MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • రజినీకాంత్ కు షాక్‌ ఇచ్చిన ఇళయరాజా శపథం! సూపర్‌స్టార్‌ను మ్యూజిక్ మాస్ట్రో బెదిరించారా?

రజినీకాంత్ కు షాక్‌ ఇచ్చిన ఇళయరాజా శపథం! సూపర్‌స్టార్‌ను మ్యూజిక్ మాస్ట్రో బెదిరించారా?

రజినీకాంత్ తో ఓ సినిమా విషయంలో పట్టు పట్టి.. ఇళయరాజా శపథం చేశారు. అసవరమైతే సినిమాలు మానేస్తానన్నారు.  దీంతో షాకైన రజినీ, సినిమాను ఎలాగైనా ఆడించాలని ప్లాన్ చేశారు. కానీ, ఆ సినిమా దానంతట అదే భారీ విజయం సాధించింది.  ఇంతకీ విషయం ఏంటంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 26 2026, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
రజినీకాంత్, ఇళయరాజా మ్యాజిక్
Image Credit : Asianet News

రజినీకాంత్, ఇళయరాజా మ్యాజిక్

సినిమా ప్రపంచంలో సూపర్‌స్టార్ రజినీకాంత్, ఇళయరాజా కలిస్తే అదో మ్యాజిక్. కానీ, వాళ్ల కాంబోలో వచ్చిన ఓ మెగా హిట్ సినిమా వెనుక, రజినీకాంత్‌నే షాక్‌కు గురిచేసిన ఓ సంచలన సంఘటన జరిగింది. ఆ విషయం చాలా మందికి తెలియదు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
1989 లో జరిగిన సంఘటన..
Image Credit : Google

1989 లో జరిగిన సంఘటన..

అది 1989వ సంవత్సరం. 'రాజాధి రాజా' సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. కానీ హీరో రజినీకాంత్‌కు మాత్రం లోపల ఏదో తెలియని టెన్షన్. దానికి చాలా కారణాలున్నాయి. డైరెక్టర్ ఆర్. సుందర్‌రాజన్ చేతిలో సీన్ పేపర్ లేకుండానే స్పాట్‌కు వచ్చేవారు. నిర్మాత భాస్కర్ సినిమా గురించి కాకుండా ఏదేదో మాట్లాడేవారు. ఇక సినిమాకు కీలకమైన పంజు అరుణాచలం అసలు ఊళ్లోనే లేరు. 'సినిమా సరిగ్గా వస్తుందా? నా కెరీర్ ఏమవుతుంది?' అని రజినీ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు.

Related Articles

Related image1
4వ తరగతి చదివిన ఏఎన్నార్.. హీరోగా మారడానికి కారణం ఎవరో తెలుసా? అక్కినేని జీవితాన్ని మార్చింది ఎవరు?
Related image2
Dhurandhar 2 Collection: ధరందర్ 2 దెబ్బకు పుష్ప 2 ఔట్.. ఫస్ట్ వెన్స్‌డే కలెక్షన్లలో హిస్టరీ..
37
ఇళయరాజాతో రజినీకాంత్ ఏమన్నారంటే?
Image Credit : Asianet News

ఇళయరాజాతో రజినీకాంత్ ఏమన్నారంటే?

రజినీ తన ఆందోళనను ఇళయరాజాతో పంచుకున్నారు. అక్కడే ఆ సంచలన సంఘటన జరిగింది. రజినీ బాధను విన్న ఇళయరాజా, ఒక్కసారిగా ఓ సంచలన నిర్ణయం ప్రకటించారు. “రజినీ... ఈ సినిమా కథ నాకు తెలీదు, ఒక్క లైన్ కూడా నేను చదవలేదు. కానీ ఒక్క మాట చెప్తున్నా... ఈ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడకపోతే, నేను మళ్లీ నా హార్మోనియం ముట్టుకోను! పాటలు కూడా పాడను!” అని శపథం చేశారు.

47
భయపడిపోయిన రజినీకాంత్..
Image Credit : instagram

భయపడిపోయిన రజినీకాంత్..

ఇళయరాజా చేసిన ఈ 'డూ ఆర్ డై' శపథం విని రజినీకాంత్ నిర్ఘాంతపోయారు. ఒకవేళ సినిమా ఆడకపోతే, తన వల్ల ఓ గొప్ప కళాకారుడి సంగీత ప్రస్థానం ముగిసిపోతుందేమోనని ఆయన భయపడిపోయారు.
57
రహస్యంగా ప్లాన్ చేశారు..
Image Credit : Facebook

రహస్యంగా ప్లాన్ చేశారు..

ఇళయరాజా చెప్పారంటే అది చేసి తీరుతారని రజినీకి తెలుసు. ఆ టెన్షన్‌తో ఆయన ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తనకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి, 'ఒకవేళ సినిమా సరిగ్గా ఆడకపోయినా, డబ్బులు నేను ఇస్తాను... ఎలాగైనా సినిమాను ఆడించి సిల్వర్ జూబ్లీ అయ్యేలా చూడండి' అని రహస్యంగా ప్లాన్ చేశారు. ఇళయరాజా శపథం రజినీని ఆ రేంజ్‌లో వెంటాడింది.
67
థియేటర్లు దద్దరిల్లిపోయాయి...
Image Credit : Facebook

థియేటర్లు దద్దరిల్లిపోయాయి...

రజినీకాంత్ భయపడినట్లు ఎలాంటి 'మ్యానేజ్' చేయాల్సిన అవసరం రాలేదు. సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇళయరాజా సంగీతం, రజినీ స్టైల్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.
77
రజినీకాంత్ షాక్ అయ్యారు..
Image Credit : Facebook

రజినీకాంత్ షాక్ అయ్యారు..

ఇళయరాజా ఏది చెప్పారో, అక్షరాలా అదే జరిగింది! 'రాజాధి రాజా' థియేటర్లలో 175 రోజులు పూర్తిచేసుకుని సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. 'ఆయన ఊరికే అనలేదు, ఏదో ఒక శక్తి ఆయనతో ఆ మాట అనిపించింది' అని రజినీకాంత్ ఇప్పటికీ ఆశ్చర్యంగా చెబుతుంటారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Recommended image2
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image3
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Related Stories
Recommended image1
4వ తరగతి చదివిన ఏఎన్నార్.. హీరోగా మారడానికి కారణం ఎవరో తెలుసా? అక్కినేని జీవితాన్ని మార్చింది ఎవరు?
Recommended image2
Dhurandhar 2 Collection: ధరందర్ 2 దెబ్బకు పుష్ప 2 ఔట్.. ఫస్ట్ వెన్స్‌డే కలెక్షన్లలో హిస్టరీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved