జగపతి బాబు నుంచి రానా వరకు బుల్లితెరపై హోస్టులుగా టాలీవుడ్ స్టార్ హీరోలు
వెండితెరపై స్టార్ హీరోలుగా వెలుగు వెలిగిన స్టార్ హీరోలు, ఏదో ఒక సందర్భంలో బుల్లితెరపై హోస్ట్ లుగా సందడి చేశారు. జగపతి బాబు నుంచి రానా వరకూ టాక్ షోలు సక్సెస్ ఫుల్ గా రన్ చేసిన స్టార్స్ ఎవరో తెలుసా?

జగపతిబాబు - జయమ్ము నిశ్చయమ్మురా
హీరోగా కెరీర్ ముగిసిన తరువాత సినిమాల్లో విలక్షణమైన పాత్రలతో గుర్తింపు పొందిన జగపతిబాబు, తాజాగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే షోతో హోస్ట్‌గా అరంగేట్రం చేశారు. మొదటి ఎపిసోడ్‌లో నాగార్జునను ఇంటర్వ్యూ చేసి ప్రేక్షకులపై మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. బాలయ్య తర్వాత మంచి హోస్ట్‌గా గుర్తింపు పొందుతున్న హీరోగా జగపతిబాబు నిలవడం విశేషం.
KNOW
నాగార్జున - బిగ్‌బాస్
నాగార్జున తొలిసారిగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోతో బుల్లితెరపై అడుగుపెట్టి, ఆ తర్వాత బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఇప్పటికే 6 సీజన్లు పూర్తి చేసి, త్వరలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కూడా హోస్ట్ చేయబోతున్నారు.
బాలకృష్ణ - అన్‌స్టాపబుల్
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో అతి తక్కువ సమయంలోనే నెంబర్ వన్ షోగా గుర్తింపు పొందింది. బాలయ్య అందించిన ఎంటర్టైన్‌మెంట్‌కు భారీ టీఆర్పీ రావడమే ఇందుకు నిదర్శనం. ఆహాలో బాలయ్య టాక్ షో కు భారీ స్పందన వచ్చింది.
చిరంజీవి - మీలో ఎవరు కోటీశ్వరుడు
మెగాస్టార్ చిరంజీవి కూడా హోస్ట్ గా సత్తా చాటారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సీజన్ 2కు హోస్ట్‌గా వ్యవహరించారు. తన చిలిపితనంతో, డైలాగ్ డెలివరీతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ - రెండు షోలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1కు హోస్ట్‌గా వ్యవహరించారు. ఫస్ట్ సీజన్ కు భారీగాస్పందన కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులు షోలోనూ మెరిశారు. తన చురుకుదనంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్.
నాని - బిగ్‌బాస్ సీజన్ 2
నేచురల్ స్టార్ నాని, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2కు హోస్ట్‌గా వ్యవహరించారు. హోస్ట్ గా తన బాధ్యతను తాను అద్భుతంగానిర్వహించినా.. ఈ షో ద్వారా ఎక్కువగా విమర్శలు మూటగట్టుకున్నారు నాని. ఆతరువాత హోస్టింగ్ జోలికి వెళ్లలేదు.
రానా దగ్గుబాటి - నెం 1 యారి
టాలీవుడ్ హీరో, విలక్షణ నటుడు, బాహుబలి ఫేమ్ రానా, ‘నెం.1 యారి’ షో ద్వారా బుల్లితెరపై మరింత పాపులర్ అయ్యారు. హోస్ట్‌గా రానా అద్భుతం చేశారు. సెలబ్రిటీలతో తన మార్క్ ప్రశ్నలతో షోను ప్రత్యేకంగా నిలిపారు. ఇలా చాలామంది స్టార్స్ హోస్ట్ లు గా బుల్లితెరపై అలరించారు.