MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • గద్దర్ అవార్డులు కాదు, దిల్ రాజు ఫ్యామిలీ అవార్డులు అంటూ కామెంట్స్.. స్టార్ ప్రొడ్యూసర్ రియాక్షన్

గద్దర్ అవార్డులు కాదు, దిల్ రాజు ఫ్యామిలీ అవార్డులు అంటూ కామెంట్స్.. స్టార్ ప్రొడ్యూసర్ రియాక్షన్

గద్దర్ అవార్డుల నిర్వహణపై, దిల్ రాజు పై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి గద్దర్ అవార్డులు కాదు దిల్ రాజు ఫ్యామిలీ అవార్డులు అని విమర్శలు రావడంతో దిల్ రాజు స్పందించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 24 2025, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తమ్ముడు మూవీ
Image Credit : Youtube

తమ్ముడు మూవీ

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. నితిన్ హీరోగా వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో దిల్ రాజు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దిల్ రాజు నిర్మాతగా బిజీగా ఉంటూనే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గద్దర్ అవార్డులు కాదు దిల్ రాజు ఫ్యామిలీ అవార్డులు
Image Credit : our own

గద్దర్ అవార్డులు కాదు దిల్ రాజు ఫ్యామిలీ అవార్డులు

ఆయన ఆధ్వర్యంలోనే ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమ గద్దర్ అవార్డుల వేడుక జరిగింది. అయితే గద్దర్ అవార్డుల నిర్వహణపై, దిల్ రాజు పై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి గద్దర్ అవార్డులు కాదు దిల్ రాజు ఫ్యామిలీ అవార్డులు అని కామెంట్స్ చేస్తున్నారంటూ ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించారు. దిల్ రాజు తాను నిర్మించిన చిత్రాలు, డిస్ట్రిబ్యూట్ చేసిన చిత్రాలు, తన సన్నిహితులు రూపొందించిన చిత్రాలకు మాత్రమే గద్దర్ అవార్డులు ఇచ్చుకున్నారు అంటూ టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

Related Articles

Related image1
ఇండియాలోనే రిచెస్ట్ యాంకర్, 195 కోట్ల రెమ్యునరేషన్ తో సంచలనం.. ప్రభాస్, బన్నీ కూడా అతడి ముందు దిగదుడుపే
Related image2
మంచు విష్ణుకి షాకిచ్చిన కుమార్తెలు.. నోస్ జాబ్ చేయించుకోమని చురకలు, ఎందుకంటే
35
వాళ్ళకి అవార్డులు ఎలా వచ్చాయి ?
Image Credit : our own

వాళ్ళకి అవార్డులు ఎలా వచ్చాయి ?

దీని గురించి యాంకర్ ప్రశ్నించినప్పుడు దిల్ రాజు స్పందించారు. ఒక అవార్డుల వేడుక జరిగినప్పుడు ఇలాంటి విమర్శలు రావడం సహజం. వస్తున్న విమర్శలే నిజమైతే మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రాలకు అవార్డులు ఇవ్వలేదా? వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రాలకు అవార్డులు ఇవ్వలేదా? నా సన్నిహితులకు మాత్రమే అవార్డులు ఇచ్చుకుంటే వీళ్ళందరికీ ఎలా అవార్డులు వచ్చాయి అని దిల్ రాజు ప్రశ్నించారు.

45
దసరా చిత్రాన్ని తెలివిగా తప్పించారా ?
Image Credit : Youtube

దసరా చిత్రాన్ని తెలివిగా తప్పించారా ?

అవార్డుల విషయంలో కొందరికి అన్యాయం జరిగింది. నాని దసరా చిత్రానికి ఎలాంటి అవార్డు దక్కకుండా తెలివిగా తప్పించారు అని విమర్శపై కూడా దిల్ రాజు స్పందించారు. దసరా చిత్ర హీరో నాని నాకు బాగా క్లోజ్.. ఆ చిత్ర డైరెక్టర్ నిర్మాతతో కూడా నాకు మంచి రిలేషన్ ఉంది. అలాంటప్పుడు నేనెందుకు ఆ చిత్రాన్ని తప్పిస్తాను. జ్యూరీ మెంబర్స్ ఒక కట్ ఆఫ్ టైం పెట్టుకుని ఈ అవార్డులను ఎంపిక చేశారు. ఆ క్రమంలోనే దసరా చిత్రానికి అవార్డు రాలేదు.

గద్దర్ అవార్డుల ఎంపిక విషయంలో కంప్లీట్ డెసిషన్ జ్యూరీ మెంబర్స్ దే అని దిల్ రాజు తెలిపారు. నేను కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ గద్దర్ అవార్డుల విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదు. మేము ఇచ్చిన లిస్ట్ నే ఆయన అప్రూవ్ చేశారు అని దిల్ రాజు తెలిపారు.

55
తమ్ముడు మూవీ ఫ్యామిలీ స్టోరీ కాదు
Image Credit : Asianet News

తమ్ముడు మూవీ ఫ్యామిలీ స్టోరీ కాదు

ఇక గద్దర్ అవార్డుల వేడుకకి చాలామందిని దిల్ రాజు ఇన్వైట్ చేయలేదు అనే విమర్శ కూడా ఉంది. దీనిపై దిల్ రాజు స్పందిస్తూ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నా బాధ్యతలు పైపైన మాత్రమే ఉంటాయి. కార్యనిర్వహణ మొత్తం ఎండి, ఈడి స్థాయిలలో జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన గెస్ట్ ల లిస్ట్ ని నేను అప్రూవ్ చేశాను. కాకపోతే ఇన్విటేషన్ అందడంలో కాస్త ఆలస్యం అయింది. కానీ మెజారిటీ ప్రముఖులు అందరిని ఇన్వైట్ చేసినట్లు దిల్ రాజు తెలిపారు.

ఇక దిల్ రాజు తమ్ముడు చిత్రం గురించి మాట్లాడుతూ.. ముందుగా ఈ చిత్రాన్ని హీరో నానితో చేద్దామని అనుకున్నట్లు తెలిపారు. కానీ నాని ఆ టైంలో బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. ఆ తర్వాత నితిన్ ని ఎంపిక చేశాం. తమ్ముడు చిత్రం ఫ్యామిలీ స్టోరీ కాదు. అద్భుతమైన విజువల్స్ ఉండే థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ. అందుకే బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు అని దిల్ రాజు తెలిపారు. కేవలం సినిమా మేకింగ్ కోసమే 35 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
Suhana Khan: వామ్మో.. సుహానా ఖాన్ డ్రెస్సుల ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. లక్షల్లో కాస్ట్!
Recommended image2
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Recommended image3
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Related Stories
Recommended image1
ఇండియాలోనే రిచెస్ట్ యాంకర్, 195 కోట్ల రెమ్యునరేషన్ తో సంచలనం.. ప్రభాస్, బన్నీ కూడా అతడి ముందు దిగదుడుపే
Recommended image2
మంచు విష్ణుకి షాకిచ్చిన కుమార్తెలు.. నోస్ జాబ్ చేయించుకోమని చురకలు, ఎందుకంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved