- Home
- Entertainment
- OTT Movies: ఈ వారం ఓటీటీ రిలీజ్లు ఇవే.. సంచలనం సృష్టించిన చిన్న సినిమా, తప్పక చూడాల్సిన థ్రిల్లర్స్ రెడీ
OTT Movies: ఈ వారం ఓటీటీ రిలీజ్లు ఇవే.. సంచలనం సృష్టించిన చిన్న సినిమా, తప్పక చూడాల్సిన థ్రిల్లర్స్ రెడీ
ఈవారం ఓటీటీలో సందడి చేసేందుకు కొన్ని థ్రిల్లర్ చిత్రాలు, సంచలనం సృష్టించిన రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. వాటి రిలీజ్ డేట్ లు, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

This Week OTT Releases
డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 21 2025 వరకు ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ 5, జియో హాట్ స్టార్ లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ వారంలో అంతర్జాతీయ సిరీస్ లు , క్రైమ్ థ్రిల్లర్స్, సైకాలజికల్ డ్రామాలు, రొమాంటిక్ కథలు వంటి విభిన్న జానర్స్ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమయ్యాయి. ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈటీవీ విన్ లో రిలీజయ్యేవి
రాజు వెడ్స్ రాంబాయి
చిన్న సినిమాగా విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి పెద్ద సంచలనం సృష్టించింది. విమర్శకులని, ప్రేక్షకులని ఈ చిత్రం విపరీతంగా ఆకట్టుకుంది. డిసెంబర్ 18న ఈ మూవీ ఈటీవీ విన్ లో ప్రీమియర్ కానుంది.
ఎక్కడ చూడాలి : ఈటీవీ విన్
రిలీజ్ డేట్ : డిసెంబర్ 18 2025
జీ 5 లో రిలీజయ్యేవి
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్
మలయాళ మిస్టరీ కామెడీ థ్రిల్లర్. మాజీ పోలీస్ అధికారి డొమినిక్ ఒక మహిళా పర్స్ కేసును విచారించగా హత్యలు, గల్లంతైన వ్యక్తుల రహస్యాలు వెలుగులోకి వస్తాయి.
ఎక్కడ చూడాలి : జీ 5
రిలీజ్ డేట్ : డిసెంబర్ 19 2025
గాడ్డే గాడ్డే ఛా 2
పంజాబీ గ్రామంలో మహిళలు పెళ్లి వేడుకలను తమ చేతుల్లోకి తీసుకోవడంతో పురుషుల మధ్య జరిగే హాస్యభరిత పోరాటమే ఈ కామెడీ డ్రామా.
ఎక్కడ చూడాలి : జీ 5
రిలీజ్ డేట్ : డిసెంబర్ 19 2025
హార్ట్లీ బ్యాటరీ
ప్రేమను శాస్త్రీయంగా కొలవాలని ప్రయత్నించే ఓ యువ శాస్త్రవేత్త జీవితంలో ప్రేమ అనూహ్యంగా ప్రవేశించే తమిళ రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్.
ఎక్కడ చూడాలి : జీ 5
రిలీజ్ డేట్ : డిసెంబర్ 16 2025
నయనం
పేదల కోసం ఉచిత కంటి ఆసుపత్రి నడుపుతున్న డాక్టర్ రహస్య ప్రయోగాలు చేయడం వల్ల ఏర్పడే సైకాలజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.
ఎక్కడ చూడాలి : జీ 5
రిలీజ్ డేట్ : డిసెంబర్ 19 2025
జియో హాట్ స్టార్ లో రిలీజయ్యేవి
మిసెస్ దేశ్‌పాండే
ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి పోలీసులు ఆమెనే సహాయం కోరాల్సిన పరిస్థితి. తల్లి కొడుకు మధ్య క్లిష్టమైన భావోద్వేగాలే కథ.
ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్
రిలీజ్ డేట్ : డిసెంబర్ 19 2025
ఫార్మా
ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో జరిగే అక్రమాలు, ప్రమాదకర మందుల వల్ల చనిపోతున్న రోగుల కథతో తెరకెక్కిన మలయాళ సోషల్ థ్రిల్లర్.
ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్
రిలీజ్ డేట్ : డిసెంబర్ 19 2025
నెట్ ఫ్లిక్స్ లో రిలీజయ్యేవి
ఏక్ దీవానే కి దీవానియత్
రాజకీయ నాయకుడి కుమారుడు, ఓ నటీమణి మధ్య విషపూరిత ప్రేమ కథతో రూపొందిన హిందీ రొమాన్స్ డ్రామా.
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్ : డిసెంబర్ 16 2025
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5
రోమ్ నుంచి తిరిగి పారిస్ వరకు ఎమిలీ ప్రయాణంలో వృత్తి, ప్రేమ, స్నేహాల మధ్య ఎదురయ్యే సంఘర్షణలు.
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్ : డిసెంబర్ 18 2025
ప్రేమంటే
కొత్త పెళ్లి తర్వాత భర్త నేరస్థుడు అన్న నిజం బయటపడటంతో దంపతుల జీవితంలో కలిగే మలుపులే ఈ తెలుగు క్రైమ్ రొమాంటిక్ థ్రిల్లర్.
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్ : డిసెంబర్ 19 2025
రాత్ అకేలీ హై ది బన్సాల్ మర్డర్స్
ఇన్స్పెక్టర్ జతిల్ యాదవ్ మరో సంచలన హత్య కేసును ఛేదించే క్రైమ్ థ్రిల్లర్.
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్ : డిసెంబర్ 19 2025
ప్రైమ్ వీడియో లో రిలీజయ్యేవి
ఫాల్ అవుట్ సీజన్ 2
న్యూక్లియర్ వినాశనం తర్వాత మోజావ్ ఎడారిలో జీవన పోరాటం, రాజకీయ కుట్రలతో సాగే అంతర్జాతీయ సూపర్ హిట్ సిరీస్.
ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో
రిలీజ్ డేట్ : డిసెంబర్ 17 2025
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4
నలుగురు స్నేహితుల జీవితాల్లో చివరి అధ్యాయంగా వచ్చిన భావోద్వేగ ఫైనల్ సీజన్.
ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో
రిలీజ్ డేట్ : డిసెంబర్ 19 2025
థామా
రష్మిక ప్రధాన పాత్రలో నటించిన థామా చిత్రం హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో రెంట్ కి అందుబాటులో ఉంది. 16 నుంచి రెంట్ లేకుండా అందుబాటులోకి వస్తుంది.
ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో
రిలీజ్ డేట్ : డిసెంబర్ 16 2025

