MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ఏజ్ గ్యాప్ 40 ఏళ్ళు, మనవరాలిగా నటించిన అమ్మాయినే హీరోయిన్ గా..ఎన్టీఆర్ ని ఎలా ఒప్పించారో తెలుసా 

ఏజ్ గ్యాప్ 40 ఏళ్ళు, మనవరాలిగా నటించిన అమ్మాయినే హీరోయిన్ గా..ఎన్టీఆర్ ని ఎలా ఒప్పించారో తెలుసా 

టాలీవుడ్ లో వయసుతో సంబంధం లేకుండా కొన్ని కాంబినేషన్స్ సెట్ కావడమే కాదు.. బ్లాక్ బ్లస్టర్ పెయిర్ అనిపించుకున్నారు. వారిలో ఎన్టీఆర్,శ్రీదేవి జంట కూడా ఉంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 14 2024, 12:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిత్ర పరిశ్రమలో వయసు గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ నటీనటుల విషయంలో ఈ ప్రస్తావన ఉంటుంది. 70 ప్లస్ లో కూడా హీరోలుగా సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్న వాళ్ళు ఉన్నారు. హీరోయిన్లకు అంత ఏజ్ వరకు అవకాశం ఉండదు కానీ.. కొందరు నటీమణులు 40 ప్లస్ లో కూడా హీరోయిన్లుగా రాణిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

త్రిష, నయనతార లాంటి వాళ్లకైతే వయసు పెరిగేకొద్దీ డిమాండ్ పెరుగుతోంది. అయితే టాలీవుడ్ లో వయసుతో సంబంధం లేకుండా కొన్ని కాంబినేషన్స్ సెట్ కావడమే కాదు.. బ్లాక్ బ్లస్టర్ పెయిర్ అనిపించుకున్నారు. వారిలో ఎన్టీఆర్,శ్రీదేవి జంట కూడా ఉంది. ఎన్టీఆర్, శ్రీదేవి మధ్య వయసు వ్యత్యాసం 40 ఏళ్ళు ఉంది. ఎన్టీఆర్ కి శ్రీదేవి ఒక చిత్రంలో మనవరాలిగా నటించిన సంగతి తెలిసిందే. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు

 

36
Sridevi

Sridevi

1972లో ఎన్టీఆర్ గ్రాండ్ ఫాదర్ గా, శ్రీదేవి మనవరాలిగా బడిపంతులు అనే చిత్రంలో నటించారు. అప్పటికి శ్రీదేవి పదేళ్ల చిన్న పాప మాత్రమే. సరిగ్గా ఏడేళ్ల తర్వాత శ్రీదేవి.. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించి అదరగొట్టింది. ఆ చిత్రం వేటగాడు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాంగ్స్ అయితే మోత మోగించాయి. అప్పట్లో ఆ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 

Also Read: స్టార్ హీరోయిన్లు అవమానించారు, అందుకే రాజేంద్ర ప్రసాద్ ఆ నటిని పెళ్లి చేసుకోవాలనుకున్నారా ?

46
Sridevi

Sridevi

ఆకుచాటు పిందె తడిచే అనే రైన్ సాంగ్ అయితే మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించింది. అయితే ఈ చిత్రానికి ముందు.. మనవరాలిగా నటించిన అమ్మాయి హీరోయిన్ గా నటించడం ఏంటి అనే కామెంట్స్ వినిపించాయి. శ్రీదేవిని ఎన్టీఆర్ కి జోడిగా నటింపజేయాలని ఆలోచన మొదట వచ్చింది దర్శకుడు రాఘవేంద్ర రావుకే. 

56
NTR

NTR

అప్పటికి రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీదేవి పదహారేళ్ళ వయసు అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. దీనితో రాఘవేంద్ర రావు శ్రీదేవినే వేటగాడు చిత్రానికి కూడా హీరోయిన్ గా ఎంపిక చేయాలని అనుకున్నారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి స్వయంగా చెప్పారు. రాఘవేంద్ర రావు గారు నా దగ్గరికి వచ్చి.. శ్రీదేవి నీకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను అని అన్నారు. నువ్వు నేను మళ్ళీ కలసి వర్క్ చేయబోతున్నాం అని చెప్పారు. ఇది షాకింగ్ న్యూస్ ఎలా అవుతుంది.. చాలా మంచి విషయం కదా అని శ్రీదేవి అన్నారు. 

66

ఈసారి నువ్వు చాలా పెద్ద హీరోతో హీరోయిన్ గా చేయబోతున్నావు అని అన్నారు. ఎవరా హీరో అని అడిగితే.. ఎవరో కాదు ఎన్టీఆర్ గారు అని చెప్పారు. నేను నిజంగానే షాక్ అయ్యాను. ఏంటి సార్.. నేను ఆయనతో ఆల్రెడీ మనవరాలిగా నటించాను. ఇప్పుడు హీరోయిన్ గా ఎలా నటించమంటారు అని అడిగిందట. ఏమీ కాదు అదంతా నేను చూసుకుంటాను అని రాఘవేంద్ర రావు మాట ఇచ్చారట. ఎన్టీఆర్ కూడా శ్రీదేవి హీరోయిన్ గా వద్దు అన్నట్లు చెప్పారట. కానీ రాఘవేంద్ర రావు కాంబినేషన్ బాగా ఉంటుంది అని చెప్పి కన్విన్స్ చేశారట. ఆ విధంగా ఎన్టీఆర్, శ్రీదేవి వేటగాడు చిత్రంలో నటించి మెప్పించారు.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chandra Siddarth: ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద టైటిల్‌తో సినిమా.. `ఆ నలుగురు` డైరెక్టర్‌ సాహసం
Recommended image2
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Recommended image3
G2 Movie: రిలీజ్ డేట్ రాలేదు, అయినా గూఢచారి 2 ఫస్ట్ రివ్యూ ఇదిగో..స్పై థ్రిల్లర్స్ లో ఎపిక్ బ్లాక్ బస్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved