అనసూయ భరద్వాజ్ టాలీవుడ్ లో క్రేజీ నటిగా దూసుకుపోతున్నారు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత సినిమాల్లో నటించడం ప్రారంభించారు.
రంగస్థలం, పుష్ప, క్షణం, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి చిత్రాలు అనసూయకి నటిగా గుర్తింపు తీసుకువచ్చాయి. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర అనసూయకి క్రేజ్ పెంచింది.
అదే విధంగా అనసూయ కొన్ని చిన్న సినిమాల్లో కూడా నటించింది. ఇటీవల అనసూయకి కాస్త ఆఫర్స్ తగ్గాయి అనే చెప్పాలి. అనసూయ నిత్యం వార్తల్లో ఉండే సెలెబ్రిటీలలో ఒకరు.
తరచుగా వివాదాలు, బోల్డ్ కామెంట్స్ తో అనసూయ ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న అనసూయ కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ ఆఫర్స్ రిజెక్ట్ చేసిందట.
ఆర్య 2 చిత్రంలో తనకి అవకాశం వచ్చిందని, మరి కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది అని అనసూయ పేర్కొంది. కానీ ఆ టైంలో హీరోయిన్ నటించాలని అనుకోలేదని అనసూయ పేర్కొంది.
ఇండస్ట్రీలో పెళ్ళైన నటీమణులకు మంచి పాత్రలు ఇవ్వరు కదా అనే ప్రశ్నకి ఓ ఇంటర్వ్యూలో అనసూయ సమాధానం ఇచ్చింది. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది. పెళ్ళైన వాళ్లకు కూడా అవకాశాలు ఇస్తున్నారు.
సోగ్గాడే చిన్ని నాయనా చేసే సమయంలో నాకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా కంటే చిన్న అమ్మాయి లావణ్యకు నాగార్జున భార్యగా ఛాన్స్ ఇచ్చారు. నాకు యంగ్ క్యారెక్టర్ మరదలిగా అవకాశం ఇచ్చారు.
అనసూయ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అనసూయ గోల్డ్ బ్రౌన్ కలర్ లో ఉన్న శారీలో గ్లామరస్ గా మెరిసింది.