- Home
- Entertainment
- కృష్ణ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ హీరోయిన్, టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మహేష్ మేనకోడలు..ఈమె వస్తే వాళ్ళకి కష్టమే
కృష్ణ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ హీరోయిన్, టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మహేష్ మేనకోడలు..ఈమె వస్తే వాళ్ళకి కష్టమే
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మొట్టమొదటి హీరోయిన్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతోంది. మహేష్ బాబుకి మేనకోడలు అయిన ఆమె గురించి ఈ ఆసక్తికర వివరాలు తెలుసుకోండి.

మహేష్ బాబు మేనకోడలు హీరోయిన్ గా
సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మహేష్ బాబు మేనకోడలు జాన్వి ఘట్టమనేని సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతోంది. ఆమె పూర్తి పేరు జాన్వీ స్వరూప్ ఘట్టమనేని. సూపర్ స్టార్ కృష్ణ మానవరాలిగా ఆ కుటుంబం నుంచి హీరోయిన్ అవుతున్న తొలి వ్యక్తి జాన్వీ ఘట్టమనేని. సూపర్ స్టార్ కృష్ణ, మేనమామ మహేష్ బాబు.. తల్లిదండ్రులు మంజుల, స్వరూప్ ఇలా అందరూ చిత్ర పరిశ్రమకు చెందినవారే. ఆమె తల్లి మంజుల ఘట్టమనేని సుదీర్ఘకాలంగా కలగన్న స్వప్నాన్ని ఇప్పుడు జాన్వి వెండితెరపై సాకారం చేయబోతోంది. సినిమా కుటుంబానికి చెందిన ఈ యువతీ ప్రస్తుతం హీరోయిన్‌గా తన తొలి ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతోంది.
జాన్వీ ఘట్టమనేని త్వరలో టాలీవుడ్ ఎంట్రీ
సినీ వర్గాల సమాచారం ప్రకారం, జాన్వీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న కొత్త తరం నటీమణులలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించనుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇప్పటికే ఆమె అందం, వ్యక్తిత్వం, నైపుణ్యం గురించి చర్చలు మొదలయ్యాయి. కొందరు దర్శకులు, నిర్మాతలు ఆమెను “ఇటీవలి సంవత్సరాలలో తెరపై కనిపించబోయే అతి అందమైన యువతి”గా వర్ణిస్తున్నారు.
వైరల్ అవుతున్న ఫోటోస్
జాన్వీ ఘట్టమనేని తన లుక్స్, ఫిట్నెస్ , మోడ్రన్ అండ్ ట్రెడిషన్ మేళవించిన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సోషల్ మీడియా యుగంలో జాన్వీ ఘట్టమనేని ఇంతవరకు సోషల్ మీడియాలో పబ్లిసిటీ పొందలేదు. ఇప్పుడు ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు మాత్రమే బయటకు రావడంతో ప్రేక్షకుల్లో ఆమెపై ఆసక్తి పెరిగిపోయింది. ఆమె స్టైలిష్ లుక్స్, సహజమైన ఎలిగెన్స్ గురించి నెటిజన్లు చర్చిస్తున్నారు.
ఇండస్ట్రీలో అంచనాలు
అయితే ఈ ఆకర్షణ వెనుక కఠినమైన క్రమశిక్షణ దాగి ఉందని తెలుస్తోంది. జాన్వీ తన ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతోందట. అదే విధంగా మీ యాక్టింగ్, డ్యాన్స్ లో కూడా శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎంతో వినయంగా నేర్చుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా జాన్వీ ఘట్టమనేనిని ఇండస్ట్రీలో కొందరు అభివర్ణిస్తున్నారు. ఇండస్ట్రీలో పలువురు దర్శకులు ఆమెను “మాటలకంటే ముందే తన కళ్లతో భావాన్ని వ్యక్తం చేసే సహజ నటి”గా అభివర్ణిస్తున్నారు. ఆమె కళ్ళు అంత అందంగా ఉన్నాయని అంటున్నారు.
స్టార్ హీరోయిన్లకు టఫ్ కాంపిటీషన్
తల్లి మంజుల ఘట్టమనేని ఈ కొత్త ఆరంభంపై ఎంతో ఆనందంగా ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. తాను నటి, దర్శకురాలిగా ఉన్నప్పుడు సాధించిన అనుభవం, సినిమాపై ప్రేమను ఇప్పుడు తన కుమార్తె జాన్వీ కొనసాగిస్తోందని ఆమె గర్వంగా భావిస్తోంది. మంజుల తన కెరీర్‌లో అనేక ప్రయోగాలు చేసినప్పటికీ, తన కుమార్తె తరం వేదిక మరింత పెద్దదిగా ఉండబోతోందని సంతోషంగా తెలిపింది. జాన్వీ ఘట్టమనేని పుట్టిన రోజు సందర్భంగా తల్లి మంజుల సోషల్ మీడియాలో అందమైన పోస్ట్ చేసింది. 'నా లిటిల్ గర్ల్ జాన్వీ ఘట్టమనేని పెరిగి పెద్దది తన సొంత వెలుగులో ప్రయాణించేందుకు రెడీ అవుతోంది. తన భుజాలపై లెగసీని క్యారీ చేస్తోంది. త్వరలో తన ప్రతిభ, వెలుగుని ప్రపంచానికి చూపించబోతోంది. వెండి తెర, ఈ ప్రపంచం నీ కోసం ఎదురుచూస్తోంది మై డార్లింగ్. లవ్యూ సో మచ్, హ్యాపీ బర్త్ డే జాను' అంటూ మంజుల పోస్ట్ చేసింది. జాన్వీ ఘట్టమేని ఫోటోలపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె హీరోయిన్ అయ్యాక శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, మీనాక్షి చౌదరి లాంటి యంగ్ హీరోయిన్ లకు టఫ్ కాంపిటీషన్ ఇస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.