- Home
- Entertainment
- పవన్ మూవీలో హీరోయిన్ కి అవమానం, ఆమె ముఖం చూసి కెమెరామెన్ చేసిన పని ఇదే.. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ తెలుసా
పవన్ మూవీలో హీరోయిన్ కి అవమానం, ఆమె ముఖం చూసి కెమెరామెన్ చేసిన పని ఇదే.. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ తెలుసా
అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ కి పవన్ కళ్యాణ్ మూవీలో అవమానం ఎదురైంది. కెమెరామెన్ చేసిన పని వల్ల స్టార్ హీరోయిన్ బాగా అప్సెట్ అయ్యారట.
- FB
- TW
- Linkdin
Follow Us

పవన్ కళ్యాణ్, భూమిక ఖుషి మూవీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో నటించిన చిత్రాలలో తొలిప్రేమ, ఖుషి, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాలు మెమొరబుల్ గా నిలిచిపోతాయి. ముఖ్యంగా ఖుషి మూవీ యువతని విపరీతంగా ఆకట్టుకున్న టాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో భూమిక హీరోయిన్ గా నటించింది. పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
గుడిలో సన్నివేశం చిత్రీకరణ
ఈ మూవీ షూటింగ్ సమయంలో భూమికకి ఊహించని అనుభవం ఎదురైందట. ఆ సంఘటన వల్ల చాలా అప్సెట్ అయ్యానని భూమిక ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గుడిలో దీపం ఆరిపోకుండా నేను, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం ఒకేసారి చేతులు పెట్టే సన్నివేశం షూటింగ్ జరుగుతోంది. ఆ సీన్ కోసం నేను లైట్ మేకప్ రెడీ అయ్యాను.
అందరి ముందు భూమికకు అవమానం
షాట్ కోసం రెడీ అయిన తర్వాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ గారు నన్ను చూశారు. నా మేకప్ చూసి అందరి ముందు అరిచేశారు. ఏంటి ఆ మేకప్, వెళ్లి మేకప్ తీసేసి ముఖం కడుక్కుని రా అని చెప్పారు. నేను వేసుకున్నది చాలా తక్కువ మేకప్ అని చెప్పినా వినలేదు. ఆయనే ఫేస్ వాష్ ఇచ్చి వెళ్లి క్లీన్ చేసుకుని రా అని చెప్పారు. నేను చాలా అప్సెట్ అయ్యాను.
అప్సెట్ అయిన భూమిక
సాధారణంగా నా చిత్రాల్లో నేను చాలా తక్కువ మేకప్ తో కనిపిస్తాను. అది కూడా ఆయనకు నచ్చలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో మేకప్ తొలగించి ఆ సీన్ లో నటించాను. కానీ సినిమా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పీసీ శ్రీరామ్ గారు నన్ను చాలా బాగా చూపించారు.
నేచురల్ అందంతో భూమిక
ఖుషి మూవీ లో 80 శాతం సన్నివేశాల్లో నాకు ఆశాలు మేకప్ ఉండదు. నేచురల్ లుక్ తోనే కనిపిస్తాను. కొన్ని సన్నివేశాల్లో మాత్రం తక్కువ మేకప్ ఉంటుంది అని భూమిక తెలిపింది. ఖుషి మూవీ రిలీజ్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.