400 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే
2025లో సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్త , 400 కోట్ల మార్కును దాటినవి 5 సినిమాలు ఉన్నాయి. ఇంతకీ ఆ ఐదు సినిమాలేంటి?

5. ధురంధర్ (హిందీ)
ప్రపంచవ్యాప్త కలెక్షన్: 436 కోట్లకు పైగా
డిసెంబర్ 5, 2025న విడుదలైన 'ధురంధర్' 9 రోజుల్లోనే 400 కోట్ల క్లబ్‌లో చేరింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ నటించారు.
4. కూలీ (తమిళం)
ప్రపంచవ్యాప్త కలెక్షన్: 518 కోట్లు
ఆగస్టు 14, 2025న విడుదలైన రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. 5 రోజుల్లో 400 కోట్ల క్లబ్‌లో చేరింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా లో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున విలన్ పాత్రలో నటించి మెప్పించారు. శ్రుతి హాసన్ కూడా ఈ సినిమాలో సందడి చేసింది.
3. సైయారా (హిందీ)
ప్రపంచవ్యాప్త కలెక్షన్: 570.33 కోట్లు
జూలై 18, 2025న విడుదలైన రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా 'సైయారా'. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 12 రోజుల్లో 400 కోట్ల క్లబ్‌లో చేరింది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించింది మూవీ. ఈసినిమా బడ్జెట్ 30 కోట్లుకూడా దాటలేదు.
2. ఛావా (హిందీ)
ప్రపంచవ్యాప్త కలెక్షన్: 807.91 కోట్లు
ఫిబ్రవరి 14, 2025న విడుదలైన హిస్టారికల్ యాక్షన్ డ్రామా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించారు. ఈమూవీ లో శంభాజీ రాజ్ గా విక్కీ నటన మెస్మరైజ్ చేసింది. రష్మిక యాక్టింగ్ కు అంతా ఫిదా అయ్యారు.
1. కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1 (కన్నడ)
ప్రపంచవ్యాప్త కలెక్షన్: 852.23 కోట్లు
కాంతార 1 సినిమా 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల క్లబ్‌లో చేరింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2, 2025న విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ 100 కోట్ల మార్క్ ను టచ్ అవ్వాలనుకున్న రిషబ్ ఆశ మాత్రం నెరవేలరలేదు. 800 కోట్ల దగ్గరే ఈసినిమా కలెక్షన్స్ ఆగిపోయాయి.

