MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `గ్లోబ్‌ ట్రోటర్` ఈవెంట్‌కి వీళ్లకు అనుమతి లేదు.. రాజమౌళి చెప్పిన కండీషన్స్ ఇవే

`గ్లోబ్‌ ట్రోటర్` ఈవెంట్‌కి వీళ్లకు అనుమతి లేదు.. రాజమౌళి చెప్పిన కండీషన్స్ ఇవే

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న `గ్లోబ్ ట్రోటర్‌` మూవీ ఈవెంట్‌ ఈ నెల 15న ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. ఈ ఈవెంట్‌కి సంబంధించిన రూల్స్, కండీషన్స్ ని రాజమౌళి తెలిపారు. 

2 Min read
Aithagoni Raju
Published : Nov 13 2025, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆర్‌ఎఫ్‌సీలో ఈ నెల 15న గ్లోబ్‌ ట్రోటర్‌ ఈవెంట్
Image Credit : SS Rajamouli/ X

ఆర్‌ఎఫ్‌సీలో ఈ నెల 15న గ్లోబ్‌ ట్రోటర్‌ ఈవెంట్

మహేష్‌ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న `గ్లోబ్‌ ట్రోటర్‌` ఈవెంట్‌కి మరో రెండు రోజులే ఉంది. ఈ శనివారం(నవంబర్‌ 15) సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఈవెంట్‌ని భారీగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్‌ని ప్రకటించబోతున్నారు. అదే సమయంలో టీజర్‌ని కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇందులో ఈ సినిమా కథని చెప్పబోతున్నారు, ఏ జోనర్‌లో మూవీ ఉంటుంది? ఏం చూపించబోతున్నామనేది రాజమౌళి వివరిస్తారు. ఆయన తన ప్రతి సినిమాకి ఇదే చేస్తుంటారు. అదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్‌ ప్లాన్‌, హాలీవుడ్‌ ప్రొడక్షన్స్ తో కలిసి పనిచేయడం, ఇందులో నటించే ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది.

24
అంచనాలు పెంచిన `గ్లోబ్‌ ట్రోటర్‌` ఫస్ట్ లుక్స్
Image Credit : Asianet News

అంచనాలు పెంచిన `గ్లోబ్‌ ట్రోటర్‌` ఫస్ట్ లుక్స్

`గ్లోబ్‌ ట్రోటర్‌` సినిమాకి ముందు నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌  `కుంభ` పాత్ర ఫస్ట్ లుక్‌ ఆ  అంచనాలను మరింత పెంచింది. మరోవైపు శృతి హాసన్‌ పాడిన `సంచారి` పాట సైతం మరింతగా ఆకట్టుకునేలా ఉంది. మహేష్‌ బాబు పాత్రని ప్రతిబింబించేలా ఈ పాట సాగింది. ఇంకోవైపు బుధవారం ప్రియాంక చోప్రా పాత్రని రివీల్‌ చేశారు. ఇందులో ఆమె మందాకిని అనే పాత్రలో నటించబోతుంది. ఆమె లుక్‌ కూడా అదిరిపోయేలా ఉంది. ఈ రోజుగానీ, రేపు(శుక్రవారం)గానీ మహేష్‌ బాబు ఫస్ట్ లుక్‌ ని విడుదల చేయబోతున్నారు రాజమౌళి. దానికోసం మహేష్‌ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

Related Articles

Related image1
`కాంత` మూవీ ఫస్ట్ రివ్యూ.. మాస్టర్‌ పీస్‌, దుల్కర్‌ సల్మాన్‌కి నేషనల్‌ అవార్డు పక్కా
Related image2
విజయ్‌ దేవరకొండ లైఫ్‌లో ఉండటం ఒక వరం.. రష్మిక మందన్నా ఎమోషనల్
34
గ్లోబ్‌ ట్రోటర్ ఈవెంట్‌కి రాజమౌళి కండీషన్స్
Image Credit : x/ssrajamouli

గ్లోబ్‌ ట్రోటర్ ఈవెంట్‌కి రాజమౌళి కండీషన్స్

ఇదిలా ఉంటే ఈ నెల 15న జరిగే ఈవెంట్‌కి సంబంధించిన రూల్స్ అండ్‌ రెగ్యూలేషన్స్ వెల్లడించారు రాజమౌళి. ఇటీవల దేశంలో పలు అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బాంబ్‌ బ్లాస్టింగ్స్, తొక్కిసలాట ఘటనలు కలవరపెడుతున్నాయి. దీంతో `గ్లోబ్‌ ట్రోటర్‌` ఈవెంట్‌కి కూడా పోలీసులు కొన్ని కండీషన్స్ పెట్టారట. ఆర్‌ఎఫ్‌సీలో జరిగే ఈవెంట్‌కి ఎలా వెళ్లాలనేది రాజమౌళి వివరించారు. ఆర్‌ఎఫ్‌సీ మెయిన్‌ గేట్‌ క్లోజ్‌ అవుతుందని, విజయవాడ నుంచి వచ్చే వారు ముందే లెఫ్ట్ తీసుకుని అనాజ్‌ పుర్‌ నుంచి రావాలని తెలిపారు. మరోవైపు సిటీ నుంచి వచ్చే వాళ్లు ఔటర్‌ రింగ్‌ రోడ్డ వద్ద రైట్‌కి వెళ్లి సంఘీ టెంపుల్‌ రూట్‌ నుంచి రావాలని తెలిపారు. ఈ మేరకు అక్కడ రూట్‌ సూచించే బోర్డ్ లు ఉంటాయని, వాటిని ఫాలో కావాలని తెలిపారు.

44
గ్లోబ్‌ ట్రోటర్‌ ఈవెంట్‌కి వీళ్లకి అనుమతి లేదు
Image Credit : x/ssrajamouli

గ్లోబ్‌ ట్రోటర్‌ ఈవెంట్‌కి వీళ్లకి అనుమతి లేదు

దీంతోపాటు ఈ ఈవెంట్‌ ఓపెన్‌ ఈవెంట్‌ కాదని, కేవలం పాస్‌లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలని తెలిపారు. ఫిజికల్‌గా పాస్‌ లు లేని వారికి అనుమతి లేదన్నారు. మరోవైపు 18 ఏళ్ల లోపు వారికి, సీనియర్‌ సిటిజన్స్ కి పోలీసులు అనుమతి ఇవ్వలేదని, వాళ్లు రావద్దని, ఇంట్లో జియో హాట్‌ స్టార్‌లో లైవ్‌లో చూసుకోవచ్చని తెలిపారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారని, కాబట్టి ఈ రూల్స్ ని ఫాలో కావాలని రాజమౌళి తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో వీడియోని విడుదల చేశారు. మొత్తంగా చాలా రూల్స్ తో ఈ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు.

Very excited to see you all at the #Globetrotter event on November 15.

The RFC main gate will be closed on the event day. Follow the instructions on your entry pass. Cooperate with police and security to ensure a hassle-free, safe, and happy experience for everyone. pic.twitter.com/bG3Hw5XmD8

— rajamouli ss (@ssrajamouli) November 13, 2025

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved