MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • శ్యామ్‌ బెనెగల్‌ కి హైదరాబాద్‌ తో ఉన్న సంబంధం ఏంటి? లెజెండరీ దర్శకుడి గురించి ఎవరికీ తెలియని నిజాలు

శ్యామ్‌ బెనెగల్‌ కి హైదరాబాద్‌ తో ఉన్న సంబంధం ఏంటి? లెజెండరీ దర్శకుడి గురించి ఎవరికీ తెలియని నిజాలు

లెజెండరీ దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌కి, మన తెలుగుకి ఉన్న సంబంధం ఏంటి? ఆయన జీవితంలోని ఎవరికీ తెలియని నిజాలేంటి? అనేది చూద్దాం.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Dec 23 2024, 11:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శ్యామ్‌ బెనెగల్‌.. కమర్షియల్‌ సినిమా రాజ్యమేలుతున్న సమయంలో ఇండియన్‌ సినిమా రూపురేఖలు మార్చిన దర్శకుడు, సమాంతర సినిమాతో ఇండియన్‌ సినిమాని కొత్త పుంతలు తొక్కించిన మేటి దర్శకుడు.  తాను రూపొందించిన 24 సినిమాల్లో 14 సినిమాలకు జాతీయ అవార్డులు సాధించిన దర్శకుడు. భారతీయ సినిమాకి ఓ గౌరవాన్ని తీసుకొచిన లెజెండరీ దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌(90) నేడు (సోమవారం) కన్నుమూశారు. ముంబయిలోని వాకార్డ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఈ రోజు సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఆయన కూతురు అధికారికంగా వెల్లడించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Director Shyam Benegal passes away at 90

Director Shyam Benegal passes away at 90

కిడ్నీ సమస్యతో కన్నుమూత..

శ్యామ్‌ బెనెగల్‌ ఇటీవలే(డిసెంబర్‌ 14న) తన 90వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. సినిమా ప్రముఖలు, ఫ్రెండ్స్ తో ఈ వేడుక చేసుకున్నారు. ఇంతలోనే ఆయన యావత్ సినీ లోకాన్ని విషాదంలో ముంచెత్తారు. ఆయన చాలా రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారట. చాలా కాలంగా ఈ సమస్య వేధిస్తున్నా, ఇటీవల తీవ్రమైందని, దీని కారణంగానే ఆయన కన్నుమూసినట్టు ఆయన కూతురు పీటీఐతో తెలిపారు. 
 

36

జాతీయ అవార్డులతో శ్యామ్‌ బెనెగల్‌ సంచలనం..

శ్యామ్‌ బెనెగల్‌ బెంగాల్‌ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నా, ఆయన హిందీ, బెంగాలీ, మరాఠీలో ఆయన సినిమాలు చేశారు. ఫిల్మ్ మేకర్‌ గా ఆయనకు 18 జాతీయ అవార్డులు రావడం విశేషం. పలు ఫిల్మ్ ఫేర్‌ అవార్డులు, నంది అవార్డులు కూడా వరించాయి. శ్యామ్‌ బెనెగల్‌ సినిమాలే కాదు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, టీవీ సీరిస్‌లు కూడా రూపొందించారు. ఆయన సమాజంలోని సమస్యలను, సామాజిక అంశాలను, సమాజంలోని లోపాలను ఎత్తి చూపుతూ సినిమాలు రూపొందించారు. ప్రశంసలందుకున్నారు. సత్యజిత్‌ రే తర్వాత ఆ స్థాయి లెజెండరీ దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. 
 

46

శ్యామ్‌ బెనెగల్‌ మన తెలుగువారు కావడం విశేషం..

శ్యామ్‌ బెనెగల్‌ బెంగాలీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నా, ఆయన తెలుగు వారు కావడం విశేషం. ఆయన పుట్టింది హైదరాబాద్‌లోనే, అల్వాల్‌ ప్రాంతంలో ఉండేవారు. కొంకణి భాష మాట్లాడే చిత్రపుర్‌ సరస్వత బ్రహ్మిణ్‌ ఫ్యామిలీలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్యామ్‌ సుందర్‌ బెనెగల్‌. ఆయన తండ్రి కర్నాటక నుంచి హైదరాబాద్‌కి వలస వచ్చారు. నాన్న శ్రీదర్‌ బెనెగల్‌ ఫోటోగ్రాఫర్‌, ఆయన వద్ద ఉన్న కెమెరాతో చిన్నషార్ట్ ఫిల్మ్స్ తీయడంతో కెరీర్‌ని ప్రారంభించారు శ్యామ్ బెనెగల్‌. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకున్నారు. ఎంఏలో ఎకనామిక్స్ చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లారు. ఆయన హైదరాబాద్‌ ఫిల్‌ సోసైటీని కూడా ఎస్టాబ్లిష్‌ చేశారు. 
 

56

యాడ్స్ లో కాపీ రైటర్‌గా శ్యామ్‌ బెనెగల్‌..

ప్రారంభంలో ముంబయిలో అడ్వటైజర్‌ కంపెనీలో కాపీ రైటర్‌గా పనిచేశారు. క్రమంగా క్రియేటివ్ హెడ్‌గా మారారు. గుజరాతీలో తన మొదటి డాక్యుమెంటరీని రూపొందించారు. పేరు `ఘేర్‌ బెథా గంగా`. ఇది చేసిన పదేళ్లకి ఆయన సినిమాని రూపొందించారు. అంటే ఈ లోపు ఆయన ఇరవైకి పైగా డాక్యుమెంటరీలు రూపొందించారు. 1974లో `అంకుర్‌` అనే సినిమాని రూపొందించారు. అనంత్‌ నాగ్‌, షబానా అజ్మీ ఇందులో జంటగా నటించారు. ఈ మూవీ సంచలనాలు సృష్టించింది. తొలి చిత్రంతో యావత్‌ దేశాన్ని తనవైపు తిప్పుకున్నారు. తొలి చిత్రంతోనే జాతీయ అవార్డుని అందుకున్నారు. 
 

66

శ్యామ్‌ బెనెగల్‌ సినిమాలు..

ఇలా `చరణ్‌దాస్‌ ఛోర్‌`, `నిశాంత్‌`, `మంథన్‌`, `భూమిక`, `కొండురా`, `జునాన్‌`, `కల్యూగ్‌`, `ఆరోహణ్‌`, `మండి`, `త్రికాల్‌`, `సుస్మన్‌`, `అంతర్నాద్‌`, `సూర్‌ కా సత్వన్‌ గోడా`, `మమ్మో`, `సర్దారి బేగమ్‌`, `ది మేకింగ్‌ ఆఫ్‌ ది మహాత్మ`, `సమర్‌`, `హరిభారి`, `జుబేదా`, `నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌ః ది ఫర్‌గాటెన్‌ హీరో`, `వెల్‌కమ్‌ టూ సజ్జంపూర్‌`, `వెల్‌ డన్‌ అబ్బా` చిత్రాలు చేశారు. చివరగా గతేడాది `బుజిబ్‌ః ది మేకింగ్‌ ఆఫ్‌ నేషన్‌` అనే మూవీని రూపొందించారు. వీటిలో దాదాపు అన్నీ పారలల్‌ మూవీస్‌ కావడం విశేషం. అయితే ఈ చిత్రాలు కమర్షియల్‌గానూ సంచలనాలు సృష్టించడం మరో విశేషం. 

read more: ఎన్టీఆర్‌ మాకు ఏ సాయం చేయలేదు, అభిమాని కౌశిక్‌ తల్లి ఆవేదన.. తెరపైకి సంచలన పుకార్లు

also read: నిర్మాతలకు ఎగ్జిబిటర్లు షాక్‌, రేవంత్‌రెడ్డికి మద్దతు.. `పుష్ప 2` దెబ్బకి అంతా తలకిందులు ?
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved