MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Akhil: తెలిసీతెలియక బురదలో కాలేశా, రంగస్థలం నా మైండ్ సెట్ మార్చింది.. తన మూవీపై తానే సెటైర్లు వేసిన అఖిల్

Akhil: తెలిసీతెలియక బురదలో కాలేశా, రంగస్థలం నా మైండ్ సెట్ మార్చింది.. తన మూవీపై తానే సెటైర్లు వేసిన అఖిల్

లెనిన్ తో ఫస్ట్ హిట్ కొట్టాక అఖిల్ అక్కినేని తన తొలి చిత్రం అఖిల్ పై సెటైరికల్ కామెంట్స్ చేశాడు. అదే విధంగా రాంచరణ్ రంగస్థలం మూవీ గురించి అఖిల్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 25 2026, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Akhil Akkineni
Image Credit : Asianet News

Akhil Akkineni

అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం లెనిన్ ఘనవిజయం సాధించింది. పదేళ్లుగా ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కి సరైన సక్సెస్ లభించింది. స్వయంగా నాగార్జున నిర్మించిన ఈ చిత్రం బయ్యర్లకు లాభాలు అందిస్తోంది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తొలి చిత్రంపై సెటైర్లు
Image Credit : Asianet News

తొలి చిత్రంపై సెటైర్లు

లెనిన్ సక్సెస్ తర్వాత అఖిల్ తన కెరీర్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కెరీర్ బిగినింగ్ లో ఎదురైన పరాజయాలు, వాటి నుంచి నేర్చుకున్న అనుభవాలని పంచుకున్నారు. పెద్దగా మెచ్యూరిటీ లేని టైంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాను. నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నది మెథడ్ యాంక్టింగ్. కానీ నా సినిమాల్లో ఎప్పుడూ అది చేయలేదు. నా ఫస్ట్ మూవీలో 6 పాటలు, 5 ఫైట్స్, 5 కామెడీ సీన్లు, 3 సెంటిమెంట్ సీన్లు ఉంటాయి.

35
అదే బురదలో కాలేశాను
Image Credit : Asianet News

అదే బురదలో కాలేశాను

తెలుగు కమర్షియల్ సినిమాల్లో ఇది రొటీన్ ఫార్ములా. ఆ ఫార్ములా ఎండ్ అయిపోతున్న దశలో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. తెలిసీ తెలియక అదే బురదలో కాలేశాను. రొటీన్ ఫార్ములా కావడంతో అఖిల్ మూవీ డిజాస్టర్ అయింది. ఆ టైం లో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ అదరగొట్టేసింది. జనాలు కొత్తదనం కోరుకుంటున్నారు అని అర్థం అయింది. అర్జున్ రెడ్డి కమర్షియల్ మూవీ కాదు.

45
మార్పు తీసుకువచ్చిన చిత్రం రంగస్థలం
Image Credit : Asianet News

మార్పు తీసుకువచ్చిన చిత్రం రంగస్థలం

కమర్షియల్ సినిమాల్లో నా మైండ్ సెట్ మార్చిన మూవీ రంగస్థలం. అసలు ఏం సినిమా అది. రాంచరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటించాడు. ఒక స్టోరీని నమ్మి వాళ్ళు దానిని పెద్ద స్కేల్ లో తీసేశారు. జనాలు పిచ్చెక్కిపోయారు. ఆ యుఫోరియా నాకు ఇంకా గుర్తుంది. కమర్షియల్ సినిమాల్లో మార్పు తీసుకొచ్చిన చిత్రం రంగస్థలం. పెద్ద హీరోలతో, పెద్ద బడ్జెట్ లో ఇలాంటి సినిమాలు కూడా తీయొచ్చు అని నిరూపించింది.

55
రాంచరణ్ పై గౌరవం పెరిగింది
Image Credit : X/@AnnapurnaStdios

రాంచరణ్ పై గౌరవం పెరిగింది

ఆ మూవీ తర్వాత మన హీరోలు క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. అప్పటికే రాంచరణ్ కి బాక్సాఫీస్ సక్సెస్ ఉంది. కానీ రంగస్థలం చిత్రంతో రాంచరణ్ పై నటుడిగా గౌరవం పెరిగింది అని అఖిల్ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Marriage: 13 ఏళ్ల సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పిన తాప్సీ..నా పార్ట్నర్ ని నేనే ఎంచుకున్నా
Recommended image2
ఐటీ ఉద్యోగాలను వదిలేసి సినిమాల్లోకి వచ్చిన స్టార్స్ వీళ్లే..!
Recommended image3
Mayookha Trailer: వెన్నులో వణుకు పుట్టిస్తున్న మయూఖ ట్రైలర్..బిగ్ బాస్ అమన్ కీలక పాత్రలో..
Related Stories
Recommended image1
Tollywood: చిరంజీవి, కృష్ణంరాజు, నాగార్జున కుటుంబాల బలమైన బ్యాగ్రౌండ్ తుస్సుమందా.. ఈ 5 ఎందుకు ఫ్లాప్ అంటే
Recommended image2
Devara: దేవర కలెక్షన్స్ నిజమా ఫేకా, దుబాయ్ లో సక్సెస్ పార్టీ ఎందుకు చేశారు ? అసలు గుట్టు బయటపడింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved