- Home
- Entertainment
- TV
- Bigg Boss Telugu 9: తనూజ విన్నర్ కాదు... ఎలిమినేషన్ తర్వాత భరణి షాకింగ్ కామెంట్స్
Bigg Boss Telugu 9: తనూజ విన్నర్ కాదు... ఎలిమినేషన్ తర్వాత భరణి షాకింగ్ కామెంట్స్
Bigg Boss Telugu 9: ప్రస్తుతం హౌస్ లో కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్, సంజన ఉన్నారు. కాగా, గతవారం ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. శనివారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వగా.. ఆదివారం భరణి ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss Telugu
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ చివరి వారానికి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఆదివారం ఎపిసోడ్ తో టాప్ 5 ఎవరో తేలిపోయింది. వచ్చే ఆదివారమే ఫినాలే జరగనుంది. ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్ తర్వాతి నుంచి విన్నర్ కి ఓటింగ్ పోల్ ఓపెన్ అయ్యింది. ప్రతి ఒక్కరూ తమ ఫేవరేట్ పర్సన్ విన్నర్ అవ్వాలని ఓటింగ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కళ్యాన్, తనూజ కి ఎక్కువగా ఓట్లు పోల్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం హౌస్ లో కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్, సంజన ఉన్నారు. కాగా, గతవారం ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. శనివారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వగా.. ఆదివారం భరణి ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన వారు కచ్చితంగా బజ్ ఇంటర్వ్యూ ఇవ్వాలనే విషయం తెలిసిందే.
మాట మార్చిన భరణి
భరణి కూడా ఎలిమినేట్ అయిన తర్వాత.. శివాజీ హోస్ట్ గా చేస్తున్న బజ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చాలా విషయాలు మాట్లాడిన భరణి... విన్నర్ విషయంలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిజానికి ఎలిమినేట్ అయిన వెంటనే.. నాగార్జున పక్కన నిలపడి.. తనూజ విన్నర్ అవ్వాలని.. కప్ తీసుకొని రావాలి అని చెప్పారు. కానీ బజ్ ఇంటర్వ్యూలో మాట మార్చారు.
విన్నర్ ఎవరంటే..?
‘ ఇప్పుడు హౌస్ లో ఉన్నవారిలో ఎవరు ఏ ప్లేసులో ఉంటారు?’ అని శివాజీ అడిగారు. దానికి సమాధానంగా... 5వ స్థానంలో సంజన, 4వ స్థానంలో డీమాన్ పవన్, మూడో స్థానంలో ఇమ్మాన్యుయల్ ఉన్నారు అని చెప్పారు. ఇక మొదటి స్థానం మొదట కళ్యాణ్ కి ఇచ్చాడు. తనూజ కూడా మొదటి స్థానంలో ఉండొచ్చని... వీరిద్దరూ ఫస్ట్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అని భరణి చెప్పాడు. అయితే.. వీళ్లద్దరిలో ఫస్ట్ ఎవరు? సెకండ్ ఎవరు?అని మళ్లీ శివాజీ అడిగాడు. దానికి ఏ మాత్రం తడపడకుండా.. తన ప్రకారం కళ్యాణ్ విన్నర్ అవుతాడని, తనూజ రన్నరప్ అవుతుందని భరణి క్లారిటీ ఇవ్వడం విశేషం.
హౌస్ లో ఉన్నంతకాలం... తనూజ... భరణి కి సపోర్ట్ గా నిలిచింది. భరణి ఎలిమినేట్ అయిన తర్వాత... ఆయన ఓట్లు అన్నీ తనూజకి పడతాయని.. ఆమె విన్నర్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ.. భరణి ఇలా మాట్లాడటం అందరినీ షాకింగ్ కి గురి చేస్తున్నాయి. విన్నర్ ఎవరో తెలియాలంటే.. మరో ఐదు రోజులు ఎదురు చూస్తే సరిపోతుంది. ఈసారి విన్నర్ కి ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి అనే విషయం కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

