- Home
- Entertainment
- Jana Nayagan Day 3 Collection: మూడో రోజు మోత మోగించిన విజయ్ మూవీ, రూ.200 కోట్ల వైపు దూసుకెళ్తున్న 'జన నాయగన్'
Jana Nayagan Day 3 Collection: మూడో రోజు మోత మోగించిన విజయ్ మూవీ, రూ.200 కోట్ల వైపు దూసుకెళ్తున్న 'జన నాయగన్'
Jana Nayagan Collection:విజయ్ నటించిన 'జన నాయకన్' సినిమా శుక్రవారం కాస్త డల్ అయినా, మూడో రోజు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఈ యాక్షన్ డ్రామా వసూళ్లలో భారీ గ్రోత్ చూపించి, ఇప్పటికే రూ.90 కోట్లు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసిందంటే?
14

Image Credit : Instagram
మోగించిన విజయ్ సినిమా..
రెండో రోజు వసూళ్లలో కాస్త తగ్గుదల కనిపించినా, 'జన నాయగన్' మొదటి శనివారం మళ్లీ పుంజుకుంది. ఈ సినిమా మూడో రోజు ఇండియాలో సుమారు రూ.28.50 కోట్ల నెట్ వసూలు చేసింది. శుక్రవారం నాటి రూ.21.15 కోట్లతో పోలిస్తే ఇది 34.8% ఎక్కువ. వీకెండ్‌లో ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
24
Image Credit : Asianet News
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు..
మూడు రోజులు పూర్తయ్యేసరికి, 'జన నాయగన్' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.92.35 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇండియా గ్రాస్ కలెక్షన్ రూ.108.34 కోట్లుగా ఉంది. ఈ సినిమా వసూళ్లలో తమిళ వెర్షన్ ఆధిపత్యం కొనసాగిస్తుండగా, తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్లు కూడా నిలకడగా రాబడుతున్నాయి.
34
Image Credit : Instagram
ఓవర్సీస్ మార్కెట్లలోనూ జోరు..
ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లలోనూ అంతే బలంగా నిలబడింది. మూడో రోజు విదేశాల్లో సుమారు రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో ఓవర్సీస్ మొత్తం వసూళ్లు రూ.63.50 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ సుమారు రూ.171.84 కోట్లకు చేరుకుంది. దీంతో ఈ సినిమా రూ.200 కోట్ల మైలురాయికి అత్యంత చేరువలో ఉంది.
44
Image Credit : Asianet News
200 కోట్ల క్లబ్‍లో సీఎం గారి సినిమా..
ట్రేడ్ అనలిస్టులు ఇప్పుడు ఈ సినిమా మొదటి ఆదివారం ప్రదర్శనపై దృష్టి పెట్టారు. 'జన నాయకన్' ఇదే జోరు కొనసాగిస్తే, ఇండియాలో నెట్‌గా రూ.100 కోట్లు సులభంగా దాటుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల క్లబ్‍లో చేరడం ఖాయమని భావిస్తున్నారు.
Latest Videos

