సుధీర్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రష్మీ... ఆ విషయంపై చర్చలు జరుగుతున్నాయట!
First Published Jan 13, 2021, 6:01 PM IST
రష్మీ-సుధీర్ బుల్లితెరపై ఎవర్ గ్రీన్ లవ్ పెయిర్. చాలా ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులు వీరి రొమాన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. జబర్ధస్త్ వేదికపై చిగురించిన వీరి ప్రేమ వ్యవహారం.... ఢీ వరకు పాకింది. ఇక కొన్ని ప్రత్యేక కార్యక్రమాలలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.

ప్రేమ పక్షలుగా ఇంతలా వీరు ఆన్ స్క్రీన్ పై రెచ్చిపోతుంటే... సుధీర్, రష్మీ మధ్య ఉన్న అసలైన బంధం ఏమిటనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్నలా ఉంది. సుధీర్-రష్మీ లవర్స్ నా, స్నేహితులా లేక జస్ట్ ప్రొఫెషనల్ పార్టనర్స్ నా అనేది ఎవరికీ తెలియదు.

ఈ విషయంపై తాజాగా ఇంటర్వ్యూలో రష్మీ స్పందించారు. సుధీర్ తో పెళ్లి విషయంపై ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. తన పర్సనల్ మోడల్ ప్రారంభించిన బొటిక్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన రష్మీని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?