MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajamouli: క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేత సిక్స్ ప్యాక్ చేయించాలని చూసిన రాజమౌళి, చివరకు ఏమయ్యిందంటే?

Rajamouli: క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేత సిక్స్ ప్యాక్ చేయించాలని చూసిన రాజమౌళి, చివరకు ఏమయ్యిందంటే?

Rajamouli: ఆర్టిస్ట్ ఎంత గొప్పవాడైనా కానీ.. తనకు కావల్సిన అవుట్ పుట్ వచ్చేంతవరకూ వదిలిపెట్టాడు రాజమౌళి. చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటాడు. ఈక్రమంలోనే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ను సిక్స్ ప్యాక్ చేయమన్నాడట జక్కన్న.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 26 2026, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పనిరాక్షసుడు రాజమౌళి..
Image Credit : Asianet News

పనిరాక్షసుడు రాజమౌళి..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. సినిమా కోసం పరితపించే దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన మూవీ మేకింగ్ ఎలా ఉంటుందంటే.. ఆర్టిస్టులను పిండి తనకు కావల్సిన అపుట్ పుట్ రాబట్టుకుంటాడు. అందుకోసం ఎన్ని టేకులైనా తీసుకోడానికి జక్కన్న రెడీగా ఉంటాడు. చిన్నా పెద్దా ఆర్టిస్ట్ లు ఎవరైనా సరే.. రాజమౌళి చేతిలో పడితే అంతే. అందుకే ఆయన సినిమాలో నటించాలని స్టార్ యాక్టర్స్ ఎంతో ఆరాటపడుతుంటారు. ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు కూడా రాజమౌళి టార్చర్ తట్టుకోలేము.. పనిరాక్షసుడు అంటూ సరదా కామెంట్స్ చేసిన రోజులు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాహుబలి నాటి సంగతులు..
Image Credit : others

బాహుబలి నాటి సంగతులు..

బాహుబలి సినిమాతో టాలీవుడ్ రేంజ్ నే మార్చేశాడు రాజమౌళి. ఈ సినిమా కోసం రాజమౌళి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ప్రభాస్, రానాలను ఎలా తయారు చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో ప్రభాస్, రానాలతో పాటు అందరు దాదాపు సిక్స్ ప్యాక్ తో, ఫిట్ బాడీతో కనిపిస్తుంటారు. కానీ బిజ్జల దేవుడి పాత్రలో ఉన్న నాజర్ మాత్రం ఫ్యామిలీ ప్యాక్ తో దివ్యాంగుడి పాత్రలో కనిపించాడు. అయితే ఈ పాత్ర వెనుక చాలా పెద్ద కథ నడిచింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఒకటి ఉంది. ఈ విషయాలను నాజర్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

35
బాహుబలితో బిజ్జలదేవుడి పాత్ర ఇంపార్టెన్స్..
Image Credit : Chatgpt

బాహుబలితో బిజ్జలదేవుడి పాత్ర ఇంపార్టెన్స్..

బాహుబలి' చిత్రంలో బిజ్జలదేవుడిగా తన అద్భుత నటనతో అలరించిన దిగ్గజ నటుడు నాజర్, ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమా విశేషాలను షేర్ చేసుకున్నాడు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో తనకున్న అనుభవాలను, ఆయన మేకింగ్ స్టైల్ కు సబంధించిన ఆసక్తికర సంగతులను ఆయన పంచుకున్నారు. బిజ్జలదేవ పాత్ర ఎంత ఇంపార్టెంట్ అంటే.. కథ వినిపించే సమయంలో రాజమౌళి నాజర్‌తో, "ఈ బిజ్జలదేవ క్యారెక్టర్ లేకపోతే ఈ కథ రూపుదిద్దుకోదు, ముందుకు సాగదు" అని చెప్పారట. రాజ్యసింహాసనం తనకు దక్కలేదనే ఆవేదన, ఎలాగైనా ఆ రాజ్యాధికారాన్ని తన కుమారుడైన భల్లాలదేవుడికి దక్కేలా చేయాలనే కుట్రపూరితమైన పట్టుదలే 'బాహుబలి' కథకి అసలు మూలస్తంభం.

45
సిక్స్ ప్యాక్ వెనుక సరదా ముచ్చట
Image Credit : Asianet News

సిక్స్ ప్యాక్ వెనుక సరదా ముచ్చట

నాజర్ ఈ పాత్రలోని లోతును, ఇంపార్టెన్స్ ను గ్రహించి బిజ్జలదేవుడి పాత్రలో జీవించారు.'బాహుబలి' సినిమా కోసం ప్రభాస్, రాణా వంటి హీరోలు తమ శరీరకృతిని ఎంతగానో మార్చుకొని భారీగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు. అయితే, రాజమౌళి సరదాగా నాజర్‌ని కూడా సిక్స్ ప్యాక్ చేయమని అడిగారట. అందరు సిక్స్ ప్యాక్ తో ఉన్నారు. మీరు కూడా రాజే కదా.. "సార్, మీరు కూడా ట్రై చేయొచ్చు కదా!" అని రాజమౌళి కోరగా.. నాజర్ నవ్వుతూ "అందరూ సిక్స్ ప్యాక్‌లతో ఉంటే, నేను ఒక్కడినే 'ఫ్యామిలీ ప్యాక్'తో ఉంటాను, నా వల్ల కాదురా నాయనా, నన్ను వదిలేయ్!" అని నిరాకరించినట్లు ఆయన వెల్లడించారు.

55
బాహుబలి విజయంలో పాత్రలు...
Image Credit : our own

బాహుబలి విజయంలో పాత్రలు...

బాహుబలి' అంతటి దిగ్విజయాన్ని సాధించడానికి కేవలం భారీ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే కాకుండా.. చిన్నా పెద్ద పాతరలు, ముఖ్యంగా బిజ్జలదేవుడి లాంటి బలమైన విలన్ పాత్ర ప్రభావం ఎంతో ఉంది. అంతే కాదు వాటి వెనుక రాజమౌళి చూపించిన శ్రద్ధ, అందరు నటీనటులు ఎంతో అద్భుంగా నటించడం బాహుబలి ఘన విజయానికి కారణం అయ్యాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
Recommended image2
Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్
Recommended image3
Taapsee Marriage: 13 ఏళ్ల సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పిన తాప్సీ..నా పార్ట్నర్ ని నేనే ఎంచుకున్నా
Related Stories
Recommended image1
చిరంజీవితో జంటగా డ్యాన్స్ చేయాని కోరిక.. రెండు ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved