- Home
- Entertainment
- ఏఎన్నార్ కి నచ్చిన కథ మెగా హీరో చేతుల్లోకి.. తెలివిగా రిజెక్ట్ చేయడం వల్ల అద్భుతం జరిగింది తెలుసా ?
ఏఎన్నార్ కి నచ్చిన కథ మెగా హీరో చేతుల్లోకి.. తెలివిగా రిజెక్ట్ చేయడం వల్ల అద్భుతం జరిగింది తెలుసా ?
టాలీవుడ్ లో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతుల్లోకి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏఎన్నార్ కి నచ్చిన కథ ఒకటి మెగా హీరో చేతుల్లోకి వెళ్లిందట.

అక్కినేని ఫ్యామిలీ
తెలుగు చిత్ర పరిశ్రమ లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన నటనతో వెండితెరపై ఎన్నో అద్భుతాలు సృష్టించారు. మరణించే వరకు కూడా ఆయన సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఏఎన్నార్ తర్వాత ఆయన లెగసీని నాగార్జున నాగచైతన్య, అఖిల్ కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ లో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతుల్లోకి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఏఎన్నార్ కి నచ్చిన కథని రిజెక్ట్ చేసిన నాగార్జున
ఏఎన్నార్ కి నచ్చిన కథ ఒకటి మెగా హీరో చేతుల్లోకి వెళ్లిందట. నాగార్జున తన తండ్రి ఏఎన్నార్ తో కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఒక చిత్రంలో కలిసి నటించాలని ఏఎన్నార్, నాగార్జున ప్లాన్ చేశారు. అక్కినేని ఫ్యామిలీ సినిమా కోసం కథలు వింటున్న క్రమంలో డైరెక్టర్ కృష్ణవంశీ ఏఎన్నార్ కి ఒక కథ చెప్పారట.
ఆ కథ ఎమోషనల్ గా బాగుందని ఏఎన్నార్ ఏఎన్నార్ కు అనిపించింది. ఆయనకి కృష్ణవంశీ చెప్పిన కథ నచ్చింది. నాగార్జున కూడా ఆ కథను విన్నారు. నాగార్జున కి కూడా స్టోరీ నచ్చింది. కానీ నాగార్జునకి ఈ కథపై మనసులో ఏదో మూల అనుమానం వస్తోంది. అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించే చిత్రం రెగ్యులర్ ఎమోషనల్ డ్రామాగా ఉండకూడదు అనేది నాగార్జున ఆలోచన. కథలో ఏదో ఒక వైవిధ్యమైన అంశం ఉండాలని నాగార్జున అన్నారు.
విక్రమ్ కుమార్ కి గ్రీన్ సిగ్నల్
అందుకే నాగార్జున తెలివిగా కృష్ణవంశీ చెప్పిన కథని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత డైరెక్టర్ విక్రమ్ కుమార్ చెప్పిన పునర్జన్మల నేపథ్యంలోని కథ నాగార్జునకి చాలా బాగా నచ్చింది. ఈ కథ అయితే ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుందని నాగార్జున భావించారు. విక్రమ్ కుమార్ చెప్పిన ఆ కథే మనం చిత్రంగా తెరకెక్కి సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో నాగార్జున, ఏఎన్నార్, నాగచైతన్య వైవిద్యమైన పాత్రలో నటించారు.
నాగార్జున రిజెక్ట్ చేసిన కథ రామ్ చరణ్ చేతుల్లోకి
ఇంతకీ నాగార్జున రిజెక్ట్ చేసిన చిత్రం మరేదో కాదు.. గోవిందుడు అందరివాడేలే. నాగార్జున ఈ కథని రిజెక్ట్ చేయడంతో కృష్ణవంశీ రామ్ చరణ్ తో ఆ మూవీ చేశారు. ఈ చిత్రంలో కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ పాత్రని ఏఎన్నార్ కోసం, శ్రీకాంత్ పాత్రని నాగార్జున కోసం, రామ్ చరణ్ పాత్రని నాగచైతన్య కోసం రాసుకున్నారు. తెలివిగా నాగార్జున ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయడమే మంచిదయింది అని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు. ఒకవేళ ఈ చిత్రాన్ని నాగార్జున ఓకే చేసి ఉంటే మనం లాంటి అద్భుతం అక్కినేని ఫ్యామిలీకి మిస్ అయ్యేది.
ఏఎన్నార్ చివరి మూవీ
మనం చిత్రమే ఏఎన్నార్ నటించిన చివరి మూవీ. ఈ మూవీ రిలీజ్ కాకముందే ఆయన మరణించారు. ఈ చిత్రంలో నాగార్జున, శ్రీయ నా కొడుకుగా ఏఎన్నార్.. నాగచైతన్య, సమంత కొడుకుగా నాగార్జున నటించారు. వివిధ టైమ్ పీరియడ్స్ లో జరిగే ఈ కథకి విక్రమ్ కుమార్ అద్భుతమైన ఎమోషన్స్ జోడించి మ్యాజిక్ చేశారు.