MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన కమల్ హాసన్, మణిరత్నం డిజాస్టర్ మూవీ థగ్ లైఫ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే

నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన కమల్ హాసన్, మణిరత్నం డిజాస్టర్ మూవీ థగ్ లైఫ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే

లోక నాయకుడు స్టార్ కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో దాదాపు 38 ఏళ్ళ తర్వాత వచ్చిన చిత్రం ‘థగ్ లైఫ్’. గత నెల జూన్ 5న థియేటర్స్ లో ఈ చిత్రం రిలీజ్ అయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 03 2025, 02:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : X

లోక నాయకుడు స్టార్ కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో దాదాపు 38 ఏళ్ళ తర్వాత వచ్చిన చిత్రం ‘థగ్ లైఫ్’. గత నెల జూన్ 5న థియేటర్స్ లో ఈ చిత్రం రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం దారుణంగా డిజాస్టర్ అయింది. కమల్ హాసన్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మణిరత్నం అయితే దర్శకుడిగా ట్రోలింగ్ ఎదుర్కొన్నారు.

25
Image Credit : Twitter

థియేటర్స్ లో డిజాస్టర్ కావడంతో నెలరోజుల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలో తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలయింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related Articles

Related image1
'హరిహర వీరమల్లు' ట్రైలర్ రివ్యూ.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తో పోల్చిన నిర్మాత
Related image2
గేమ్ ఛేంజర్ లాంటి అనుభవం చిరంజీవికి కూడా తప్పలేదు..మెగాస్టార్ టైం, కష్టం మొత్తం వృథా చేసిన మూవీ ఏంటో తెలుసా
35
Image Credit : instagram

ఈ చిత్రానికి విడుదల ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్, ఏఆర్ రెహమాన్ సంగీతం, స్టార్ కాస్ట్ వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. కమల్ హాసన్ తో పాటు ఈ చిత్రంలో స్టార్ హీరో శింబు కూడా నటించారు. అయితే విడుదలైన తర్వాత నెగటివ్ రివ్యూలు, మిశ్రమ స్పందన కారణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.

థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనే ఆసక్తి నెలకొంది. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.

45
Image Credit : x/movie production

ఇక ఓటీటీలో విడుదల విషయంలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. కథనాల ప్రకారం, థియేటర్ నుండి ఓటీటీకి సినిమాని ప్రదర్శించాలి అంటే ట్రాన్సిషన్‌ నిబంధనలు ఉంటాయి. ఈ నిబంధనల ప్రకారం థియేటర్ రిలీజ్, ఓటిటి రిలీజ్ కి 8 వారాల గ్యాప్ మైంటైన్ చేయాలి. కానీ ఈ చిత్రం నాలుగు వారాలకే ఓటిటిలో రిలీజ్ కావడంతో నిర్మాతలు థియేటర్స్ కి 25 లక్షల పెనాల్టీ చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ కూడా ఈ చిత్ర డిజిటల్ హక్కుల కోసం రూ. 135 కోట్లకు ఒప్పందం కుదుర్చుకోగా, చివరికి ఈ డీల్ విలువ రూ. 110 కోట్ల వరకు తగ్గించబడినట్టు సమాచారం.

55
Image Credit : instagram

ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు త్రిష,  అభిరామి, జోజు జార్జ్, అశోక్ సెల్వన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్లకి పైగా బడ్జెట్ లో నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 90 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అనేది దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
అత్తగారి ఊరిలో అమ్మాయిల గురించి విజయ్ దేవరకొండ కామెంట్స్, స్కూల్ డేస్ లో రౌడీ హీరో ఏం చేశాడంటే?
Recommended image2
Dacoit Review: డెకాయిట్‌ మూవీ ఫస్ట్ రివ్యూ, స్టోరీ ఇదే.. అడవి శేష్‌ సినిమాలో అసలు మైనస్‌ ఏంటంటే?
Recommended image3
Peddi OTT Rights: రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న పెద్ది, రామ్ చరణ్ మూవీ ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే?
Related Stories
Recommended image1
'హరిహర వీరమల్లు' ట్రైలర్ రివ్యూ.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తో పోల్చిన నిర్మాత
Recommended image2
గేమ్ ఛేంజర్ లాంటి అనుభవం చిరంజీవికి కూడా తప్పలేదు..మెగాస్టార్ టైం, కష్టం మొత్తం వృథా చేసిన మూవీ ఏంటో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved