MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • NTR: బాబూ మన సినిమాకి థియేటర్లు బద్దలైపోతున్నాయ్, హీరోకి అనుచరులు చెప్పిన ఫస్ట్ షో టాక్..రియాలిటీ తుస్సు

NTR: బాబూ మన సినిమాకి థియేటర్లు బద్దలైపోతున్నాయ్, హీరోకి అనుచరులు చెప్పిన ఫస్ట్ షో టాక్..రియాలిటీ తుస్సు

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో భారీ అంచనాలతో విడుదలైన సినిమాలు చాలా ఉన్నాయి. చిరంజీవి, బాలయ్య లకు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన దర్శకుడితో తారక్ సినిమా చేశారు. ఆ మూవీ రిజల్ట్ గురించి నటుడు శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 15 2026, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jr NTR
Image Credit : Asianet News

Jr NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ బిగినింగ్ లో కొట్టిన మాస్ హిట్లు మరే ఇతర హీరోకి సాధ్యం కాలేదు అంటే అతిశయోక్తి కాదు. స్టూడెంట్ నెంబర్ 1, ఆది చిత్రాలు తారక్ కి క్రేజ్ తీసుకువచ్చాయి. ఆ తర్వాత వచ్చిన సింహాద్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క దెబ్బతో తారక్ టాలీవుడ్ టాప్ లీగ్ లోకి వెళ్లిపోయారు. టాలీవుడ్ అగ్ర హీరోలతో పోటీ పడే రేంజ్ సొంతం చేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బి గోపాల్ దర్శకత్వంలో నరసింహుడు
Image Credit : Asianet News

బి గోపాల్ దర్శకత్వంలో నరసింహుడు

సింహాద్రి రీ సౌండింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సింహాద్రి తర్వాత తారక్ కి వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. అప్పటి భారీ చిత్రాల దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో తారక్ నరసింహుడు అనే చిత్రంలో నటించారు. భారీ స్థాయిలో, కనీ వినీ ఎరుగని అంచనాలతో ఆ చిత్రం తెరకెక్కింది. బి గోపాల్ అంటే సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర లాంటి అద్భుతమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి.

35
రిలీజ్ రోజు టెన్షన్
Image Credit : aha

రిలీజ్ రోజు టెన్షన్

దీనితో నరసింహుడు మూవీపై కూడా ఆ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. నరసింహుడు మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ గురించి కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తారక్ తో సన్నిహితంగా ఉండే వారిలో శ్రీనివాస్ రెడ్డి ఒకరు. నరసింహుడు సినిమాపై ప్రతి ఒక్కరిలో భారీ అంచనాలు ఉండడంతో మేమంతా రిలీజ్ రోజు తారక్ ఇంట్లోనే ఉన్నాం.

45
బాబూ మాములుగా లేదు అంటూ ఒక రేంజ్ లో చెప్పారు
Image Credit : youtube/tag telugu

బాబూ మాములుగా లేదు అంటూ ఒక రేంజ్ లో చెప్పారు

ఫస్ట్ షో రిపోర్ట్ కోసం అందరం ఎదురు చూస్తున్నాం. నాకు ముందుగా ఖమ్మం నుంచి రిపోర్ట్ వచ్చింది. తారక్ గదిలోకి వెళ్ళా. ఈ విధంగా మన సినిమాకి బ్యాడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి అని చెప్పా. కాసేపటికి మరో ఆర్టిస్ట్ లోపలి వచ్చాడు. అతడి పేరు అనవసరం. అతడు వచ్చి.. బాబూ మన సినిమాకి థియేటర్లు బద్దలైపోతున్నాయ్.. మీరు విలన్ దగ్గరికి వెళ్లి పులిలాగా గాండ్రిస్తుంటే మామూలుగా లేదట అంటూ ఒక రేంజ్ లో చెప్పాడు.

55
రియాలిటీ వేరు, సినిమా ఫ్లాప్
Image Credit : youtube/suman tv

రియాలిటీ వేరు, సినిమా ఫ్లాప్

కానీ తారక్ కి రిజల్ట్ అర్థం కావడంతో అతడు చెప్పింది నమ్మలేదు. రియాలిటీ అది కాకపోవడంతో పగలబడి నవ్వేశాడు. సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పడితే ఆ సంఘటనతో తారక్ లో ఉన్న టెన్షన్ తొలిగిపోయింది అని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Related Stories
Recommended image1
Anasuya: వల్గర్ గా మాట్లాడితే ఊరుకోను, నా వెనుక ఆంజనేయస్వామి ఉన్నారు.. దుమారం రేపుతున్న అనసూయ
Recommended image2
Chiranjeevi: ఆ కమెడియన్ వల్ల చిరంజీవితో 4 సినిమాలు కోల్పోయా, త్రివిక్రమ్ కూడా పక్కన పెట్టారు.. నటి కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved