- Home
- Entertainment
- Ram Charan: చరణ్‌కి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఇతనే, చిరంజీవి రిలాక్స్.. `పెద్ది` వాయిదాపై క్లారిటీ
Ram Charan: చరణ్‌కి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఇతనే, చిరంజీవి రిలాక్స్.. `పెద్ది` వాయిదాపై క్లారిటీ
రామ్ చరణ్ `పెద్ది` సినిమా షూటింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. ఆయనకు విజయవంతంగా ట్రీట్ మెంట్ జరిగిందట. అదే సమయంలో `పెద్ది` వాయిదా పడటం లేదని తెలుస్తోంది.

పెద్ది షూటింగ్‌లో రామ్ చరణ్‌కి గాయం
హీరో రామ్ చరణ్ గాయపడ్డ విషయం తెలిసిందే. `పెద్ది` సినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డారు. ఆయన ఎడమ కంటి వద్ద గాయమైంది. దీంతో అంతా ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ బాగానే ఉన్నారట. నేడు గురువారం నుంచి మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నారట. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. పెద్ది సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం గురించి టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇది చిన్న సంఘటనే అని, ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపింది.
రామ్ చరణ్ ఎడమ కంటికి గాయం
రామ్ చరణ్ ఇప్పుడు బాగానే ఉన్నాడని, ఆయన ఎడమ కన్నుకి చిన్నపాటి గాయమైందని, దీనికి సంబంధించిన చిన్న చికిత్స చేశామని, అది పూర్తయ్యిందని తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ముందు అనుకున్నట్టుగానే ఎలాంటి అంతరాయం లేకుండా ఈ రోజు షెడ్యూల్ జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు అభినందనలు తెలిపారు. ప్రతిదీ తమ కంట్రోల్‌లోనే ఉందని, సినిమా షూటింగ్ స్మూత్‌గా జరుగుతూనే ఉందని తెలిపింది. దీంతో మెగా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
రామ్ చరణ్‌కి ఆపరేషన్ చేసిన డాక్టర్‌ని రివీల్ చేసిన చిరంజీవి
అయితే రామ్ చరణ్‌కి గాయం కావడంతో మెగా ఫ్యామిలీ ఆందోళన చెందిందట. ఏం జరిగిందనేది చిరంజీవితో సహా అంతా వర్రీ అయ్యారట. కానీ ఇప్పుడు రిలాక్స్ అయినట్టు చెప్పారు మెగాస్టార్. రామ్ చరణ్‌కి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎవరో తెలిపారు. డాక్టర్ సుధాకర్ ప్రసాద్ ఈ చికిత్స చేశారట. తన టాలెంట్‌తో చాలా బాగా ట్రీట్‌మెంట్ చేశారని, అది తమకు ఆనందాన్ని కలిగించిందని చెప్పారు చిరంజీవి. `చరణ్ కను రెప్పకు మీరు సకాలంలో, నైపుణ్యంతో చేసిన శస్త్రచికిత్స మాకు నిజంగా ఒక వరం లాంటిది. మీ కచ్చితత్వం, శ్రద్ధ, నైపుణ్యంతో మా ఆందోళన పూర్తిగా తొలగిపోయింది. మీ పనితనమే అన్నింటికీ కారణం. అందుకు మేం నిజంగా కృతజ్ఞులం` అని తెలిపారు చిరంజీవి. ఆయన ఎక్స్‌లో ఈ పోస్ట్ పెట్టారు. ఆ డాక్టర్ ఫోటోని పంచుకున్నారు చిరంజీవి. డాక్టర్ సుధాకర్ ప్రసాద్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జన్ గా వర్క్ చేస్తున్నారు. అపోలో ఆసుపత్రి ఉపాసనకి చెందిన విషయం తెలిసిందే.
Dr. Sudhakar Prasad garu,
Your timely and skilful surgery on Charan’s eyelid has truly been a blessing. What was a moment of concern for us was eased entirely by your precision, care, and expertise.
Your craftsmanship made all the difference, and we are truly grateful.
Thank… pic.twitter.com/j53rRIpOKB— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2026
పెద్ది సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ
ఇక రామ్ చరణ్‌కి గాయం కారణంగా `పెద్ది` సినిమా షూటింగ్‌కి బ్రేకులు పడతాయని, చరణ్ వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ కానీ ఇప్పుడు టీమ్ చెప్పినదాని ప్రకారం షూటింగ్‌కి ఆలస్యం లేదు. అనుకున్న టైమ్‌కే చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారు. దీంతో ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన `పెద్ది` సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టమవుతుంది. అదే సమయంలో తాజాగా కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేసింది. రేపు అనగా శుక్రవారం పెద్ది గేమ్ స్టార్ట్ అంటూ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. శ్రీరామ నవమి సందర్బంగా ఈ చిత్రం నుంచి సర్ప్రైజ్ రాబోతుందని టీమ్ తెలిపింది. అదేంటో చూడాలి.

