- Home
- Entertainment
- బాల నటులుగా కెరీర్ ప్రారంభించి టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కి చేరుకున్న ఇద్దరు హీరోలు, ఓ కమెడియన్.. ఎవరో తెలుసా
బాల నటులుగా కెరీర్ ప్రారంభించి టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కి చేరుకున్న ఇద్దరు హీరోలు, ఓ కమెడియన్.. ఎవరో తెలుసా
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్స్ గా కెరీర్ ప్రారంభించి టాలీవుడ్ లో అగ్ర స్థానానికి చేరుకున్న హీరోలు, కమెడియన్లు, హీరోయిన్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Tollywood
టాలీవుడ్ లో చాలా మంది నటులు బాల నటులుగా సత్తా చాటారు. చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ ప్రారంభించి టాలీవుడ్ లో అగ్ర స్థానానికి చేరుకున్న కొందరు హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు కూడా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి కమెడియన్ అలీ వరకు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ ప్రారంభించిన వాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రంగానికి చెందిన ఫ్యామిలీ నుంచి రావడం వల్ల బాల్యం లోనే నటించే అవకాశం దక్కింది. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి మహేష్ బాబు చిన్న తనంలో అనేక చిత్రాల్లో నటించారు. బాల్యంలోనే అదరగొట్టిన మహేష్ పెద్దయ్యాక రాజకుమారుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మహేష్ బాబు టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకరు.
జూ.ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. బాల్యంలో జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణం చిత్రంలో నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ అదరగొట్టాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ నిన్ను చూడాలని ఉంది చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. స్టూడెంట్ నంబర్ 1 తో తొలి విజయం దక్కించుకున్న తారక్ ఇప్పుడు టాలీవుడ్ లో తిరుగులేని స్టార్. పాన్ ఇండియా స్థాయిలో కూడా క్రేజ్ ఉంది.
తరుణ్
తరుణ్ ఇప్పుడు టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయ్యాడు కానీ ఒకప్పుడు యువతని తన చిత్రాలతో ఉర్రూతలూగించాడు. నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి యువతకి ఫేవరిట్ హీరో అయ్యాడు. తరుణ్ బాల్యంలో ఆదిత్య 369, తేజ, పిల్లలు దిద్దిన కాపురం లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.
కమెడియన్ అలీ
కమెడియన్ అలీ టాలీవుడ్ లో చాలా మంది నటుల కంటే సీనియర్ అనే చెప్పాలి. అలీ 1981 సీతా కొక చిలుక చిత్రం నుంచి బాల నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత విరామం లేకుండా అలీ ఇప్పటికీ కమెడియన్ గా రాణిస్తున్నాడు.
రాశి
హీరోయిన్ రాశి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. ఆదిత్య 369, మమతల కోవెల లాంటి చిత్రాల్లో బాల నటిగా నటించింది. ఆ తర్వాత శుభాకాంక్షలు చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది.
శ్రీదేవి
అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీదేవి బాల్యంలో చాలా చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ కి ఆమె మానవరాలిగా కూడా నటించి ఆ తర్వాత ఆయనకే వేటగాడు లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించడం విశేషం. హీరోయిన్ గా ఆమె టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో సైతం అగ్ర స్థానానికి చేరుకున్నారు.
తేజ సజ్జా
తేజ సజ్జా ప్రస్తుతం టాలీవుడ్ లో హ్యాపెనింగ్ హీరో. వరుస పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్నాడు. తేజ సజ్జా చిన్న తనంలో ఇంద్ర, బాలు, ఠాగూర్ చాలా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇప్పుడు హీరోగా మారి హను మాన్, మిరాయ్ లాంటి సూపర్ హిట్స్ కొడుతున్నాడు.