- Home
- Entertainment
- Actress: 8 నెలల వయసులోనే ఎంట్రీ.. పేరు మార్చుకుని ఇండస్ట్రీని ఏలుతోంది.. ఈ హీరోయిన్ ఎవరంటే?
Actress: 8 నెలల వయసులోనే ఎంట్రీ.. పేరు మార్చుకుని ఇండస్ట్రీని ఏలుతోంది.. ఈ హీరోయిన్ ఎవరంటే?
Actress: ఎన్నో కలలు.. ఇంకెన్నో కోరికలతో పలువురు నటీనటులు సినీరంగంలోకి అడుగుపెడుతుంటారు. ఈ నటి కూడా అంతే.! అయితే కెరీర్ మొదట్లో తన పేరుతో వేరే నటి ఉందని.. నేమ్ మార్చుకుంది.. కట్ చేస్తే.. 11 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతోంది.

కెరీర్ మొదట్లో కష్టాలు..
కెరీర్ మొదట్లో యువ నటిగా తన స్థానాన్ని సుస్థిరంగా చేసుకునేందుకు కష్టపడింది.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. ఎవరి గురించి చెబుతున్నామోనని ఆలోచించకండి.! ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ. 2014లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి హిట్ కోసం వెతుకులాట, కష్టాలు ఎదుర్కుంది.. కట్ చేస్తే.. ఐదేళ్ళు.. అనగా 2019 నుంచి ఆమె కెరీర్ దశ తిరిగింది.
తన పేరును మార్చుకున్న కియారా అద్వానీ..
కియారా అద్వానీ అసలు పేరు వేరే ఉంది. అంతేకాదు ఆమె ఎనిమిది నెలల వయసులోనే తన తల్లితో కలిసి ఒక బేబీ ప్రొడక్ట్ యాడ్ లో నటించింది. తద్వారా గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టింది. ఇక కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ. ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే సమయానికి.. అప్పటికే నటి అలియా భట్ ఫేమస్ అయింది. పలు క్రేజీ ఆఫర్స్ అందుకుంది. దీంతో తన పేరును మార్చుకోవాలని నిర్ణయించింది కియారా.
ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పిన కియారా..
''అంజానా అంజాని' సినిమాలోని ప్రియాంక చోప్రా పాత్ర నన్ను బాగా ప్రేరేపించింది. ఆ సినిమాలో ప్రియాంక కియారా అనే యువతి పాత్ర పోషించింది. ఆ పేరు నాకు బాగా నచ్చింది. నా కూతురుకు పెట్టుకోవాలని అనుకున్నా. కానీ అంతకంటే ముందు నాకు కూడా ఓ స్క్రీన్ నేమ్ కావాలి. అందుకే ఆ పేరును నేను పెట్టుకున్నా' అని ఆమె నవ్వుతూ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది.
కెరీర్ మార్పు అప్పుడే..
పేరు మార్పు ఆమెకు ఓ మాయాజాలంలా పని చేసింది. కియారా అద్వానీగా అతితక్కువ కాలంలోనే ఆమెను అందరూ గుర్తించారు. కుర్రకారులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఎంఎస్ ధోని, భరత్ అనే నేను వంటి చిత్రాలు ఆమెకు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ తెచ్చిపెట్టాయి.
కబీర్ సింగ్ మూవీతో ఫేమస్
ఇక 2019లో విడుదలైన కబీర్ సింగ్ మూవీ.. కియారా అద్వానీకి మంచి పేరును తెచ్చిపెట్టడమే కాదు.. దేశవ్యాప్తంగా ప్రీతిగా ఫేమస్ చేసింది. ఆ తర్వాత కియారా తిరిగి చూసుకోలేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇటీవల హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడి.. ఓ పాపకు జన్మనిచ్చింది.