- Home
- Entertainment
- 2023లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇచ్చిన క్రేజీ డైరెక్టర్లు.. ప్రభాస్, చిరుతో సహా వీళ్లంతా జీవితంలో మరచిపోలేరు
2023లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇచ్చిన క్రేజీ డైరెక్టర్లు.. ప్రభాస్, చిరుతో సహా వీళ్లంతా జీవితంలో మరచిపోలేరు
టాలీవుడ్ లో ఈ ఏడాది దర్శకులు, హీరోలు, నిర్మాతలకు మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. కొన్ని మంచి చిత్రాలు ఆడియన్స్ ని అలరించగా.. కొన్ని చిత్రాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. అంతే కాదు నిరాశపరిచిన చిత్రాలతో ఆయా దర్శకులు విమర్శలు కూడా మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఆ దర్శకులు ఎవరు.. ఆ చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మెహర్ రమేష్- భోళా శంకర్: మెహర్ రమేష్ గత చిత్రాల ట్రాక్ రికార్డ్ దృష్ట్యా మెగా అభిమానులు ముందు నుంచి భోళా శంకర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ చిరంజీవి పై భారం వేసి ఎదురుచూశారు. మెగాస్టార్ ఇమేజ్ ఈ చిత్రాన్ని ఏమాత్రం కాపాడలేక పోయింది. ఈ మూవీ తర్వాత చిరు తన కథలని రీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భోళా శంకర్ ఎఫెక్ట్ తో తీవ్రంగా నష్టపోయింది మెహర్ రమేష్ అనే చెప్పాలి. ఆయన టేకింగ్ పై పూర్తిగా నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
సురేందర్ రెడ్డి- ఏజెంట్: ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఏజెంట్ చిత్రం గురించే. అక్కినేని అఖిల్ ఎన్నో ఆశలతో ఈ చిత్రం కోసం కష్టపడ్డాడు. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 10 శాతం వసూళ్లు కూడా సాధించలేక చతికిలబడింది. నిర్మాతకి తీరని నష్టాలు మిగిల్చింది. సురేందర్ రెడ్డి కెరీర్ లో ఎప్పటికి ఈ చిత్రం ఒక మచ్చ గానే గుర్తుంటుంది.
ఓం రౌత్-ఆదిపురుష్ :ఈ ఏడాది దారుణంగా ట్రోలింగ్ కి గురైన దర్శకుడు ఎవరంటే అది ఓం రౌత్ మాత్రమే. రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ తో ఆయన రూపొందించిన చిత్రం ఆదిపురుష్ పై ఎలాంటి విమర్శలు వచ్చాయో చెప్పనవసరం లేదు. ప్రభాస్ ఇమేజ్, రామాయణం సెంటిమెంట్ ఈ చిత్రాన్ని కొంతవరకు రక్షించాయి. హర్రర్ చిత్రాలని తలపించే గ్రాఫిక్స్ తో ప్రేక్షకులకు ఓం రౌత్ చిరాకు పుట్టించారు.
బోయపాటి శ్రీను- స్కంద : బోయపాటి ఎంచుకునే కథలపై, వయలెన్స్ ఎక్కువగా ఉండే ఆయన యాక్షన్ సన్నివేశాలపై ముందు నుంచి విమర్శలు ఉన్నాయి. కానీ ఏదో ఒక మ్యాజిక్ చేస్తూ బాలయ్యతో హిట్స్ కొడుతున్నారు. ఇతర హీరోలతో ఆయన మ్యాజిక్ వర్క్ కావడం లేదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో. ఈ ఏడాది బోయపాటి రామ్ కాంబోలో వచ్చిన స్కంద మూవీ ఊహించని ఫ్లాప్ గా నిలిచింది. కథల విషయంలో బోయపాటి ఇకపై జాగ్రత్తపడేలా ఈ చిత్రం సంకేతాలు ఇచ్చింది.
వంశీ- టైగర్ నాగేశ్వర రావు: గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ అనగానే ఈ చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. కానీ డైరెక్టర్ వంశి టేకింగ్, స్క్రీన్ ప్లే పూర్తిగా బెడిసికొట్టాయి. భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పూర్తిగా బోల్తా కొట్టింది.
శ్రీకాంత్ అడ్డాల-పెదకాపు1 : నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విక్రాంత్ కర్ణని హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం పెదకాపు. పొలిటికల్ అంశాలు ఉన్న చిత్రం కావడం.. టైటిల్ కూడా క్యాచీగా ఉండడంతో రిలీజ్ కి ముందే ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చింది. కానీ ఈ చిత్రం ఏమాత్రం ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేదు. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిద్దాం అనుకున్నారు. మొదటి భాగాన్ని పెదకాపు 1 అని రిలీజ్ చేశారు. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో సీక్వెల్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది.
వక్కంతం వంశీ-ఎక్స్ట్రా: హీరో నితిన్ తన సొంత ప్రొడక్షన్ లో ఎంతో ఇష్టపడి నటించిన చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో రీసెంట్ గా రిలీజైన ఈ చిత్రానికి షాక్ తప్పలేదు. ఫలితంగా దర్శకుడిగా వక్కంతం కి ఇది రెండో ఫ్లాప్. నా పేరు సూర్య తర్వాత దర్శకుడిగా తనని తాను నిరూపించుకోవాలని అనుకున్న వక్కంతం ఆశలు ఆవిరయ్యాయి.
గుణశేఖర్- శాకుంతలం: డైరెక్టర్ గుణశేఖర్ ఎప్పుడూ ప్రయోగాలు చేస్తుంటారు. మహా భారతంలోని శకుంతల కథని ఈ చిత్రంలో చూపించారు గుణశేఖర్. భారీ బడ్జెట్, సినిమా స్లోగా ఉండడం లాంటి కారణాలతో శాకుంతలం మూవీ ఊహించని నష్టాలని మిగిల్చింది. సమంత స్టార్ పవర్ కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయింది.
శ్రీవాస్- రామబాణం : హీరో గోపీచంద్ వరుస ఫ్లాపుల పరంపర కొనసాగించిన చిత్రం ఇది. లక్ష్యం లాంటి మూవీ ఇచ్చిన శ్రీవాస్ పరమ రొటీన్ కథతో ప్రేక్షకుల సహనానికి పరీక్షా పెట్టారు. ఫలితంగా గోపిచంద్ లిస్ట్ లో మరో ఫ్లాప్ మూవీ చేరింది.