోతున్నారు. 2000 సంవత్సరంలో కౌరవుడు అనే చిత్రంతో అజయ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఖుషి, వర్షం లాంటి పెద్ద చిత్రాల్లో అజయ్ కి అవకాశాలు దక్కాయి. కానీ బలమైన పాత్ర పడలేదు. తన కెరీర్ ని టర్న్ చేసే పాత్ర కోసం అజయ్ ఆరేళ్ళు ఎదురుచూడాల్సి వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం
Image Credit : Actor Ajay\Instagram

కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమార్కుడు మూవీలో అజయ్ టిట్లా భాయ్ అనే భయంకర విలన్ గా నటించాడు. ఈ పాత్ర అజయ్ కెరీర్ ని మలుపు తిప్పేసింది. టాలీవుడ్ లో క్రేజీ విలన్ గా నిలబెట్టింది. అజయ్ మాట్లాడుతూ విక్రమార్కుడు ముందు వరకు కూడా నేను పెద్ద సినిమాల్లో నటించాను. కానీ స్ట్రాంగ్ రోల్ పడలేదు. దీనితో ఎలాంటి సినిమాలు చేయాలి అనే కన్ఫ్యూజన్ ఉండేది.

Related Articles

Related image1
Tollywood: చిరంజీవి, కృష్ణంరాజు, నాగార్జున కుటుంబాల బలమైన బ్యాగ్రౌండ్ తుస్సుమందా.. ఈ 5 ఎందుకు ఫ్లాప్ అంటే
Related image2
Akhil: తెలిసీతెలియక బురదలో కాలేశా, రంగస్థలం నా మైండ్ సెట్ మార్చింది.. తన మూవీపై తానే సెటైర్లు వేసిన అఖిల్
35
నా భార్య వల్లే అదృష్టం
Image Credit : Actor Ajay\Instagram

నా భార్య వల్లే అదృష్టం

విక్రమార్కుడు మూవీ నా కన్ఫ్యూజన్ ని పూర్తిగా చెరిపివేసింది. నేను ఎలాంటి సినిమాలో చేయాలో నాకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నా భార్య శ్వేతతో పరిచయం ఏర్పడినప్పుడు ఖుషి మూవీలో ఛాన్స్ వచ్చింది. ఆమెని పెళ్లి చేసుకున్న తర్వాత విక్రమార్కుడు సినిమాలో ఛాన్స్ వచ్చింది. నా భార్య నాకు అదృష్టం తెచ్చిపెట్టింది. విక్రమార్కుడు తర్వాత నా రెమ్యునరేషన్ పెరిగింది. బాగా సంపాదించాను. అదంతా నా భార్య వల్ల వచ్చిన అదృష్టమే అని అజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

45
ఆమె ఫ్యాషన్ డిజైనర్
Image Credit : Asianet News

ఆమె ఫ్యాషన్ డిజైనర్

అజయ్ భార్య శ్వేతా మోడల్ గా కూడా రాణించారు. బ్యూటీ పెజెంట్ లలో పాల్గొన్నారు. పెళ్లయ్యాక ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తున్నారు. కానీ అది సంపాదన కోసం కాదు. ఒక హాబీ లాగా మాత్రమే చేస్తున్నారు. ఇంటి పనులు మొత్తం తానే మేనేజ్ చేస్తుంది అని అజయ్ పేర్కొన్నారు. మా ఇద్దరిదీ లవ్ మ్యారేజ్. ఖుషి చిత్రం నుంచే ఆమెతో ట్రావెల్ స్టార్ట్ అయింది అని అజయ్ గుర్తు చేసుకున్నారు.

55
అజయ్ సినిమాలు
Image Credit : Asianet News

అజయ్ సినిమాలు

విక్రమార్కుడు తర్వాత అజయ్ ఇష్క్, గబ్బర్ సింగ్, బృందావనం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అ..ఆ, భలే భలే మగాడివోయ్, జనతా గ్యారేజ్ లాంటి అద్భుతమైన సినిమాల్లో నటించాడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Tortoise First Look: అస్సలు గుర్తు పట్టలేని విధంగా రాజ్ తరుణ్, ఇంత వైల్డ్ గా ఉన్నాడేంటి
Recommended image2
Korean Kanakaraju: థియేటర్స్ లో సక్సెస్, ఓటీటీ స్ట్రీమింగ్ వరుణ్ తేజ్ మూవీ రెడీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే
Recommended image3
Mamitha Baiju: ఆ హీరోయిన్ ఉంటే 100 కోట్లు గ్యారెంటీ, పట్టిందల్లా బంగారమే.. రెమ్యునరేషన్ కూడా చుక్కల్లోకి
Related Stories
Recommended image1
Tollywood: చిరంజీవి, కృష్ణంరాజు, నాగార్జున కుటుంబాల బలమైన బ్యాగ్రౌండ్ తుస్సుమందా.. ఈ 5 ఎందుకు ఫ్లాప్ అంటే
Recommended image2
Akhil: తెలిసీతెలియక బురదలో కాలేశా, రంగస్థలం నా మైండ్ సెట్ మార్చింది.. తన మూవీపై తానే సెటైర్లు వేసిన అఖిల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved