అందుకే సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చా.. హీరోయిన్ ఆమని ఆసక్తికర కామెంట్స్..
Heroine Aamani: టాలీవుడ్ నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి.. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన విడాకులు, కంబ్యాక్ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఇలా..

విడాకులు, కంబ్యాక్ అంశాలపై కీలక వ్యాఖ్యలు..
టాలీవుడ్ నటి ఆమని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన విడాకులు, కంబ్యాంక్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే తన వైవాహిక జీవితానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. తనది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ కాదని, కేవలం ఒక కనెక్ట్ కావడం వల్ల ఇద్దరి మధ్య బంధం ఏర్పడిందని తెలిపింది. ఆ సమయంలో తన మంచితనం చూసి వివాహం చేసుకున్నానని పేర్కొంది.
అవన్నీ అవాస్తవం..
సినిమాల్లోకి కంబ్యాక్ ఇవ్వడం వెనుక అసలు కారణాన్ని నటి ఆమని పేర్కొంది. తన భర్త ఆర్ధిక ఇబ్బందులు కారణంగానే తాను మళ్లీ సినిమాల్లోకి వచ్చానన్నది పూర్తిగా అవాస్తవం అని ఆమె తెలిపింది. తనకు సినిమా అంటే ప్యాషన్ అని.. అవకాశం వచ్చింది కాబట్టే మళ్లీ సినిమాల్లోకి వచ్చానని చెప్పింది. బ్రేక్ తీసుకున్నది తానేనని.. మళ్లీ సినిమాల్లోకి వచ్చింది కూడా తానే అని స్పష్టం చేసింది.
విడిపోవడానికి కారణం ఇదే..
తన భర్తతో విడిపోవడానికి వెనుక పెద్ద కారణాలు ఏవి లేవని.. తమ మధ్య బంధం ఫ్రెండ్లీగా ముగిసిందని ఆమని పేర్కొంది. తన భర్త మంచి వ్యక్తి అని, తాను సినిమాల్లో బిజీగా ఉండగా, ఆయన తన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారని తెలిపింది. తాము ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామని స్పష్టం చేసింది.
సింగిల్ పేరెంట్‌గా..
తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని(బాబు10 సంవత్సరాలు, పాప 7 సంవత్సరాలు).. వాళ్లే తనకు ప్రపంచం అని చెప్పింది. తనకు మొదటి ప్రపంచం సినిమా అయితే.. రెండో ప్రపంచం తన పిల్లలని వివరించింది. సినిమా షూటింగ్స్ కోసం అవుట్ డోర్ వెళ్లాల్సి వచ్చినప్పుడు.. పిల్లలకు దూరంగా ఉండటం బాధ కలిగిస్తుందని చెప్పింది.
ఆలస్యంగా దక్కాయంది..
కెరీర్, వ్యక్తిగత జీవితంలో తనకు అన్నీ కూడా ఆలస్యంగా దక్కాయని ఆమని చెప్పింది. హీరోయిన్‌గా స్థిరపడటానికి ఒకటిన్నర సంవత్సరం కష్టపడ్డా అని తెలిపింది. మొదట ఒక పాప చలనుకున్నాను. కానీ దేవుడు ఇద్దరు పిల్లలను ఇచ్చారు అని వెల్లడించింది.

