MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డబ్బు కోసమే ఆ మూవీలో నటించా, ఆమెతో రొమాంటిక్ సీన్ తప్పు కాదు..ఆస్తుల వివరాలు బయటపెట్టిన అలీ రెజా

డబ్బు కోసమే ఆ మూవీలో నటించా, ఆమెతో రొమాంటిక్ సీన్ తప్పు కాదు..ఆస్తుల వివరాలు బయటపెట్టిన అలీ రెజా

టాలీవుడ్ లో యువ నటుడు అలీ రెజాకి క్రమంగా ఆఫర్స్ పెరుగుతున్నాయి. అలీ రెజా బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొంది మరింత పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ తర్వాత అలీ రెజాకి కీలక పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 13 2023, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ లో యువ నటుడు అలీ రెజాకి క్రమంగా ఆఫర్స్ పెరుగుతున్నాయి. అలీ రెజా బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొంది మరింత పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ తర్వాత అలీ రెజాకి కీలక పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అలీ రెజా ఆ తర్వాత బుల్లితెరపై సత్తా చాటాడు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Ali Reza

Ali Reza

అలీ రెజా ధృవ, వైల్డ్ గాడ్, రంగమార్తాండ చిత్రాల్లో నటించాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బ్రో మూవీలో కూడా అలీ రెజా మెరిశాడు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా అలీ రెజాకి బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. అలీ రెజా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ వధువు. నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ లో అలీ రెజా పోషించిన పాత్ర చాలా ఇంపార్టెంట్. 

 

37

ఇటీవల డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన వధువు  క్రేజీ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఒక కుటుంబంలో జరిగే మిస్టరీ అంశాలతో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్ లో కథ అలీ రెజా చుట్టూ తిరగడం విశేషం. 

 

47

వధువు రిలీజైన సందర్భంగా అలీ రెజా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. తాజాగా ఇంటర్వ్యూలో అలీ రెజా తన కెరీర్ గురించి అనేక విషయాలు వివరించాడు. నందు అన్నతో, అవికా గోర్ తో కలసి నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. నందు అన్నతో ఫ్రెండ్ షిప్ మరింతగా పెరిగినట్లు తెలిపాడు. ఆ మధ్యన వచ్చిన మెట్రో కథలు అనే చిత్రంలో నటించడం పై నన్ను చాలా మంది విమర్శించారు. సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేశారు. 

 

57

అలీ రెజా ఈ చిత్రంలో సీనియర్ నటి సనా బేగమ్ తో రొమాంటిక్ సీన్ లో నటించాడు. ఆ సన్నివేశాన్ని సోషల్ మీడియాలో తప్పుగా చూపిస్తూ నన్ను ట్రోల్ చేస్తున్నారు. అదేమీ తప్పు కాదు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నదే చూపించారు. నన్ను ట్రోల్ చేస్తే నా కెరీర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి విమర్శలని నేను పట్టించుకోను అని అలీ రెజా అన్నారు. సనా బేగమ్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాగుబోతు భర్త వల్ల మిడిల్ క్లాస్ వైఫ్ ఎలాంటి ఇబ్బందులు పడుతోంది అనే మెసేజ్ ఇవ్వడానికే ఆ సీన్ పెట్టారు అని తెలిపింది. అందులో ఎక్కడా అసభ్యంగా చూపించలేదని పేర్కొంది. 

 

67

కరోనా తర్వాత ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయి. సొంతంగా బిజినెస్ ఉండడం చాలా అవసరం అని గమనించా. మా నాన్నకి రెస్టారెంట్ ఉండడం మా ఫ్యామిలీకి బాగా ఉపయోగపడింది. అందుకే తాను కూడా ముంబైలో రెండు రెస్టారెంట్స్ ప్రారంభించినట్లు అలిరేజా తెలిపాడు. తండ్రి ఆస్తులతో పాటు అలీ రెజా కూడా బాగానే ఆస్తులు పోస్తున్నట్లు నెటిజన్లు అంటున్నారు. 

 

77

ప్రస్తుతం తాను వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ అనే చిత్రంలో నటిస్తున్నట్లు అలీ రెజా తెలిపాడు. వరుణ్ అన్న పెళ్లి గురించి విన్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అంతకు ముందే వరుణ్ అన్నతో వర్క్ చేశా. కానీ పెళ్లి గురించి ఎప్పుడూ చెప్పలేదు. పెళ్లి తర్వాత వరుణ్ అన్నని కలసి కంగ్రాట్స్ చెప్పినట్లు అలీ రెజా తెలిపాడు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
Recommended image2
Alia Bhatt Movies: అలియా భట్ కెరీర్ లో టాప్ 5 బిగ్గెస్ట్ హిట్స్ ఇవే.. మొదటిది మన తెలుగు సినిమానే
Recommended image3
Toxic Cast Fees: టాక్సిక్ స్టార్ల రెమ్యూనరేషన్స్, యశ్‌కు 50 కోట్లు.. మరి కియారా, నయన్ ఎంత తీసుకున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved