MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • చిరంజీవితో జంటగా డ్యాన్స్ చేయాని కోరిక.. రెండు ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

చిరంజీవితో జంటగా డ్యాన్స్ చేయాని కోరిక.. రెండు ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా నటించమని రెండు ఆఫర్లు వస్తే.. లేదు ఆయనతో డ్యాన్స్ చేయాలి, జంటగా నటించాలని పెద్ద సినిమాల ఛాన్స్ లు వదిలేసుకుంది ఓ హీరోయిన్. చివరకి ఆమె కోరిక తీరిందా? లేదా? ఎవరా నటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 26 2026, 09:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవితో సినిమా అంటే పండగే..
Image Credit : Asianet News

చిరంజీవితో సినిమా అంటే పండగే..

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు తమ నటన, గ్లామర్‌తో ప్రేక్షకులను అలరించారు. అందులో చాలామంది మెగాస్టార్ చిరంజీవి జంటగా నటించారు. ఆయనతో సినిమాలు చేయని వారు కూడా చాలామంది ఉన్నారు. మెగాస్టార్ జంటగా నటించాలని కెరీర్ మొత్తం ఎదురుచూసిన హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారు. ఒక హీరోయిన్ అయితే.. ఆయన జంటగా నటించి, ఒక్క సాంగ్ లో అయినా చిరుతో కలిసి డ్యాన్స్ చేయాలని కలలు కన్నది. అందుకోసం ఆయన చెల్లెలుగా రెండు సినిమా ఆఫర్లు వచ్చినా.. నో చెప్పింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు ఇంద్రజ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మెగాస్టార్ తో నటించాలని కలలు కన్న హీరోయిన్..
Image Credit : youtube/@@SignatureStudiostv

మెగాస్టార్ తో నటించాలని కలలు కన్న హీరోయిన్..

90స్ లో తెలుగు ఆడియన్స్ ను అలరించిన హీరోయిన్లలో ఇంద్రజ ఒకరు. 'యమలీల' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ తార.. తనదైన సహజ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే ప్రతి ఒక్క నటికి తమ కెరీర్‌లో ఏదో ఒక కల ఉంటుంది. పాత్ర విషయంలో కానీ.. హీరోల విషయంలో కానీ.. ఇలా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అలానే ఇంద్రజకు కూడా మెగాస్టార్ చిరంజీవితో కలసి నటించాలనేది ఒక పెద్ద ఆశ. ఆయనతో కలిసి ఒక్క పాటకు అయినా డ్యాన్స్ చేయాలని కలలు కనేది.

Related Articles

Related image1
Indraja Remuneration: జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ సంచలనం.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?
Related image2
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
35
మెగాస్టార్‌తో డ్యాన్స్ చేయాలనే బలమైన ఆశ
Image Credit : Asianet News

మెగాస్టార్‌తో డ్యాన్స్ చేయాలనే బలమైన ఆశ

చిరంజీవితో సినిమా అంటే హీరోయిన్లు పోటీపడుతుంటారు. ఆయనతో సినిమా చేస్తే తమ కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అప్పట్లో హీరోయిన్లు భావించేవారు. ఆయన డాన్స్, ఆయన టైమింగ్, నటన, వ్యక్తిత్వానికి భారీగా అభిమానులు ఉండేవారు. చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించి, ఆయనతో కలిసి ఒక్క పాటకైనా డ్యాన్స్ వేయాలనేది ఇంద్రజకు ఉన్న అతిపెద్ద కల. ఈ ఆశతోనే ఆమె రెండు పెద్ద సినిమాల ఆఫర్లను వదులుకున్నారట. ఈ విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.

45
సిస్టర్ క్యారెక్టర్ కు నో చెప్పిన ఇంద్రజ
Image Credit : Asianet News

సిస్టర్ క్యారెక్టర్ కు నో చెప్పిన ఇంద్రజ

చిరంజీవితో హీరోయిన్ గా నటించాలని ఎదురుచూస్తోన్న ఇంద్రజకు అల్లుడా మజాకా సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం అడిగారట. కానీ ఆ సమయంలో చిరంజీవి జోడీగా నటించాలని, ఆయనతో స్టెప్పులేయాలని ఆమె మనసులో బలంగా ఉండటంతో చెల్లెలి పాత్ర చేస్తే భవిష్యత్తులో ఆయన పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశం రాదేమోనని భావించి ఆ ఆఫర్‌ను తిరస్కరించారట. ఆ తర్వాత ఆ పాత్రను నటి ఊహ చేశారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

55
రెండో అవకాశం ఎలా చేజారింది?
Image Credit : Actress Indraja\Instagram

రెండో అవకాశం ఎలా చేజారింది?

అలాగే ఎడిటర్ మోహన్ నిర్మాణంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ 'హిట్లర్' లోనూ ఒక చెల్లెలి పాత్ర ఆఫర్ ఇంద్రజ దగ్గరకొచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి పెద్ద చెల్లెలుగా, రాజేంద్ర ప్రసాద్ జంగా ఇంద్రజను అడిగారు. అయితే ఆ సమయంలో వేరే ప్రాజెక్ట్‌లతో (తమిళంలో రామ్‌కి తో సినిమా షూటింగ్) డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, చిరంజీవి కి చెల్లెలిగా చేయకూడదనే ఉద్దేశంతో ఆ ఛాన్స్ కూడా చేజారిపోయింది.

కోరిక తీరలేదు కానీ నేర్చుకున్నది చాలా ఉంది

చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరిక తీరనప్పటికీ, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఇంద్రజ చెప్పారు. చిరంజీవి గారు అందరితో మాట్లాడే విధానం, ఎంత కోపం ఉన్నా మాటల్లో జాగ్రత్త వహించే తీరు, అందరినీ పరామర్శించే గుణం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. చిరంజీవితో ఒక్క పాటకైనా డ్యాన్స్ చేయాలనే ఆశ ఇప్పటికీ తన మనసులో ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image2
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image3
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Related Stories
Recommended image1
Indraja Remuneration: జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ సంచలనం.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?
Recommended image2
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved