MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • స్టార్ హీరోయిన్లు అవమానించారు, అందుకే రాజేంద్ర ప్రసాద్ ఆ నటిని పెళ్లి చేసుకోవాలనుకున్నారా ?

స్టార్ హీరోయిన్లు అవమానించారు, అందుకే రాజేంద్ర ప్రసాద్ ఆ నటిని పెళ్లి చేసుకోవాలనుకున్నారా ?

టాలీవుడ్ కామెడీ హీరోగా వెలుగు వెలిగిన నటుడు రాజేంద్ర ప్రసాద్. టాలీవుడ్ లో కామెడీ చిత్రాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది రాజేంద్ర ప్రసాద్ అనే చెప్పొచ్చు.జేంద్ర ప్రసాద్ కి ఇండస్ట్రీలో క్రమశిక్షణ కలిగిన నటుడు అని గుర్తింపు ఉంది.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Sep 14 2024, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ కామెడీ హీరోగా వెలుగు వెలిగిన నటుడు రాజేంద్ర ప్రసాద్. టాలీవుడ్ లో కామెడీ చిత్రాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది రాజేంద్ర ప్రసాద్ అనే చెప్పొచ్చు. వేగంగా సినిమాలు చేస్తూ వరుస హిట్లు కొట్టారు. రాజేంద్ర ప్రసాద్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రాజేంద్ర ప్రసాద్ కి ఇండస్ట్రీలో క్రమశిక్షణ కలిగిన నటుడు అని గుర్తింపు ఉంది. అయితే రాజేంద్ర ప్రసాద్ గురించి కూడా అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి. రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో ఒక హీరోయిన్ పై మనసు పడ్డారని.. ఆమెని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని రూమర్స్ వచ్చాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు. 80, 90 దశకాల్లో రాణించిన రజిని. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు

36

నటి రజిని చాలా మంది స్టార్ హీరోలతో హీరోయిన్ గా నటించింది. రాజేంద్ర ప్రసాద్ తో ఆమె ఎక్కువ చిత్రాల్లో నటించింది. భలే మొగుడు, ఆహనా పెళ్ళంట, గుండమ్మగారి కృష్ణులు, చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళాం, చిక్కడు దొరకడు లాంటి చిత్రాల్లో వీళ్ళిద్దరూ జంటగా నటించారు. వేర్వేరు ఇంటర్వ్యూలలో రజిని, రాజేంద్ర ప్రసాద్ ఇద్దరూ తమ మధ్య వచ్చిన రూమర్స్ గురించి స్పందించారు. 

లెజెండ్రీ హీరో మూవీలోని సీన్లు పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టిన స్టార్ డైరెక్టర్..పెద్ద రచ్చ అయింది..

46

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. తాను రజినీని పెళ్లి చేసుకోబోతున్నట్లు అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చిన మాట వాస్తవమే. కానీ నాకు ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదు. మేమిద్దరం ఎక్కువ చిత్రాల్లో కలసి నటించాం. అందువల్లే అలాంటి రూమర్స్ వచ్చాయి. అయితే నాకు రజినీ పై ప్రత్యేకమైన అభిమానం మాత్రం ఉంది అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నాకు మనసులో వేరే ఉద్దేశం ఉంటే ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉండేవాడిని కాదు అని అన్నారు. 

56

రజిని కూడా దీనిపై స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ గారికి నా పై ప్రత్యేకమైన అభిమానం ఉంది. దానికి కారణం ఉంది అని రజిని అన్నారు. నేను హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. అందంగా కనిపిస్తాను. అది ఆయనకి ఇష్టం. అసలు నేను ఏం తింటాను, ఎలాంటి డైట్ తీసుకుంటాను అని ఆయన నన్ను ఫాలో అయ్యేవారు. 

66

అదే విధంగా అప్పట్లో కొంతమంది స్టార్ హీరోయిన్లు రాజేంద్ర ప్రసాద్ తో నటించం అని చెప్పేవారు. ఎందుకంటే ఆయన కామెడీ హీరో అని అవమానించేవారు. ఆ టైంలో నన్ను హీరోయిన్ గా నటించమని అడిగారు. అప్పుడు నేను నాకు చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేదు.. కథ నచ్చితే ఎవరితో అయినా నటిస్తా అని చెప్పా. అది రాజేంద్ర ప్రసాద్ కి బాగా నచ్చింది. అందువల్లే నేనంటే ఆయనకి అభిమానం అని రజిని తెలిపారు. తమ ఎఫైర్ గురించి వచ్చిన వార్తలు మాత్రం నిజం కాదు అని అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image2
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Recommended image3
Miss World 2026: మిస్ వరల్డ్‌గా జోహెయిర్రీ మోలా.. ఈమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved