MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • విజయ్‌ దేవరకొండ లైఫ్‌లో ఉండటం ఒక వరం.. రష్మిక మందన్నా ఎమోషనల్

విజయ్‌ దేవరకొండ లైఫ్‌లో ఉండటం ఒక వరం.. రష్మిక మందన్నా ఎమోషనల్

ప్రతి ఒక్కరి లైఫ్‌లో విజయ్‌ దేవరకొండ లాంటి వ్యక్తి ఉండటం ఒక వరం అని రష్మిక మందన్నా అన్నారు. `ది గర్ల్ ఫ్రెండ్‌` సక్సెస్‌ ఈవెంట్‌లో ఆమె చేయికి విజయ్‌ కిస్‌ చేయడం హైలైట్‌గా నిలిచింది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 13 2025, 06:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రష్మిక ది గర్ల్ ఫ్రెండ్‌ సక్సెస్‌ ఈవెంట్‌లో విజయ్‌ హల్‌చల్‌
Image Credit : Asianet News

రష్మిక ది గర్ల్ ఫ్రెండ్‌ సక్సెస్‌ ఈవెంట్‌లో విజయ్‌ హల్‌చల్‌

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా తాజాగా `ది గర్ల్ ఫ్రెండ్‌` చిత్రంలో నటించింది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ధీరణ్‌ మొగిలినేని, దివ్య నిర్మించారు. దీక్షిత్‌ శెట్టి హీరోగా నటించారు. ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. రష్మిక మందన్నా నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ఇది. ఈ సినిమాకి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. అదే సమయంలో ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ దాటి లాభాల్లోకి వెళ్తోంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్‌ సెలబ్రేషన్‌ నిర్వహించారు. దీనికి విజయ్‌ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యారు. ఇందులో రష్మిక మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయ్‌ లాంటి వ్యక్తి మన జీవితంలో ఉండటం ఒక వరం
Image Credit : Asianet News

విజయ్‌ లాంటి వ్యక్తి మన జీవితంలో ఉండటం ఒక వరం

విజయ్‌ దేవరకొండ గురించి మాట్లాడుతూ, మనలైఫ్‌లో విజయ్‌ దేవరకొండ లాంటి వారు ఉండటం ఒక వరం అని తెలిపింది. ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్‌ లాంటి వారు ఉండాలని ఆమె చెప్పడం విశేషం. విజయ్‌ తనని మొదటి నుంచి ప్రోత్సహిస్తూనే ఉన్నాడని, ఈ సినిమా విజయంలోనూ భాగస్వామి అయ్యాడని, ఈ సినిమా మొత్తం జర్నీలో తన వెంటే ఉన్నాడని, అన్ని రకాలుగా అండగా నిలిచాడని తెలిపింది రష్మిక. అందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పింది.

35
`ది గర్ల్ ఫ్రెండ్‌` కోసం సోల్‌ పెట్టి నటించాను
Image Credit : Asianet News

`ది గర్ల్ ఫ్రెండ్‌` కోసం సోల్‌ పెట్టి నటించాను

ఆమె ఇంకా చెబుతూ, ఈ స్టోరీ విన్న వెంటనే తప్పకుండా చేయాలనిపించిందని, ఎందుకంటే భూమా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తనకూ ఎదురైనట్టు తెలిపింది రష్మిక. సాధారణంగా ఒక కథ, సీన్‌కి ఎంత ఎమోషన్స్ చూపించాలో, అంతే చూపిస్తాం. కానీ మొదటిసారి తన మనసులో , ఆత్మలో ఏముందో అదంతా చూపించినట్టు, ఇదొక బెస్ట్ మూవీ అని, ఇలాంటి కథను అందరు చూడాలని తీసుకొచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సినిమా ఎన్ని అవార్డులు వస్తాయో తెలియదు, కానీ ఆడియెన్స్ దీన్ని పక్కన పెట్టకుండా ఆదరిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇదే తనకు పెద్ద అవార్డుగా భావిస్తున్నానని తెలిపింది రష్మిక మందన్నా. మాట్లాడే క్రమంలో ఆమె ఎమోషనల్‌ అయ్యింది. 

45
ది గర్ల్ ఫ్రెండ్‌ చూసినప్పుడు ఆ విషయంలో బాధపడ్డా
Image Credit : Asianet News

ది గర్ల్ ఫ్రెండ్‌ చూసినప్పుడు ఆ విషయంలో బాధపడ్డా

ఇందులో గెస్ట్ గా పాల్గొన్న విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ, ఈ సినిమా చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఎవరి లైఫ్‌లో అయితే ఇలాంటివి జరుగుతున్నాయో, ఇలాంటివి ఫేస్‌ చేశారో, అది ఏ సందర్భంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఆ విషయంలో బాధగా ఉంది. మన పార్టనర్‌కి రక్షణగా ఉండాలని మనందరికి ఒక భావన ఉంటుంది. అది వాళ్లని కంట్రోల్‌ చేసేదిగా ఉండకూడదు. వాళ్ల కలలకు, సంతోషాలకు రక్షణగా ఉండాలి. ఇద్దరి జీవితంలో ఎన్ని మంచి మెమొరీస్‌ ఉన్నాయనేది ముఖ్యం. పుట్టడం, చనిపోవం మన ఛాయిస్‌ కాదు, కానీ ఏం చేయాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన ఛాయిసెస్‌ మన జీవితాన్ని మార్చేస్తాయి. లైఫ్‌ చాలా సింపుల్‌గా, సరదాగా ఉండాలి` అని తెలిపారు.

55
రష్మి నిజంగానే భూమాదేవినే
Image Credit : Asianet News

రష్మి నిజంగానే భూమాదేవినే

రష్మిక గురించి చెబుతూ, `రషిని `గీత గోవిందం` నుంచి చూస్తున్నా, ఆమె ఒక భూమాదేవినే. ఆమెలో తెలియని అమాయకత్వం ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇప్పుడు తనని తానుగా బలమైన స్క్రిప్ట్ లు ఎంచుకునే స్థాయికి వచ్చింది. రషి జర్నీ చూస్తుంటే గర్వంగా ఉంది. నన్ను ఎవరైనా ఏమైనా అంటే రివర్స్ లో వాళ్ల మీదకు వెళ్తాను. కానీ రష్మిక ఎవరెన్ని మాటలు అన్నా, వాటిని పట్టించుకోకుండా ఒక్కోమెట్టు ఎక్కుతూ ఎదుగుతూనే ఉంది. ఎంతో దయతో ఉంటుంది. ఈ విషయంలో రష్మిక నువ్వు నిజంగా చాలా అమేజింగ్‌` అని అన్నాడు విజయ్‌. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాతలు, టెక్నీషియన్లు, ఆర్టిస్ట్ లకు అభినందనలు తెలిపారు విజయ్‌. ముఖ్యంగా రోహిణి పాత్రకి ఫిదా అయినట్టు, చాలా ఎమోషనల్‌కి గురైనట్టు తెలిపారు. ఇక ఈ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ రష్మిక చేయికి కిస్‌ చేయడం హైలైట్‌గా నిలిచింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Recommended image2
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image3
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Related Stories
Recommended image1
గ్లోబ్‌ ట్రోటర్‌లో ప్రియాంక చోప్రా పాత్ర ఇదే.. పేరుతోనే ఆమె రోల్‌ ఎలా ఉంటుందో చెప్పిన రాజమౌళి
Recommended image2
ప్రభాస్‌కి ఇష్టమైన హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఈమె ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌.. అనుష్క, సాయి పల్లవి కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved